20వ రోజుకు చేరిన అన్నదాతల ఆందోళన, భవిష్యత్ కార్యాచరణపై నేడు రైతు సంఘాల చర్చలు

రైతు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అన్నదాతలు కొనసాగిస్తున్న అందోళన మంగళవారం నాటికి  20  వ రోజుకు చేరుకుంది. ఢిల్లీ-హర్యానా సింఘు బోర్డర్ లో ఇప్పటికీ నిరసన తెలుపుతున్న రైతులతో వేలాది మహిళలు కూడా  కలిసి ధర్నాకు కూర్చున్నారు.

20వ రోజుకు చేరిన అన్నదాతల ఆందోళన, భవిష్యత్ కార్యాచరణపై నేడు రైతు సంఘాల చర్చలు
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Dec 15, 2020 | 12:05 PM

రైతు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అన్నదాతలు కొనసాగిస్తున్న అందోళన మంగళవారం నాటికి  20  వ రోజుకు చేరుకుంది. ఢిల్లీ-హర్యానా సింఘు బోర్డర్ లో ఇప్పటికీ నిరసన తెలుపుతున్న రైతులతో వేలాది మహిళలు కూడా  కలిసి ధర్నాకు కూర్చున్నారు. రైతు సంఘాలు నేడు రెండు సార్లు సమావేశమై తమ భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నాయి. సింఘు సరిహద్దుల్లో పారిశుధ్య పరిస్థితి రోజురోజుకీ అధ్వాన్నంగా మారుతోందని, వాష్ రూమ్స్ లో నీరు కూడా లేదని రైతులు వాపోతున్నారు. అయినా తమ డిమాండ్ తీరేవరకు వెనక్కి వెళ్ళేది లేదంటున్నారు. రైతు చట్టాలు కేవలం బడా వ్యాపారులకే ప్రయోజనకరమని, తమకు కాదని కిసాన్ మహా పంచాయత్ నేత రామ్ పాల్ జాట్ ఆరోపించారు.  అటు-ప్రతి క్లాజు పైనా చర్చించేందుకు తాము రెడీగా ఉన్నామని కేంద్రం చెబుతోంది. అసలు ఈ చట్టాలను అన్నదాతలు సరిగా అర్థం చేసుకోవాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కోరారు.

మరోవైపు గుజరాత్ కు చెందిన రైతులతో ప్రధాని మోదీ మంగళవారం ఇంటరాక్ట్ కానున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, హోం మంత్రి అమిత్ షాతో నిన్న పలుమార్లు సమావేశమై రైతుల ఆందోళనపై చర్చించారు.