కోవిడ్ 19 ఎఫెక్ట్, పార్లమెంట్ శీతాకాల సమావేశాల రద్దు, మళ్లీ జనవరిలోనే !
పార్లమెంట్ శీతాకాల సమావేశాలను రద్దు చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. అన్ని పార్టీలతోనూ చర్చించి ఏకాభిప్రాయాన్ని సాధించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ తెలిపారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలను రద్దు చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. అన్ని పార్టీలతోనూ చర్చించి ఏకాభిప్రాయాన్ని సాధించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ తెలిపారు. కోవిడ్ కారణంగా ప్రస్తుతం శీతాకాల సమావేశాలను నిర్వహించరాదని సభ్యులంతా కోరారని ఆయన వెల్లడించారు. జనవరిలో బడ్జెట్ సెషన్ ని నిర్వహించాలని సూచించారన్నారు. వివాదా స్పద రైతు చట్టలపైనా, అన్నదాతల ఆందోళన పైనా చర్చించేందుకు పార్లమెంటును సమావేశపరచాలని లోక్ సభలో కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి కోరగా.. కోవిద్ కారణంగా సమావేశపరచలేమని ప్రహ్లాద్ జోషీ ఆయనకు లేఖ రాశారు. ఆరు నెలల్లోగా పార్లమెంటును సమావేశపరచాలని రాజ్యాంగం సూచిస్తోంది.
జనవరి చివరి వారంలో బడ్జెట్ సెషన్ ను నిర్వహించి ఫిబ్రవరి 1 న కేంద్రం బడ్జెట్ ను సభకు సమర్పించాల్సి ఉంది. గత సెప్టెంబరులో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను మధ్యలోనే అర్ధాంతరంగా ముగించాల్సి వచ్చింది. 17 మంది లోక్ సభ, ఎనిమిది మంది రాజ్యసభ సభ్యులు కరోనా వైరస్ బారిన పడడంతో ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.