వ్యవసాయం చేసి రైతే రాజన్నది నిజం చేయండి, ఎరువులు వదిలి జీవులకు హాని చేయని సేంద్రీయం వైపు మళ్లండి : ఆర్‌ఎస్ఎస్‌ చీఫ్

RSS chief Mahesh Bhagwat : "రైతు రాజు" అనే నినాదం నిజం కావాలన్నారు ఆర్‌ఎస్ఎస్‌ చీఫ్ మహేష్‌ భగవత్. జీవులకు హాని చేసే రసాయన..

వ్యవసాయం చేసి రైతే రాజన్నది నిజం చేయండి, ఎరువులు వదిలి జీవులకు హాని చేయని సేంద్రీయం వైపు మళ్లండి : ఆర్‌ఎస్ఎస్‌ చీఫ్
Follow us
Venkata Narayana

|

Updated on: Feb 26, 2021 | 6:35 PM

RSS chief Mahesh Bhagwat : “రైతు రాజు” అనే నినాదం నిజం కావాలన్నారు ఆర్‌ఎస్ఎస్‌ చీఫ్ మహేష్‌ భగవత్. జీవులకు హాని చేసే రసాయన ఎరువులను వదిలేసి, సేంద్రియ వ్యవసాయం వైపు మారాలని సూచించారు. సేంద్రియ వ్యవసాయం మన సంస్కృతిలో భాగమన్న మహేష్ భగవత్‌.. యువత వ్యవసాయం వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. అంతేకాదు, సేంద్రీయ వ్యవసాయమే భావితరాలకు ఆదర్శం, ఆరోగ్యకరమని భగవత్ వక్కాణించారు. రోగాల కుప్పగా మార్చే రసాయన ఎరువుల వాడకాన్ని దేశంలో బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఏజెన్సీ ప్రాంతాల్లో సేంద్రీయ సాగుపై హర్షం వ్యక్తం చేసిన ఆయన… సేంద్రీయ పద్దతులలో వ్యవసాయం చేస్తున్న గిరిజన రైతులను అభినందించారు.

ఆదిలాబాద్ జిల్లా లింగాపూర్‌లో ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో “సేంద్రియ సేద్యం – రైతు కుటుంబాల ఆత్మీయ సమ్మేళనం” నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్ మోహన్ భగవత్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సమ్మేళనంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పదిహేను వందల రైతు కుటుంబాలు పాల్గొన్నాయి. రసాయన ఎరువుల వల్ల భూసారం దెబ్బ తినడంతో పాటు… గాలి, నీరు, భూమి అన్ని విషతుల్యం అవుతున్నాయని మహేష్ భగవత్‌ రైతులకు సూచించారు. విదేశాల్లో రసాయన ఎరువులు వాడుతున్నప్పటికీ… పంటకు పంటకు మధ్య గ్యాప్ ఎక్కువగా తీసుకుంటారని వివరించారు. సేంద్రియ ఎరువుల వినియోగంతో రైతులే శాస్త్రవేత్తలన్న ఆయన.. సేంద్రియ వ్యవసాయం భారత సాంస్కృతికలో భాగమని గుర్తుచేశారు. రైతులు స్వావలంభన సాధించాలంటే సేంద్రీయ విధానం అవసరమని అన్నారు. కార్పోరేట్ కంపెనీలకు రైతులు గులాంగిరీ చేయాల్సిన పరిస్థితులు పోవాలని ఆకాంక్షించారు.

రైతులు రాజులుగా మారడం కేవలం సేంద్రీయ వ్యవసాయంతోనే సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. రైతు పండించిన పంటకు డిమాండ్ లేకపోతే పారబోయడం కాకుండా ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలని సూచించారు. టమాట రైతులు క్లిష్ట సమయాల్లో పంటను పారబోయకుండా.. సాస్‌ రూపంలోకి మార్చి మార్కెట్లోకి దిగుమతి చేయాలన్నారు. దీని వల్ల రైతుకు మంచి లాభం కూడా వస్తోందన్నారు. దేశానికి అవసరమైన ఆహార పదార్థాలను సేంద్రీయ విధానాలతో పండించుకునే సత్తా మనకు ఉందన్న భగవత్.. వ్యవసాయం మన ధర్మంలో ఉందన్నారు. బీహార్‌లో ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న రైతును.. దేశ యువత ఆదర్శంగా తీసుకోవాలని మహేష్ భగవత్‌ సూచించారు. రైతులు రాజులనేది కేవలం నినాదంగానే ఉండిపోకూడదని… అది నిజం కావాలని ఆకాంక్షించారు. దేశంలో రైతుల ఆందోళనల కోసం కాకుండా.. వారి వికాసం కోసం అందరూ ఏకం కావాలని సూచించారు.

Read also : JR NTR Fans: కొందరేమో రా రమ్మని అంటున్నారు.. మరికొందరేమో వద్దు రావొద్దు అంటున్నారు.. నారా వారి సర్కిల్‌లో నందమూరి చిన్నోడు