హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దత్తన్నకు అవమానం, 5 గురు కాంగ్రెస్ సభ్యులపై కేసు దాఖలుకు అవకాశం
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయకు అసెంబ్లీలో జరిగిన ఘోర అవమానంపై స్పీకర్ విపిన్ పర్మర్, బీజేపీ నేత, సీఎం జైరాం ఠాకూర్ తీవ్రంగా స్పందించారు.
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయకు అసెంబ్లీలో జరిగిన ఘోర అవమానంపై స్పీకర్ విపిన్ పర్మర్, బీజేపీ నేత, సీఎం జైరాం ఠాకూర్ తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలి రోజున దత్తాత్రేయను కాంగ్రెస్ సభ్యులు ఘెరావ్ చేసిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో ఐదుగురు కాంగ్రెస్ సభ్యులను స్పీకర్ బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకు..మార్చి 20 వరకు సస్పెండ్ చేశారు. వీరి చర్య పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విపిన్ పర్మర్.. వీరిపై పోలీసు కేసు దాఖలు చేయడానికి గల అవకాశాలను పరిశీలిస్తున్నట్టు తెలిపారు. ఇందుకు సంబంధించిన నిబంధనలను పరిశీలిస్తున్నామన్నారు. అసెంబ్లీ నియమావళి ప్రకారం.. వారిపై గట్టి చర్య తీసుకునే సూచనలు ఉన్నాయన్నారు. దత్తన్నపై దాడి చేసిన విపక్ష నేత ముఖేష్ అగ్నిహోత్రి సహా హర్షవర్ధన్ చౌహాన్, సప్తాహ్ రైజరా, సుందర్ సింగ్, వినయ్ కూమా అనే సభ్యులను సస్పెండ్ చేశారు.
కాగా విపక్ష కాంగ్రెస్ సభ్యుల తీరు అత్యంత దారుణమని సీఎం జైరాం ఠాకూర్ అన్నారు. ప్రతిపక్షం భూమిలో కూరుకుపోవాలని,లేదా ప్రజాగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన అన్నారు. గవర్నర్ వాహనాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించారని, దత్తాత్రేయ వెళ్తుండగా ఆయన ప్రసంగ కాపీలను ఆయనపై విసారి వేశారని ఠాకూర్ పేర్కొన్నారు. ప్రతిపక్ష సభ్యులు ఇలా ఇంత దారుణంగా ప్రవర్తించడం హిమాచల్ అసెంబ్లీ చరిత్రలో ఇదే మొదటిసారి అని ఆయన అన్నారు. విపక్ష నేత చట్టానికి అతీతుడేమీ కాదన్నారు.న కాగా- మొదట ఈ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలనీ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి భరద్వాజ్ తీర్మనాన్ని ప్రతిపాదించారు. విపక్ష సభ్యులు దుర్భాషలాడరాని అటవీ శాఖ మంత్రి రాకేష్ పఠానియా ఆరోపించారు. ఈ ఘటన సిగ్గుచేటని, విపక్షం ప్రభుత్వం పట్ల అసంతృప్తిగా ఉంటే నేరుగా ఆ విషయాన్నీ స్పష్టం చేయవచ్ఛునని ఆయన అన్నారు. ఘన చరిత్రగల హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఈ విధమైన ఘటనలను ఎన్నడూ చూడలేదని పేరుకొన్నారు. ఇతర రాష్ట్రాల్లో గవర్నర్లకు ఈ విధమైన అవమానం జరగలేదని ఆయన చెప్పారు. ఈ రాష్ట్రంలోనే కాదు..ఈ దేశంలోనే కాంగ్రెస్ పార్టీకి అసలు గౌరవమే లేదని మరో మంత్రి వ్యాఖ్యానించారు.
మరిన్ని చదవండి ఇక్కడ :
హత్యకేసులో కోడిపుంజు అరెస్ట్.. అసలు కథ తెలిస్తే షాక్ అవుతారు..!: Cock Arrest Video