AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

No Baggage Charges: ఎలాంటి లగేజీ లేకుండా విమాన ప్రయాణం చేసే వారికి గుడ్‌న్యూస్‌.. టికెట్‌ ధరల్లో రాయితీలు

No Baggage Charges: విమాన ప్రయాణికులకు శుభవార్త. దేశంలో కరోనా వ్యాప్తి కంటే ముందు దేశీయ విమానాయాన ధరలు కొంత వరకు సామాన్యులకు అందుబాటులో ఉండేవి. విమానయాన ...

No Baggage Charges: ఎలాంటి లగేజీ లేకుండా విమాన ప్రయాణం చేసే వారికి గుడ్‌న్యూస్‌.. టికెట్‌ ధరల్లో రాయితీలు
Subhash Goud
|

Updated on: Feb 26, 2021 | 7:31 PM

Share

No Baggage Charges: విమాన ప్రయాణికులకు శుభవార్త. దేశంలో కరోనా వ్యాప్తి కంటే ముందు దేశీయ విమానాయాన ధరలు కొంత వరకు సామాన్యులకు అందుబాటులో ఉండేవి. విమానయాన సంస్థలు పోటీపడుతూ ఎన్నో డిస్కౌంట్‌లు, ఆఫర్లు ప్రకటించేవి. అయితే కరోనా లాక్‌డౌన్‌ తర్వాత పరిస్థిలన్ని పూర్తిగా మారిపోయాయి. అలాగే ప్రయాణికులు లేక విమానయాన సంస్థలు భారీగా నష్టపోయాయి. కరోనా మహమ్మారి వల్ల కలిగిన నష్టాలను రాబట్టడానికి విమానయాన సంస్థలుతమ ఛార్జీలను పెంచక తప్పలేదు. దీంతో విమాన ప్రయాణం ఇప్పుడు మరింత ఖరీదైపోయింది. అయితే చాలా కాలం తర్వాత మళ్లీ ఇప్పుడు దేశీయ విమాన ప్రయాణం అందుబాటు ధరల్లోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఎలాంటి లగేజ్‌ లేకుండా ప్రయాణించే వారి కోసం డొమెస్టిక్‌ ఎయిర్‌లైన్స్‌లలో రాయితీలు లభించనున్నాయి.

డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డిజిసిఏ) కొత్త మార్గదర్శకాల ప్రకారం.. చెక్‌-ఇన్‌ బ్యాగులు లేకుండా దేశీయంగా ప్రయాణించేవారి కోసం టికెట్‌ ధరల్లో రాయితీలు ఇస్తోంది. అయితే ఎలాంటి చెక్‌ఇన్‌ లగేజీ లేకుండా కేవలం క్యాబిన్‌ సామాను మాత్రమే తీసుకెళ్లే ప్రయాణికులకు టికెట్‌ ధరలలో ఇప్పుడు రాయితీలు ఇవ్వడానికి దేశీయ విమాన ఆపరేటర్లకు అనుమతి ఇచ్చినట్లు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ తెలిపింది.

ఎయిర్‌లైన్స్‌ లగేజీ పాలసీలో భాగంగా ముందు షెడ్యూల్‌ చేయబడిన ఎయిర్‌లైన్స్‌లలో జీరో లగేజ్‌ ఛార్జీలు కల్పించడానికి అనుమతించబడతాయి. జీరో లగేజ్‌ ఛార్జీల పథకం కింద ప్రయాణికుల టికెట్‌ బుకింగ్‌ చేసుకునేటప్పుడు తమతో ఎలాంటి లగేజ్‌ తీసుకెళ్లడం లేదని నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. దీంతో మొత్తం ప్రయాణానికి అయ్యే టికెట్‌ ధరల్లో లగేజీ ఛార్జ్‌ తీసివేయబడుతుంది. అయితే ఒక వేళ ప్రయాణికులు లగేజీ ఛార్జీ లేకుండా టికెట్‌ బుక్‌ చేసుకుని, ఆ తర్వాత లగేజీతో విమానాశ్రయానికి వెళ్తే బోర్డింగ్‌ పాస్‌ ఇచ్చే కౌంటర్‌ వద్ద తిరిగి లగేజీ ఛార్జీలు వర్తి్స్తాయని ఏవియేషన్‌ డైరెక్టరేట్‌ స్పష్టం చేసింది. అయితే ఈ విధంగా విమాన ప్రయాణికులకు ప్రయోజనం చేకూరేలా ఈ విధానాన్ని అమలు చేస్తోంది. ఈ విధానానికి సంబంధించి పూర్తి వివరాలు టికెట్‌ బుకింగ్‌ కౌంటర్ల వద్ద ప్రదర్శిస్తారు. అలాగే టికెట్‌లపై కూడా ముద్రించనున్నారు.

అయితే ప్రస్తుతం నిబంధనల ప్రకారం.. ఒక ప్రయాణికులు 7 కిలోల లగేజీ, 15 కిలోల చెక్‌-ఇన్‌ లగేజీని తీసుకెళ్లవచ్చు. అయితే ఇంతకు మించిన సామాను ఏదైనా తీసుకెళ్లినట్లయితే అందుకు అదనపు ఛార్జీలు విధిస్తారు. అనుమతించిన లాగేజీ పరిమితిలో గ్యారేజ్‌ లేకుండా క్యాబిన్‌ సామానుతో మాత్రమే ప్రయాణించే వారికి ఆపరేటర్లకు తక్కువ ధరలకు టికెట్లు ఇవ్వడానికి కొత్త నిబంధనలు అందుబాటులోకి తీసుకువచ్చింది.

అలాగే డిస్కౌంట్‌ పొందడానికి, ప్రయాణికులు టికెట్‌ బుకింగ్‌ చేసుకునే సమయంలో వారు తీసుకెళ్తున్న వస్తువులను తెలుపాల్సి ఉంటుంది. అంతేకాదు అది ఎంత బరువు ఉంటుందనేది టికెట్‌ బుకింగ్‌ సమయంలోనే వివరించాల్సి ఉంటుంది. తాజాగా తీసుకువచ్చని విధానంతో కొంత విమాన ప్రయాణికులకు కొంత మేలు జరగనుంది.

SBI Pension Loans: పెన్షన్‌దారులకు ఎస్‌బీఐ గుడ్‌న్యూస్‌.. ఒక్క ఎస్ఎంఎస్‌తో పెన్షన్‌ లోన్‌ మంజూరు