#WATCH: రైలు ప‌ట్టాల‌పై వ్యక్తి ఆత్మహ‌త్యాయ‌త్నం.. రెప్పపాటులో కాపాడిన రైల్వే పోలీసులు.. వీడియో

Mumbai Virar railway station: దేశ ఆర్థిక రాజధాని ముంబై ఎప్పుడూ బిజీబిజీగా ఉంటుంది. ఉరుకులు పరుగుల జీవనంలో.. మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబైలోని ఓ రైల్వే స్టేషన్‌లో వ్యక్తి ఆత్మాహత్యాయత్నం..

#WATCH: రైలు ప‌ట్టాల‌పై వ్యక్తి ఆత్మహ‌త్యాయ‌త్నం.. రెప్పపాటులో కాపాడిన రైల్వే పోలీసులు.. వీడియో
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 26, 2021 | 3:36 PM

Mumbai Virar railway station: దేశ ఆర్థిక రాజధాని ముంబై ఎప్పుడూ బిజీబిజీగా ఉంటుంది. ఉరుకులు పరుగుల జీవనంలో.. మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబైలోని ఓ రైల్వే స్టేషన్‌లో వ్యక్తి ఆత్మాహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఆత్మహత్య చేసుకునేందుకు పట్టాలపై పడుకున్న వ్యక్తిని రైల్వే పోలీసులు రెప్పపాటులో కాపాడారు. ఈ సంఘటన ముంబైలోని విరార్ రైల్వే స్టేషన్‌లో జరిగింది. విరార్ రైల్వే స్టేష‌న్‌లో అందరూ ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి రైల్వే పట్టాల మీదకు వెళ్లి పడుకున్నాడు. అయితే రైలు ఆతడిని స‌మీపించే లోపు అప్రమత్తమైన రైల్వే పోలీసులు.. రెప్పపాటులో ప‌ట్టాల‌ పైనుంచి పక్కకు లాగేశారు. అత‌డిని లాగేసిన క్షణాల్లోనే రైలు ఆ ట్రాక్ నుంచి వెళ్లిపోవ‌డంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

అయితే తన తల్లి మరణంతో ఆ వ్యక్తి మానసికంగా కుంగిపోయాడని దీంతో.. ఆత్మహత్యకు ప్రయత్నించాడని పోలీసులు వెల్లడించారు. ఇటీవల కాలంలో మహారాష్ట్రలో రైలు ఎక్కుతూ.. జారి పడిపోయిన వారిన కాపాడిన రైల్వే పోలీసులు తాజాగా మరో వ్యక్తిని కాపాడటంతో అందరూ ప్రశంసిస్తున్నారు. ఈ సంఘ‌ట‌న సంబంధించిన దృశ్యాల‌ు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకసారి ఈ వీడియోను పరిశీలించండి.

Assembly Elections Date 2021: ఐదు రాష్ట్రాల్లో మోగనున్న ఎన్నికల నగారా.. ఈ రోజే షెడ్యూల్ ప్రకటన..