Bharat Bandh Today: నేడు భారత్ బంద్.. దేశవ్యాప్తంగా పాల్గొననున్న 40వేల వాణిజ్య సంఘాలు

Bharat Bandh Updates: దేశంలో నిత్యం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు, జీఎస్టీ నియమాల్లో మార్పులు, ఈ-వే బిల్లుంగ్‌లకు నిరసనగా అఖిల భారత ట్రేడర్ల...

Bharat Bandh Today: నేడు భారత్ బంద్.. దేశవ్యాప్తంగా పాల్గొననున్న 40వేల వాణిజ్య సంఘాలు
Follow us

|

Updated on: Feb 26, 2021 | 7:04 AM

Bharat Bandh Updates: దేశంలో నిత్యం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు, జీఎస్టీ నియమాల్లో మార్పులు, ఈ-వే బిల్లుంగ్‌లకు నిరసనగా అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య శుక్రవారం దేశవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చాయి. దేశవ్యాప్తంగా ఇంధన ధరలు ఒకేలా ఉండాలని.. దేశవ్యాప్తంగా 8 కోట్ల మందికి ప్రాతినిథ్యం వహిస్తున్న 40,000 సంఘాలు ఈ బంద్‌లో పాల్గొంటాయని సీఏఐటీ సెక్రటరీ జనరల్‌ ప్రవీణ్‌ ఖండేల్వాల్‌ గురువారం ప్రకటించారు. ఈ బంద్‌లో లారీ యజమానుల సంఘం, అఖిల భారత రవాణా సంక్షేమ సంఘం కూడా పాల్గొననున్నట్లు కార్మిక సంఘాలు వెల్లడించాయి.

మొదట చెప్పిన విధంగా జీఎస్టీని అమలు చేయడం లేదని సీఏఐటీ సెక్రటరీ జనరల్‌ ప్రవీణ్‌ ఖండేల్వాల్‌ తెలిపారు. దీనివల్ల ఇన్‌పుట్‌ టాక్స్‌ క్రెడిట్‌ వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని దేశంలోని అనేక వ్యాపార సంఘాలు 200 జిల్లాల కలెక్టర్ల ద్వారా ఫిబ్రవరి 22న ప్రధాని మోదీకి మెమొరాండం పంపాయన్నారు. జీఎస్టీ నియమాల్ని పున:పరిశీలించాలని ఆయన వెల్లడించారు. దీంతోపాటు పెరుగుతున్న పెట్రో ధరలు కూడా సామాన్యులకు పెనుశాపంగా మారాయని గుర్తు చేశారు. పెట్రో ధరలు తగ్గించకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని లారీ యజమానుల సంఘం హెచ్చరించింది.

ఇదిలాఉంటే.. బంద్‌లో తాము పాల్గొనబోవడం లేదని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా వ్యాపార్‌ మండల్‌, భారతీయ ఉద్యోగ్‌ వ్యాపార్‌ మండల్‌ స్పష్టం చేశాయి. ఈ రెండు సంఘాల కింద కూడా వందల సంఖ్యలో యూనియన్లున్నాయి. దీంతో ఈ బంద్‌కు ఏ మేరకు స్పందన లభిస్తుందన్నది వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశమైంది.

కాగా.. ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా బంద్ నిర్వహించనున్నట్లు ట్రేడ్ యూనియన్లు వెల్లడించాయి. బంద్ నేపథ్యంలో లారీలను నడపవద్దంటూ లారీ యజమానుల సంఘం వెల్లడించింది.

Also Read:

తమిళనాడులోని శివకాశిలో భారీ పేలుడు.. ఆరుగురు మృతి.. 14 మందికి గాయాలు.. వరుసగా జరుగుతున్న పేలుళ్లు..

రైల్వే శాఖ కీలక నిర్ణయం.. జనరల్ టికెట్ బుక్కింగ్ ఇప్పుడిక మరింత ఈజీ.. ఇదీ ప్రాసెస్..