అది ప్రభుత్వ ఉద్యోగి హక్కు.. వడ్డీతో సహా మొత్తం చెల్లించాల్సిందే: సుప్రీం కోర్టు సంచలన తీర్పు..

Supreme Court Verdict: ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లను హక్కులుగా సుప్రీం కోర్టు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. దీనిని దృష్టిలో..

అది ప్రభుత్వ ఉద్యోగి హక్కు.. వడ్డీతో సహా మొత్తం చెల్లించాల్సిందే: సుప్రీం కోర్టు సంచలన తీర్పు..
Supreme Court
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 26, 2021 | 11:31 AM

Supreme Court Verdict: ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లను హక్కులుగా సుప్రీం కోర్టు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. జీతాలు, పెన్షన్ల చెల్లింపును ఆలస్యం చేసిన ప్రభుత్వం సహేతుకమైన వడ్డీతో చెల్లించాలని సూచించింది. మాజీ జిల్లా, సెషన్స్ జడ్జి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వివరణాత్మక ఉత్తర్వులను ఇచ్చింది. 2020 మార్చి-ఏప్రిల్ మధ్య వాయిదా వేసిన జీతాన్ని సంవత్సరానికి 12 శాతం చొప్పున వడ్డీతో చెల్లించాలని ఆదేశించింది. అలాగే 2020 మార్చి నెలలో వాయిదా వేసిన పెన్షన్‌ను సైతం వడ్డీతో చెల్లింపులను జరపాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

అసలేం జరిగింది..?

కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభం దృష్ట్యా 2020 మార్చి-ఏప్రిల్ మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల జీతం, పెన్షన్‌ను కొంతకాలం వాయిదా వేసింది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు కూడా ఇచ్చింది. అయితే ఆ తర్వాత ఏప్రిల్‌లో, వైద్య, ఆరోగ్య, పారిశుధ్య కార్మికుల పూర్తి జీతాలను ప్రభుత్వం పునరుద్ధరించింది. అంతేకాకుండా ఏప్రిల్ 26న పెన్షనర్లకు పూర్తి పెన్షన్‌ను సైతం వారి బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేసింది. అయితే ఈ తరుణంలో మాజీ జిల్లా, సెషన్స్ జడ్జి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అందులో, నిలిపివేసిన జీతాలు, పెన్షన్లను చెల్లించాలని డిమాండ్ చేయడమే కాకుండా, ప్రతీ ఉద్యోగికి జీతం,పెన్షన్ ప్రధాన హక్కులుగా పేర్కొన్నారు.

ప్రతీ నెలా చివరి తేదీన జీతాలు చెల్లించాలి…!

మాజీ జిల్లా, సెషన్స్ జడ్జి వేసిన పిల్‌పై హైకోర్టు వివరణాత్మక ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ కోడ్ ఆర్టికల్ 72 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతీ నెలా చివరి తేదీన వేతనం చెల్లించాలని హైకోర్టు తెలిపింది. అయితే ఎవరైనా ఉద్యోగి తప్పిదం చేయడం ద్వారా డిపార్ట్‌మెంటల్ ఎంక్వైరీ లేదా జ్యుడిషియల్ ప్రాసెస్‌లో ఉంటే.. అలాంటివారి పెన్షన్‌ను నిలిపివేయవచ్చునని తెలిపింది. జీతం పొందే వ్యక్తి రాజ్యాంగంలోని ఆర్టికల్ 21లో ఉన్న జీవన హక్కు, ఆర్టికల్ 300ఎలోని ఆస్తి హక్కు కిందకు వస్తారని హైకోర్టు తెలిపింది. నిలిపివేసిన జీతం, పెన్షన్‌ను 12 శాతం వడ్డీతో చెల్లించాలని హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

జీతం ఆపేయడంపై రాష్ట్ర ప్రభుత్వం వాదన ఇదే..

కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభం వల్ల ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లను వాయిదా వేయాలని నిర్ణయించామని.. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో తమ వాదనలను వినిపించింది. అప్పటి పరిస్థితులను దృష్ట్యా ఆ చర్య తీసుకున్నామని.. వడ్డీ చెల్లించాలని చెప్పడం సరైనది కాదని పేర్కొంది.

ఆలస్యం చెల్లింపుపై ఆరు శాతం వడ్డీని చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది..

ఫిబ్రవరి 8న, న్యాయమూర్తులు డి.వై.చంద్రచుడ్, ఎం.ఆర్ షాలతో కూడిన ధర్మాసనం ఆంధ్ర ప్రభుత్వ విజ్ఞప్తిని కొట్టివేసింది, ప్రభుత్వ ఉద్యోగికి జీతం,పెన్షన్ పొందడం హక్కు అని సుప్రీం కోర్టు తెలిపింది. చట్టానికి విరుద్ధంగా పనిచేసినందుకు హైకోర్టు ప్రభుత్వంపై 12 శాతం వడ్డీని విధించిందని ఉద్యోగుల తరపు న్యాయవాది పేర్కొన్నారు. వడ్డీని చెల్లించడం ప్రభుత్వం శిక్షగా తీసుకోరాదని సుప్రీంకోర్టు తెలిపింది. జీతం,పెన్షన్‌ను ఆరు శాతం వడ్డీతో చెల్లించాలని సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

మరిన్ని ఇక్కడ చదవండి:

హైదరాబాద్‌లోని బాలానగర్‌ ఫ్లైఓవర్‌ కుప్పకూలిందా.? వైరల్ అవుతున్న వీడియో.! ఎప్పటిదంటే..!!

Fight With Cheetah: చావు తప్పదనుకుని.. చిరుతతో ఫైట్‌ చేసిన రియల్‌ హీరో.. చివరికి ఏమైందంటే.!

ఈ వింత షార్క్ పిల్ల.. అదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్‌ అట.! నిజంగానే కోట్లు తెచ్చిపెడుతుందా.?

సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
విద్యార్థులకు శుభవార్త.. జనవరి 1 నుంచి 15 వరకు పాఠశాలలకు సెలవులు!
విద్యార్థులకు శుభవార్త.. జనవరి 1 నుంచి 15 వరకు పాఠశాలలకు సెలవులు!
ప్రభాస్ ను ఫాలో అవుతున్న చరణ్, ఎన్టీఆర్
ప్రభాస్ ను ఫాలో అవుతున్న చరణ్, ఎన్టీఆర్