Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: తండ్రి అస్థికలను బీరులో కలిపి.. పబ్ ఎదురుగా ఉన్న డ్రైనేజ్‌లో కలిపిన కొడుకు.. ఇలా ఎందుకు చేశాడో తెలుసా..?

సాధారణంగా  హిందూ సాంప్రదాయం ప్రకారం చనిపోయినవారి అస్థికలను గొప్ప నదులు లేదా సముద్రాల్లో కలుపుతారనే విషయం తెలిసింది. అలా చేస్తే వారి ఆత్మకు శాంతి లభిస్తుందని నమ్ముతారు. అయితే యూకేలోని కావెంట్రీకి చెందిన ఓ వ్యక్తి...

Viral News:  తండ్రి అస్థికలను బీరులో కలిపి.. పబ్ ఎదురుగా ఉన్న డ్రైనేజ్‌లో కలిపిన కొడుకు.. ఇలా ఎందుకు చేశాడో తెలుసా..?
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 26, 2021 | 8:08 PM

Viral News:  సాధారణంగా  హిందూ సాంప్రదాయం ప్రకారం చనిపోయినవారి అస్థికలను గొప్ప నదులు లేదా సముద్రాల్లో కలుపుతారనే విషయం తెలిసింది. అలా చేస్తే వారి ఆత్మకు శాంతి లభిస్తుందని నమ్ముతారు. అయితే యూకేలోని కావెంట్రీకి చెందిన ఓ వ్యక్తి తన తండ్రి అస్థికలను బీరులో కలిపి అందర్నీ షాక్‌కి గురి చేశాడు. అంతటితో ఆగలేదండోయ్.. అస్థికలు కలిపిన ఆ బీరును.. పబ్ డ్రైనేజీలో పోశాడు. దీంతో అందరూ కంగుతిన్నారు. అసలు అతనికి పిచ్చి పట్టిందా ఏంటి అని కొందరు ప్రశ్నించారు. పైత్యం తలకెక్కిందని మరికొందరు వ్యాఖ్యానించారు. తండ్రి అస్థికలను అలా డ్రైనేజీలో పోయడం మరికొందరు అయితే సదరు వ్యక్తిపై విరుచుకుపడ్డారు. అయితే, ఈ ఘటనకు సంబంధించి అతడి వెర్షన్ వేరే ఉంది. అది అతడి తండ్రి చివరి కోరికనట .కెవిన్ మెక్‌గ్లించే అనే వ్యక్తి చనిపోతూ తన కొడుకును ఎవరూ కోరని వింత ఆఖరి కోరిక కోరాడు. తాను మరణించిన తర్వాత ఆస్థికలను తనకు ఎంతో ఇష్టమైన హోలీబుష్‌ పబ్‌కు తీసుకెళ్లాలమని కోరాడు. ఆపై వాటిని బీరులో వాటిని కలిపాలని సూచించాడు. దీంతో కొడుకు తండ్రి ఆఖరి కోరిక నెరవేర్చాడు. కెవిన్ పుట్టిన రోజున కొడుకు ఒవెన్, కూతురు కాస్సిడేలు కలిసి ఆ పబ్‌కు వెళ్లారు. తండ్రి చెప్పినట్లే చేశారు. ఆ తర్వాత ఆ బీరును పబ్ ముందున్న డ్రైనేజీలో పోశారు.

ఈ సందర్భంగా ఓవెన్ మాట్లాడుతూ.. ‘‘దీన్ని కొందరు పిచ్చిగా భావించవచ్చు. కానీ ఇది నా తండ్రి ఆఖరి కోరిక. ఆయన ఎప్పటికీ ఆ ప్రదేశంలోనే ఉంటారు. ఆయన ఎప్పుడూ తన అస్థికలను పబ్‌ డ్రైనేజీలోనే కలపాలని కోరేవాడు. అందుకే, ఇలా ఈ విధంగా చేశాను’’ అని తెలిపాడు. అంతేకాదు.. కెవిన్‌కు ఆ పబ్‌తో ముడిపెట్టి మరో వింత కోరిక కూడా కోరాడు. చనిపోయిన తర్వాత తన తల వెంట్రుకలను కూడా పబ్‌ డ్రైనేజీలో కలపాలని సూచించాడు. అతడు చెప్పినట్లే అతడి కొడుకు, కూతురు అస్థికలతోపాటు కలిపారు. ప్రస్తుతం ఈ టాపిక్ సామాజిక మాధ్యమాల్లో తెగ ట్రెండ్ అవుతుంది. ఇదండి తండ్రి అస్థికలను బీరులో కలిపి ఘటన వెనుక ఉన్న అసలు సంగతి. ఇలాంటి వింత ఆఖరి కోరికలు ఎప్పుడూ వినలేదు కదూ..!