AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అవి చెరిగిపోని మచ్ఛలు, గోద్రా రైలు దహన ఘటనకు 19 ఏళ్ళు, గతపు విషాద స్మృతులు

గుజరాత్ లోని గోధ్రాలో శబర్మతి రైలు దహన ఘటనకు నేటితో 19 ఏళ్ళు.. ఇనేళ్లయినా ఇది ఘోర దుర్ఘటన ఇంకా నాటి విషాదాన్ని కళ్ళకు కడుతూనే ఉంటుంది.

అవి చెరిగిపోని  మచ్ఛలు, గోద్రా రైలు దహన ఘటనకు 19 ఏళ్ళు, గతపు విషాద స్మృతులు
Umakanth Rao
| Edited By: |

Updated on: Feb 27, 2021 | 11:33 AM

Share

గుజరాత్ లోని గోధ్రాలో శబర్మతి రైలు దహన ఘటనకు నేటితో 19 ఏళ్ళు.. ఇనేళ్లయినా ఇది ఘోర దుర్ఘటన ఇంకా నాటి విషాదాన్ని కళ్ళకు కడుతూనే ఉంటుంది. చెరగని మచ్చగా ఇది నిలిచిపోయింది. 2002 ఫిబ్రవరి 27 న శబర్మతి రైల్లో అయోధ్య నుంచి తిరిగివస్తున్న వారిలో 59 మంది హిందూ భక్తులు, కరసేవకులు సజీవదహనమయ్యారు. గోధ్రా రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన ఈ దుర్ఘటన యావత్ దేశాన్ని కదిలించింది. ఈ ఘటనపై నాటి గుజరాత్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నానావతి- మెహతా కమిషన్ ఆరేళ్లపాటు విచారణ జరిపింది. వెయ్యి నుంచి సుమారు  2 వేలమంది ముస్లిం వర్గం గుంపు ఈ దారుణానికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. ఇది కావాలని చేసింది కాదని, యాదృచ్చికం, యాక్సిడెంట్ అని నాటి కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిషన్ నిర్ధారించడాన్ని రాజ్యాంగ విరుధ్దమైనదిగా ఆ తరువాత ప్రకటించారు. రాజకీయంగా ఈ ఘటన పెను దుమారాన్ని సృష్టించింది. 31 మంది ఈ ఘటనకు కారణమని, ఇందుకు వారు కుట్ర పన్నారని గుజరాత్ హైకోర్టు పేర్కొంది.

గోధ్రా సంఘ్తన తరువాత గుజరాత్ లో పెద్ద ఎత్తున అల్లర్లు, ఘర్షణలు జరిగాయి. భారీగా ప్రాణ, ఆస్తినష్టం సంభవించింది. అల్లర్లలో సుమారు రెండు వేలమందికి పాగా ప్రాణాలు కోల్పోయారు. విశ్వహిందూ పరిషద్ ఇచ్చిన పిలుపుతో గుజరాత్ నుంచి పెద్ద సంఖ్యలో కరసేవకులు, భక్తులు వెళ్లడం, అక్కడ జరిగిన పూర్ణాహుతి మహా యజ్ఞం లో పాల్గొని 1700 మందికి పైగా  శబర్మతి రైలు ఎక్కి అహ్మదాబాద్ కి తిరిగి వస్తుండగా ఈ సజీవ దహన ఘటన జరిగింది. ఈ రైలుకు చెందిన నాలుగు బోగీలకు దుండగులు నిప్పు పెట్టారు. నాటి ఘటనలో 27 మంది మహిళలు, 10 మంది పిల్లలతో సహా 59 మంది సజీవ దహనమయ్యారు. 48 మందికి పైగా గాయపడ్డారు. ఈ కేసులో 2002 ఫిబ్రవరి 28 న  51 మందిని గుజరాత్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు విచారణ కూడా సుదీర్ఘ కాలం కొనసాగింది.

19 ఏళ్ళ తరువాత సూత్రధారి అరెస్ట్ :

19 ఏళ్ళ తరువాత గోధ్రా ఘటనకు కుట్రదారి అని భావిస్తున్న రఫిక్ భటుక్ అనే వ్యక్తిని గోధ్రాలో గత ఆదివారం అరెస్టు చేశారు. 51 ఏళ్ళ ఈ వ్యక్తిని అజ్ఞాత వ్యక్తులు ఇచ్చిన సమాచారంతో గోధ్రా రైల్వే స్టేషన్ సమీపంలోని సిగ్నల్ ఫాలియా అనే ప్రాంతంలో అరెస్టు చేశారు. ఈ కేసులో ఇంకా సలీం ఇబ్రహీం, బాదాం, షౌకత్ ఛార్ఖా, అబ్దుల్ మజీద్ యూసుఫ్ అనే నిందితులు ఇంకా పరారీలో  ఉన్నారు.

Read More :

PSLV-C51: నేడే కౌంట్‌డౌన్.. ‘ప్రైవేట్‌’ భాగస్వామ్యంతో.. ఇస్రో తొలి ప్రయోగం