తమిళ నటి చిత్ర మృతి కేసు కొలిక్కి.. భర్త హేమనాధే కారణమని నిర్ధారణకు వచ్చిన పోలీసులు

తమిళ నటి చిత్ర మృతి కేసు ఓ కొలిక్కి వచ్చింది. భర్త హేమనాధే చిత్ర చావుకి కారణమని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అల్లుడు హేమనాధే తమ కూతుర్ని..

తమిళ నటి చిత్ర మృతి కేసు కొలిక్కి.. భర్త హేమనాధే కారణమని నిర్ధారణకు వచ్చిన పోలీసులు
Follow us
Venkata Narayana

|

Updated on: Dec 15, 2020 | 11:49 AM

తమిళ నటి చిత్ర మృతి కేసు ఓ కొలిక్కి వచ్చింది. భర్త హేమనాధే చిత్ర చావుకి కారణమని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అల్లుడు హేమనాధే తమ కూతుర్ని హత్య చేశాడని చిత్ర తల్లిదండ్రులు ఆరోపించడంతో… ఆ కోణంలో పోలీసులు విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. చిత్ర ఆత్మహత్య చేసుకున్న రోజు అదే హోటల్‌లో భర్త హేమనాథ్ కూడా ఉన్నాడు. భర్త వేధింపు వల్లే చిత్ర ఆత్మహత్య చేసుకుందని నిర్ధారణకు వచ్చిన పోలీసులు ఆరు రోజుల విచారణ అనంతరం హేమనాథ్ ను అరెస్ట్‌ చేశారు. ఇలాఉండగా, మొదటి నుంచి చిత్ర సూసైడ్‌ వెనుక ఎన్నో అనుమానాలు.. ఇంకెన్నో సందేహాలు. తల్లిదండ్రులు అల్లుడే హంతకుడని పదే పదే చెప్పడంతో ఆ కోణంలో దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు…ఎట్టకేలకు హేమనాథ్ ను అరెస్ట్‌ చేశారు.

పాండియన్‌ స్టార్స్‌ అనే సీరియల్‌తో తమిళ ప్రేక్షకులకు చేరువైన చిత్ర ఈ నెల 9న విగతజీవిగా మారింది. చెన్నైలోని ఓ హోటల్‌ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే చిత్ర మృతదేహానికి సంబంధించిన పలు ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారడంతో ఆమె మృతిపట్ల పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలోనే చిత్ర తల్లిదండ్రులు కూడా మృతిపట్ల తమకున్న అనుమానాలను బయటపెట్టారు. తన అల్లుడు హేమనాథ్ చిత్రను కొట్టి చంపేశాడన్నారు. అందుకే ఆమె డెడ్‌బాడీపై చెంపదెబ్బల ఆనవాళ్లు ఉన్నాయన్నారు. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తు పోలీసులకు ఫిర్యారు చేశారు. ఎట్టకేలకు చిత్ర మృతి వెనుక నిజాలు నిగ్గు తేల్చారు పోలీసులు.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!