కరోనా టీకా తీసుకోవాలనుకునే వారికి ముఖ్య గమనిక : ఈ శని, ఆదివారాల్లో కరోనా టీకాలు వేయరు.. ఎందుకంటే.?

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు విస్తృతంగా కొవిడ్ 19 వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతోంది. అయితే, ఈ వారాంతంలో..

కరోనా టీకా తీసుకోవాలనుకునే వారికి ముఖ్య గమనిక : ఈ శని, ఆదివారాల్లో కరోనా టీకాలు వేయరు.. ఎందుకంటే.?
Sputnik V vaccine
Follow us
Venkata Narayana

|

Updated on: Feb 26, 2021 | 7:08 PM

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు విస్తృతంగా కొవిడ్ 19 వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతోంది. అయితే, ఈ వారాంతంలో ఈ ప్రక్రియకు కొంతమేర విరామం ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. కో-విన్ డిజిటల్ ప్లాట్‌ఫాంను కో-విన్ 1.0 నుండి కో-విన్ 2.0 కు మారడం దృష్ట్యా ఈ శనివారం, ఆదివారం (ఫిబ్రవరి 27 మరియు 28) కోవిడ్ -19 టీకా సెషన్‌లు జరగవు కావున టీకాలు వేయరు. మార్చి 1 నుండి మళ్లీ వ్యాక్సినేషన్ ప్రక్రియ పున:ప్రారంభం అవుతుంది. దీనికి సంబంధించి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇప్పటికే సమాచారం ఇచ్చామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. COVID-19 వ్యాక్సిన్ డెలివరీ, పంపిణీకి సంబంధించిన పర్యవేక్షణ కోసం కో-విన్ సాఫ్ట్‌వేర్ సృష్టించబడిన సంగతి తెలిసిందే.

కాగా, ఆరోగ్య కార్యకర్తలకు టీకాలు వేయడానికి దేశవ్యాప్తంగా COVID-19 టీకాల డ్రైవ్‌ను జనవరి 16 న ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఫ్రంట్‌లైన్ కార్మికులకు టీకాలు వేయడం దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 2 న ప్రారంభమైంది. మార్చి 1 నుండి 60 ఏళ్లు పైబడినవారిని, అనారోగ్యం భారిన ఉన్న 45 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం ఇప్పటికే నిర్ణయించింది. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం అర్హత కలిగిన లబ్ధిదారులు కో – విన్ సాఫ్ట్ వేర్ అప్డేషన్ తరువాత సోమవారం నుండి కో-విన్ ప్లాట్‌ఫామ్‌లో నమోదు చేసుకునే అవకాశం కలుగుతుంది.

60 ఏళ్లు పైబడిన, 45 ఏళ్లు పైబడి కోవర్బిడిటీ ఉన్నవారు మార్చి 1 నుండి ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వం ఉచితంగా అందించే కరోనా టీకాలు పొందొచ్చు. ఇక, ప్రైవేట్ ఆసుపత్రులలో ఛార్జీ చెల్లించి కోవిడ్ -19 వ్యాక్సిన్ పొందగలరని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. అర్హతగల లబ్ధిదారులు మార్చి 1 నుండే కో-విన్ ప్లాట్‌ఫామ్‌లో తమను తాము నమోదు చేసుకోగలుగుతారు. లబ్ధిదారులు టీకాలు వేయడానికి సమీపంలోని సెషన్ సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవటానికి, లేదా దగ్గర్లోని సెంటర్లకు వెళ్లి నమోదు చేసుకునే అవకాశం ఉందని COVID-19 వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ పై ఏర్పాటు చేసిన ఎంపవర్డ్ గ్రూప్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ స్పష్టం చేశారు. లబ్దిదారులు మొబైల్ నంబర్‌ కి వచ్చిన ఓటీపీ ద్వారా నమోదు చేసుకోవాలి.

ప్రపంచంలోని అతిపెద్ద టీకా డ్రైవ్ యొక్క రెండవ దశ సోమవారం నుండి ప్రారంభమవుతుంది. దేశంలో 10 కోట్ల మందికి పైగా ఉన్న 60 ఏళ్లు పైబడిన వాళ్లు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని, ఇందుకోసం 10,000 ప్రభుత్వ వైద్య సదుపాయాలలో టీకాలు ఇవ్వబడతాయని, 20 వేలకు పైగా ప్రైవేట్ ఆస్పత్రుల ద్వారా కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ చెప్పారు.

Read also : వ్యవసాయం చేసి రైతే రాజన్నది నిజం చేయండి, ఎరువులు వదిలి జీవులకు హాని చేయని సేంద్రీయం వైపు మళ్లండి : ఆర్‌ఎస్ఎస్‌ చీఫ్

చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే