అల‌ర్ట్ : క‌రోనా రోగుల్లో బ‌య‌ట‌ప‌డ్డ మ‌రో ప్రాణాంత‌క ఇన్ఫెక్ష‌న్‌.. సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించిన వైద్య నిపుణులు

కరోనా మహమ్మారి చేస్తున్ననష్టం అంతా ఇంతా కాదు. కోవిడ్ సోకిన రోగుల్లో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. కోవిడ్ సోకిన వారిలో మళ్లీ కోలుకున్న తర్వాత కొన్ని రోజుల్లోనే ఇన్ఫెక్ష‌న్ సోక‌డం....

అల‌ర్ట్ : క‌రోనా రోగుల్లో బ‌య‌ట‌ప‌డ్డ మ‌రో ప్రాణాంత‌క ఇన్ఫెక్ష‌న్‌.. సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించిన వైద్య నిపుణులు
ganga ram hospital
Follow us

|

Updated on: Dec 15, 2020 | 11:55 AM

కరోనా మహమ్మారి చేస్తున్ననష్టం అంతా ఇంతా కాదు. కోవిడ్ సోకిన రోగుల్లో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. కోవిడ్ సోకిన వారిలో మళ్లీ కోలుకున్న తర్వాత కొన్ని రోజుల్లోనే ఇన్ఫెక్ష‌న్ సోక‌డం, ద‌వ‌డ‌లు వంక‌ర పోవ‌డం, ముఖ్యంగా కంటి చూపు మంద‌గించ‌డం వంటి స‌మ‌స్య‌లు త‌లెత్త‌డంతో మ‌ళ్లీ ఆస్ప‌త్రుల్లో చేర‌క త‌ప్ప‌డం లేదు. క‌రోనా సోకిన త‌ర్వాత కంటి చూపు మంద‌గించ‌డంతో తిరిగి ఆస్ప‌త్రుల్లో చేరుతున్నారు. తాజాగా ఢిల్లీలోని గంగారామ్ ఆస్ప‌త్రి వైద్యులు ప‌లు సంచ‌ల‌న విష‌యాల‌ను వెల్ల‌డించారు. క‌రోన సోకిన వారికి ఇన్‌ఫెక్ష‌న్ సోక‌డం, కంటి చూపు మంద‌గించ‌డం లాంటివి గుర్తించిన‌ట్లు ఆస్ప‌త్రి వైద్యులు తెలిపారు.

కోవిడ్ రోగుల్లో రోగ‌నిరోధ‌క శ‌క్తి కోల్పోయి ఫంగ‌స్ ఇన్‌ఫెక్ష‌న్ బారిన ప‌డుతున్న‌ట్లు వైద్యులు వెల్ల‌డించారు. ఢిల్లీలోని గంగారామ్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న రోగుల్లో గ‌త 15 రోజుల్లో 12 మందికి తీవ్ర ప్రాణాంత‌క‌మైన ఇన్‌ఫెక్ష‌న్ సోకిన‌ట్లు గుర్తించారు. మూత్ర‌పిండాల వ్యాధి, మ‌ధుమేహం ఉన్న‌వారిలో కోవిడ్ మ‌రింత ప్ర‌భావం చూపుతుంద‌న్నారు. అలాంటి వారిలో రోగ‌నిరోధ‌క శ‌క్తి త‌గ్గ‌డ‌మే కాకుండా కంటి చూపు కోల్పోయే ప్ర‌మాదం ఉంద‌ని త‌మ ప‌రిశీలన‌లో తేలిన‌ట్లు ఆస్ప‌త్రి వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

కాగా, ఢిల్లీకి చెందిన 32 ఏళ్ల వ్యాపార‌వేత్త‌కు న‌వంబ‌ర్ 20న కోవిడ్ ఉన్న‌ట్లు నిర్ధార‌ణ అయింది. అత‌నికి జ్వ‌రం తీవ్ర‌మై ద‌గ్గు, శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బంది మొద‌లైంది. అత‌న్ని ఆస్ప‌త్రిలో చేర్పించారు. అత‌నికి ఇత‌ర మందులు, ఆక్సిజ‌న్ అంద‌జేశారు. ఏడు రోజుల త‌ర్వాత డిశ్చార్జ్ చేశారు. ఈ నేప‌థ్యంలో అత‌నికి ఎండ‌మ ద‌వ‌డ‌, క‌న్ను, ఎముక‌లు, కండ‌రాలు, మెదుడుపై తీవ్ర ప్ర‌భావం చూపింది. తీరా అత‌నికి యాంటీవైర‌స్ మందులు, క్రిటిక‌ల్ కేర్ సపోర్టు ఇచ్చారు. దీంతో ఆయ‌న నెమ్మ‌దిగా కోలుకున్నారు. ఇలా కోవిడ్ సోకిన చాలామంది ఇన్‌ఫెక్ష‌న్‌కు గుర‌వుతున్న‌ట్లు ఆస్ప‌త్రి వైద్యులు తెలిపారు. వీలైనంత త్వ‌ర‌గా యాంటీ ఫంగ‌స్ థెర‌పీని ప్రారంభించాల‌ని సూచిస్తున్నారు.

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ