Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రాణం తీసిన ఊపిరితిత్తుల మార్పిడి.. ప్రపంచంలోనే తొలి అవయవ మార్పిడి కరోనా మృతిగా చెబుతున్న అధికారులు..

Transplant Patient Dies : అవయవ మార్పిడి విధానంలో తొలిసారి కరోనా వైరస్‌ మృతి సంభవించింది. కరోనా సోకిన వ్యక్తి ఊపిరితిత్తులు మార్పిడి చేయడంతో

ప్రాణం తీసిన ఊపిరితిత్తుల మార్పిడి.. ప్రపంచంలోనే తొలి అవయవ మార్పిడి కరోనా మృతిగా చెబుతున్న అధికారులు..
Follow us
uppula Raju

|

Updated on: Feb 26, 2021 | 5:36 AM

Transplant Patient Dies : అవయవ మార్పిడి విధానంలో తొలిసారి కరోనా వైరస్‌ మృతి సంభవించింది. కరోనా సోకిన వ్యక్తి ఊపిరితిత్తులు మార్పిడి చేయడంతో పొందిన వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన అమెరికాలోని మిషెగావ్‌ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ప్రపంచంలోనే తొలి అవయవ మార్పిడి కరోనా మరణంగా అధికారులు చెబుతున్నారు. ఈ విషయం తెలిసి వైద్యులు నివ్వెరపోయారు. అయితే అవయవ మార్పిడి చికిత్స అందించిన వైద్యుడికి కూడా కరోనా సోకింది. కారు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఓ మహిళ ఆరోగ్యం క్షీణించింది. ఆమె ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతినడంతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. ఈ సమయంలో ఓ వ్యక్తి ఊపిరితిత్తులు అందుబాటులో ఉన్నాయని సమాచారం రావడంతో వైద్యులు వెంటనే వివరాలు సేకరించారు. ఊపిరితిత్తుల మార్పిడికి రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో ఆమెకు ఊపిరితిత్తులు మార్పిడి చికిత్స విజయవంతంగా చేశారు.

అయితే మార్పిడి చేసిన 61 రోజులకు ఆమె మరణించండం వైద్యులు షాకయ్యారు. సక్రమంగా చికిత్స అందించినా ఎందుకు ఇలా అయ్యిందని మొత్తం చికిత్స విధానమంతా అధ్యయనం చేశారు. ఈ క్రమంలో వారికి ఊహించని సమాధానం లభించింది. ఊపిరితిత్తులు ఇచ్చిన దాతకు కరోనా సోకిందనే విషయం తెలిసింది. ఆ కరోనా ఇంకా ఊపిరితిత్తుల్లో నిక్షేపమై ఉంది. అవయవదానం పొందిన మహిళకు కూడా కరోనా సోకింది. అంతర్గతంగా కరోనా వైరస్‌ ఊపిరితిత్తుల్లో విస్తరించి ఆమె ప్రాణం తీసిందని వైద్యులు గుర్తించి షాక్‌కు గురయ్యారు.

ఇదిలా ఉంటే..

దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి మళ్లీ పెరుగుతోంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. కేసులు పెరుగుతున్న రాష్ట్రాల్లోకి ఇతర రాష్ట్రాల ప్రయాణికులను వచ్చేందుకు నిబంధనలు విధిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోనుంది. మళ్లీ లాక్​డౌన్​ విధించే అవకాశం ఉందా? అన్న చర్చ సాగుతోంది. దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ పడగ విప్పుతున్నట్టే కనిపిస్తోంది. రోజువారీ కేసుల సంఖ్య కొద్ది రోజులుగా పెరుగుతూ పోతుండడం ఆందోళన కలిగిస్తోంది. దాదాపు పదకొండు నెలల క్రితం విధించిన లాక్​డౌన్​ పరిస్థితులు మళ్లీ వస్తాయేమోనన్న భయాలు వెంటాడుతున్నాయి.

సెప్టెంబర్ నెల మధ్యలో రోజుకు సగటున 90 వేలకు పైగా కేసులు వెలుగులోకి వచ్చాయి. తర్వాత ఆ గ్రాఫ్ తగ్గుతూ వచ్చినా.. ప్రస్తుతం మళ్లీ వాటి సంఖ్య కలవర పెడుతోంది. ప్రతిరోజు సగటున 16 వేల వరకు కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితి ఆందోళకరంగా మారింది. మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, గుజరాత్, చత్తీస్​గఢ్ రాష్ట్రాల్లో సగటు కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో కరోనా కట్టడికి ఆయా ప్రభుత్వాలు ఆంక్షల వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి.

మహారాష్ట్రలోని పుణెలో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేస్తోంది. అమరావతి జిల్లాలో వారంరోజుల పాటు పూర్తి లాక్​డౌన్​ విధించింది. మార్చి 1 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. రాజకీయ, మతపరమైన ర్యాలీలతో పాటు.. ప్రజలు గుమికూడే కార్యక్రమాలపైనా నిషేధం అమలవుతోంది. కొవిడ్‌ నిబంధనలు పాటించకుంటే లాక్‌డౌన్‌ పొడగించే అవకాశాలు కూడా ఉన్నాయని హెచ్చరించింది.

కరోనా టీకా వేయించుకున్న కమలా హారీస్.. మోడరనా వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్నట్లు ట్వీట్..

అల‌ర్ట్ : క‌రోనా రోగుల్లో బ‌య‌ట‌ప‌డ్డ మ‌రో ప్రాణాంత‌క ఇన్ఫెక్ష‌న్‌.. సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించిన వైద్య నిపుణులు