AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో ఈసారి లెక్క పక్కా. తొలగిన లీగల్‌ అడ్డంకులు.. మున్సిపాల్టీ ఎన్నికలపైనే పార్టీలన్నీ ఫోకస్‌, ప్రమాణపత్రాల రిలీజ్

ఆంధ్రప్రదేశ్ లో మున్సిపాల్టీ ఎన్నికలకు లీగల్‌ అడ్డంకులు కూడా తొలగిపోవడంతో పార్టీలన్నీ ప్రచారంపై ఫోకస్‌ పెట్టాయి. అటు వ్యూహాలు.. ఇటు క్యాంపెయిన్‌..

ఏపీలో ఈసారి లెక్క పక్కా. తొలగిన లీగల్‌ అడ్డంకులు.. మున్సిపాల్టీ ఎన్నికలపైనే పార్టీలన్నీ ఫోకస్‌, ప్రమాణపత్రాల రిలీజ్
Venkata Narayana
|

Updated on: Feb 26, 2021 | 6:15 PM

Share

AP municipal elections : ఆంధ్రప్రదేశ్ లో మున్సిపాల్టీ ఎన్నికలకు లీగల్‌ అడ్డంకులు కూడా తొలగిపోవడంతో పార్టీలన్నీ ప్రచారంపై ఫోకస్‌ పెట్టాయి. అటు వ్యూహాలు.. ఇటు క్యాంపెయిన్‌ ఫుల్‌ స్వింగ్‌లో నడుస్తున్నాయి. పంచాయితీ ఎన్నికల్లోనే మేనిఫెస్టో విడుదల చేసిన తెలుగుదేశం.. మున్సిపాలిటిల్లోనూ పది వాగ్ధానాలంటూ ప్రమాణపత్రం రిలీజ్ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలకు మేనిఫెస్టో ఇవ్వడం 420 చర్యే అంటున్న అధికారపార్టీ ఎస్ఈసీకి ఫిర్యాదు ఇచ్చేందుకు రెడీ అయింది. అధికార, ప్రతిపక్షాల మధ్య వార్‌ నడుస్తుంటే… స్టేట్‌లో వేల కోట్ల నిధులతో పట్టణాలు బాగుచేశామని.. మాకే ఓటేయాలంటోంది బీజేపీ.

ఇదిలాఉంటే, ఎట్టకేలకు ఏపీలో మున్సిపల్‌ ఫైట్‌కు లైన్‌ క్లియర్‌ అయింది. ఇప్పటికే ప్రక్రియ మొదలైనందున… మధ్యలో ఆపలేమని స్పష్టం చేసింది హైకోర్టు. మొదటి నుంచీ చేపట్టాలన్న 16 పిటిషన్లను కొట్టేసింది. దీంతో 75 మున్సిపాల్టీలు, 12 కార్పొరేషన్లకు గత షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు జరుగనున్నాయి. మార్చి 10న ఎన్నికలు, 14న కౌంటింగ్‌ ఉంటుంది.

సందట్లో సడేమియాలా కోర్టులో లైన్ క్లియర్‌ కాగానే.. పట్టణాలకు పది వాగ్ధానాలంటూ టీడీపీ మేనిఫెస్టోతో వచ్చింది. పల్లెలు గెలిచాయి. ఇక ఇప్పుడు మనవంతు అంటూ… రెండు పేజీల మేనిఫెస్టో విడుదల చేసింది విపక్షం. 21 నెలల్లో జగన్‌ పట్టణాల్లో ఏం చేశారని ప్రశ్నించిన లోకేష్‌.. “పబ్లిసిటీ పీక్‌… మ్యాటర్‌ వీక్‌” అంటూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మెజార్టీ సీట్లు గెలుస్తామంటున్నారు తమ్ముళ్లు.

మున్సిపోల్స్‌కు టీడీపీ మేనిఫెస్టో విడుదలను 420 పనిగా అభివర్ణించారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. మున్సిపాల్టీలు చేయలేని పనులను కూడా మేనిఫెస్టోలో పెట్టి మరోసారి ప్రజల్ని మోసం చేస్తోందన్నారు. SECకి ఫిర్యాదు చేస్తామన్నారు సజ్జల. అయితే, కేంద్రలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం నగరాలు, పట్టణాల అభివృద్ధి జరగాలంటే మోదీ విధానాలతోనే సాధ్యమని… ఏపీలో వేల కోట్లతో డెవలప్‌ చేశామంటోంది. ప్రజల మద్దతు ఉన్నా… అధికారపార్టీ భయపెట్టి ఏకగ్రీవాలు చేసుకుంటుందన్ని ఆరోపించారు ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు. అయితే, గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి పల్లెల్లో ఎవరికి వారే తమదే విజయమని ప్రచారం చేసుకున్నాయి పార్టీలు. అక్కడ గుర్తులు లేవు. దీంతో లెక్క తేలడం లేదు కానీ మున్సిపాలిటీల్లో పార్టీ సింబల్సే. ఈ ఫలితాలతో మొత్తం జనాభిప్రాయంపై క్లారిటీ వస్తుందా? అనేది ఈ ఎన్నికల ద్వారా ఎంతోకొంత స్పష్టం అయ్యేది మాత్రం క్లియర్.

Read also : JR NTR Fans: కొందరేమో రా రమ్మని అంటున్నారు.. మరికొందరేమో వద్దు రావొద్దు అంటున్నారు.. నారా వారి సర్కిల్‌లో నందమూరి చిన్నోడు