‘బీజేపీ సే సబ్ పరేషాన్’, కాషాయ పార్టీ చివరకు దేశానికి కషాయమే మిగిలుస్తుందా ? సామాన్యుడి సణుగుడు
బీజేపీ సే సబ్ పరేషాన్... అవును మరి ! ఈ దేశంలో కాషాయ పార్టీ ప్రభుత్వం ఒక్కొక్కటిగా తీసుకుంటున్ననిర్ణయాలు, చేపడుతున్న చర్యలు గగ్గోలెత్తిస్తున్నాయి.
బీజేపీ సే సబ్ పరేషాన్… అవును మరి ! ఈ దేశంలో కాషాయ పార్టీ ప్రభుత్వం ఒక్కొక్కటిగా తీసుకుంటున్ననిర్ణయాలు, చేపడుతున్న చర్యలు గగ్గోలెత్తిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ అంటే ప్రజా వ్యతిరేక పార్టీ అన్న ముద్రను సంపాదించుకుంటోంది. దేశ వ్యాప్తంగాఇది రైతులు, , కార్మికులు, ఇతర వర్గాలకు వ్యతిరేకమనే అభిప్రాయాలు పెల్లుబుకుతున్నాయి. చివరకు జర్నలిస్టుల్లో సైతం ఒక వర్గం అనుకూలమైతే, మరో వర్గం పూర్తి వ్యతిరేకతను చూపుతోంది. ఇప్పటివరకు చవి చూడని అరాచక చర్యలను జర్నలిస్టులు ఈ ప్రభుత్వ హయాంలో ఎదుర్కొంటున్నారు. ఇక ప్రజా వ్యతిరేక చర్యల్లో ప్యాసింజర్ రైలు చార్జీల పెంపు, ఎన్నడూ లేనిది పాల ధరల పెంపు, మండుతున్న పెట్రోలు, డీజిల్ ధరలు, ఆకాశాన్నంటుతున్న బియ్యం, పండ్లు, కూరగాయలు, వంట గ్యాస్ ధరలు, దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న నిరుద్యోగం, ఇల్లా ఒక్కొక్కటిగా ఎన్నో ఈ ప్రభుత్వ దమననీతికి నిదర్శనాలుగా నిలుస్తున్నాయి. ప్రధాని మోదీ ప్రభుత్వ నిరంకుశ విధానాలను కాంగ్రెస్, ఇతర విపక్షాలు వేలెత్తి చూపుతున్నాయి.
పెట్రోలు, డీజిల్ ధరల ప్రభావం ఇతర అన్ని వస్తువులపైనా పడుతోంది. ముఖ్యంగా పాల ప్యాకెట్లపై ఈ ప్రభావం ఇంతగా ఎన్నడూ చూడలేదని అంటున్నారు. లీటర్ పాలు కేవలం 45-50 రూపాయలుండగా అది 100 రూపాయలకు పెరిగినా పెరగ వచ్చునని పాడి పారిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ విధమైన పరిస్థితిని ఎన్నడూ ఎదుర్కోలేదని ఈ వర్గాలు వ్యాఖ్యానించడం విశేషం. మధ్యప్రదేశ్ లోని రత్లం జిల్లాలో అతి పెద్ద పాడి సహకార సమాఖ్య వర్గాలు ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నాయి. ఇక పెట్రోలు, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇతర దేశాల కన్నా భారతీయులే ఈ ఉత్పత్తులపై పన్నును ఎక్కువగా చెల్లిస్తున్నారని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఉదాహరణకు జర్మనీలో 65 శాతం, ఇటలీలో కూడా ఇదే ఇంతే శాతం ఉండగా.. జపాన్ లో 45, అమెరికాలో 20 శాతం ఉంది. ఇండియాలో అయితే ఇది 260 శాతం ఉందంటే ఈ ప్రభుత్వం ఏ ఏటికాయేడు వీటి ధరలను ఎలా పెంచుకుంటూ పోతోందో అవగతమవుతుంది. ఒకప్పుడు పెట్రోలియం ఉత్పత్తుల ధరలను యూపీఏ ప్రభుత్వం పెంచినప్పుడు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గినప్పటికీ ఈ ప్రభుత్వం వీటి ధరలను పెంచేస్తోందని దుయ్యబట్టింది. కానీ ఇప్పుడీ సర్కార్ చేస్తున్నదేమిటి అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఏ కారణంగా ఇలా ఇష్టం వచ్చినట్టు పెంచుతోంది అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇదే దారిలో వంట గ్యాస్ ధరలు కూడా.. కేబీవలం నెల రోజుల్లో సామాన్యుడి వంట గ్యాస్ ధరలను ఈ ప్రభుత్వం మూడు సార్లు పెంచింది. తమ రాష్ట్రంలో కిరోసిన్ ని వినియోగించే కోటి మంది సామాన్యులు ఉన్నారని, అసలు కిరోసిన్ లభ్యం కాని ఈ పరిస్థితుల్లో వంట గ్యాస్ ధరలను ఇలా పెంచుకుంటూ పోవడం ఈ ప్రభుత్వానికే చెల్లిందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దుయ్యబట్టారు. ఆత్మనిర్భర్ (స్వావలంబన) అన్న పేరిట పలు సంక్షేమ పథకాలను ప్రకటించినప్పటికీ దేశంలో, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు పెద్దగా ఒరిగిందేమీ లేదని, ఈ పరిశ్రమలపై ఆధారపడిన కార్మికులు ఇంకా గడ్డు పరిస్థితినే ఎదుర్కొంటున్నారని అంటున్నారు. దేశంలో నిరుద్యోగం పెరుగుతున్నా కేంద్ర బడ్జెట్ లో వారి భృతికి సంబంధించిన ప్యాకేజీ ఊసే లేదు.
ప్రభుత్వ ఉద్యోగమన్నది సామాన్యుడికి అందని ద్రాక్షే అయింది. ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహిస్తున్నామన్న సర్కార్.. కనీసం ఈ రంగంలో యువతకు ఉద్యోగాల మాట ఎత్తడంలేదు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మివేయడం, ప్రైవేటీకరణ పేరిట విశాఖ ఉక్కుకు కూడా ఈ ‘గ్రహణం’ సోకడం విశేషం. ఇక రైతుల విషయానికే వస్తే మూడు వివాదాస్పద చట్టాలను తెఛ్చి ఆ వర్గం తీవ్ర ఆగ్రహానికి గురైంది. ఈ చట్టాలను రద్దు చేయాలంటూ అన్నదాతలు చేస్తున్న ఆందోళనలు మూడు నెలలుగా కొనసాగుతున్నాయి. ఇప్పటికీ ఈ సమస్య పరిష్కారమయ్యే సూచనలు ఇప్పట్లో కనిపించడం లేదు. 11 దఫాలుగా ప్రభుత్వానికి, రైతు సంఘాలకు మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. కోవిడ్ పాండమిక్ పేరు చెప్పి రైలు సర్వీసులను ఈ ప్రభుత్వం తగ్గించివేసింది. పైగా రైలు చార్జీలను పెంచుకుంటూ పోతోంది. కనీస దూరానికి కూడా కనీస ఛార్జ్ అంటూ ముక్కు పిండి వసూలు చేస్తోంది. ఇప్పటికీ రైలెక్కాలంటే సామాన్యుడు మరీ మరీ ఆలోచించాల్సి వస్తోంది.
జర్నలిస్టులపై ‘కక్ష’ !
మోదీ ప్రభుత్వం జర్నలిస్టులను కూడా వదలలేదన్న ఆరోపణలను ఎదుర్కొంటోంది. ‘ఫ్రీ స్పీచ్ కలెక్టివ్’ అనే సంస్థ..’బిహైండ్ బార్స్ అరెస్ట్స్ అండ్ డిటెన్షన్స్ ఆఫ్ జర్నలిస్ట్స్ ఇన్ ఇండియా-2010-2020′ అన్నశీర్షికతో వెలువరించిన నివేదిక ఇటీవలి సంవత్సరాల్లో తమకు వ్యతిరేకంగా వార్తలు రాసే, లేదా వార్తలను ప్రసారం చేసే మీడియా సంస్థలపైనా ఇతర జర్నలిస్టులపైనా కక్ష గడుతోందట.. ఈ విధమైన కేసులు ఈ మధ్య బాగా పెరిగాయని ఈ సంస్థ తన నివేదికలో పేర్కొంది. ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి కేసులు ఎక్కువగా ఉన్నాయని వెల్లడించింది. యూపీ విషయానికే వస్తే అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసే పత్రికలపై నిఘాకు ఏకంగా ఓ వ్యవస్థే ఉందని తెలుస్తోంది. ఇక ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో ప్రత్యేకించి కొందరిపై ఈడీ, సీబీఐ దాడుల విషయం తెలిసిందే. ఏ బీజేపీ నేత ఇంటిపైనా ఈ దాడులు జరగని విషయం గమనార్షం.. బెంగాల్ లో సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ ముఖర్జీ భార్య రుబిరా పై బొగ్గు చోరీ కేసు పెట్టి ఆమె ఇంటిపై సోదాలు, దాడులు జరిగాయి.
Read More :
వైరల్ అవుతున్న చిరంజీవి, రామ్ చరణ్ ‘ఆచార్య’ లొకేషన్ స్టిల్స్.. మారేడుమిల్లి లో మెగా ఫాన్స్ అభిమానం