Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wrongly Convicted: తప్పు చేయకుండానే 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాడు.. కన్నతల్లిని కడచూపు కూడా చూసుకోలేకపోయాడు..

Wrongly Convicted: వంది మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ.. ఒక్క నిర్ధోషికి కూడా శిక్ష పడకూడదు అనే వ్యాఖ్యం చాలా సందర్భాలో..

Wrongly Convicted: తప్పు చేయకుండానే 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాడు.. కన్నతల్లిని కడచూపు కూడా చూసుకోలేకపోయాడు..
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 26, 2021 | 8:18 AM

Wrongly Convicted: వంది మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ.. ఒక్క నిర్ధోషికి కూడా శిక్ష పడకూడదు అనే వ్యాఖ్యం చాలా సందర్భాలో వినే ఉంటాం. కానీ ఇక్కడ యూపీకి చెందిన ఓ వ్యక్తి తప్పు చేయకుండానే దాదాపు 20 జైలు శిక్ష అనుభవించాడు. చివరికి 16 ఏళ్ల విచారణ అనంతరం ఆ వ్యక్తిని న్యాయస్థానం నిర్ధోషిగా ప్రకటించింది. 23 ఏళ్ల వయస్సులో అరెస్టైన అతని వయస్సు ఇప్పుడు 43 ఏళ్లు. అయితే, ఇరవై ఏళ్ల జైలు శిక్షా కాలంలో సదరు వ్యక్తి ఎంతో కోల్పోయాడు. చివరికి కన్న తల్లి కడచూపును కూడా నోచులేకపోయాడు.

పూర్తి వివరాల్లోకెళితే.. సెప్టెంబర్ 2000 లో, యూపీలోని లలిత్పూర్ జిల్లాకు చెందిన ఓ దళిత మహిళ తనపై విష్ణు తివారీ అనే వ్యక్తి అత్యాచారం చేశాడని ఆరోపించింది. విష్ణు తీవారి వయస్సు అప్పుడు 23 ఏళ్లు. మహిళ ఫిర్యాదు మేరకు ఐపిసి సెక్షన్ 376, 506, ఎస్సీ / ఎస్సీ చట్టంలోని సెక్షన్ 3 (1) (7), 3 (2) (5) కింద విష్ణు తివారీపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాదు.. ఈ కేసులో న్యాయస్థానం విష్ణుకు జీవిత ఖైదు విధించింది. దాంతో అతన్ని ఆగ్రా జైలుకు తరలించారు. అయితే, స్థానిక కోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా 2005 లో విష్ణు హైకోర్టులో అప్పీల్ చేశాడు. కాని ఈ కేసును హైకోర్టు ధర్మాసనం 16 సంవత్సరాలు విచారించలేదు. తరువాత, స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ న్యాయవాది శ్వేతా సింగ్ రానాను డిఫెన్స్ న్యాయవాదిగా విష్ణు తరఫున కోర్టులో వాదించడానికి ముందుకు వచ్చారు. దాంతో ఈ కేసు మళ్లీ 16 సంవత్సరాల తరువాత అలహాబాద్ హైకోర్టులో విచారణకు వచ్చింది.

సాక్ష్యం లేకపోవడంతో కోర్టు నిర్దోషిగా ప్రకటించింది.. తాజాగా అలహాబాద్ హైకోర్టు జస్టిస్ కౌషల్ జయేంద్ర ఠాకూర్, జస్టిస్ గౌతమ్ చౌదరి నేతృత్వంలోని ధర్మాసనం.. ‘వాస్తవాలు, సాక్ష్యాలను పరిశీలించిన మీదట నిందితులు తప్పుడు కేసులో శిక్షించబడ్డాడని మేము విశ్వసిస్తున్నాము. ట్రయల్స్ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేస్తున్నాం’ అంటూ నిందితుడుని నిర్ధోషిగా ప్రకటించింది.

‘అంకుల్ జీవితమంతా నాశనమైంది’ ఇదిలాఉంటే.. విష్ణు మేనల్లుడు సత్యేంద్ర మీడియాతో మాట్లాడారు. ‘మామయ్య ఈ విధంగా తప్పుగా శిక్షించబడటం వల్ల నా కుటుంబం మొత్తం ఆర్థికంగా, సామాజికంగా చిన్నాభిన్నమైంది. ఈ కేసు కారణంగా.. నా తండ్రి, మామ, తాతమ్మలను కోల్పోయాను. సామాజిక బహిష్కరణను ఎదుర్కొన్నాను. ఈ కేసులో పోరాడటానికి కుటుంబ భూమిలో ఎక్కువ భాగం అమ్మాల్సి వచ్చింది. మా మామయ్య ఎలాంటి తప్పు చేయకుండానే జైలు జీవితం గడపవలసి వచ్చింది. ఆయన జీవితం అంతా నాశనమైంది.’ అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

తల్లి కడచూపు కూడా నోచుకోలేదు.. అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే.. విష్ణు జైల్లో ఉన్న సమయంలోనే అతని తల్లి చనిపోయారు. ఆ సందర్భంగా అంత్యక్రియల్లో పాల్గొనేందుకు అవకాశం ఇవ్వాలని కోర్టును కోరినా.. కోర్టు అనుమతి ఇవ్వలేదు. దాంతో అతను తన తల్లి కడచూపు కూడా నోచుకోలేదు. కన్న కొడుకు లేకుండానే ఆమె అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. ఏ వ్యక్తికైనా ఇంతకంటే బాధాకరమైన ఘటన ఉండదనే చెప్పాలి.

Also read:

Bharat Bandh Today: నేడు భారత్ బంద్.. దేశవ్యాప్తంగా పాల్గొననున్న 40వేల వాణిజ్య సంఘాలు

కేంద్ర ప్రభుత్వం కఠిన నిబంధనలు.. దేశంలో వాట్సప్ బ్యాన్ అవుతుందా?.. కీలక విషయాలు తెలుసుకోండి..