Coronavirus: దేశంలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసిన కేంద్రం..
Coronavirus: దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రాల అధికారులతో కేంద్ర కేబినెట్ సెక్రటరీ..
Coronavirus: దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రాల అధికారులతో కేంద్ర కేబినెట్ సెక్రటరీ శనివారం నాడు సమీక్ష జరిపారు. తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్, పంజాబ్, జమ్మూకశ్మీర్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. కరోనా నిబంధనలు అమలు చేయడంలో అలక్ష్యం ప్రదర్శించవద్దని హెచ్చరించారు. శరవేగంగా వ్యాప్తిచెందుతున్న కరోనా రూపాంతర వైరస్ పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో టెస్టింగ్ సామర్థ్యాన్ని పెంచుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఆర్టీ-పీసీఆర్ టెస్టులు ఎక్కువగా చేయాలని సూచించారు. కరోనా కొత్తరకం వైరస్ వ్యాప్తిపై పర్యవేక్షణ చేయడంతో పాటు.. హాట్‌స్పాట్ల గుర్తింపు చేపట్టాలని ఆదేశించారు. కోవిడ్ పరీక్షలు, కాంటాక్ట్ ట్రేసింగ్, ఐసోలేషన్ పై పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా కరోనా కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాలకు ప్రాధాన్యత ఇస్తూ వ్యాక్సినేష్ చేపట్టాలని రాష్ట్రాలను కేబినెట్ సెక్రటరీ ఆదేశించారు.
ఇదిలాఉంటే.. ఓవైపు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుండగానే.. మరోవైపు కరోనా వ్యాప్తి విపరీతంగా పెరుగుతోంది. గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య ఊహించని రీతిలో పెరుగుతున్నాయి. మహారాష్ట్ర, కేరళ సహా 5 రాష్ట్రాలలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఫలితంగా సదరు రాష్ట్రాల్లో కరోనా బారిన పడే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ రాష్ట్రాలే కాకుండా క్రమక్రమంగా మిగతా రాష్ట్రాల్లోనూ కరోనా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం అలర్ట్ అయ్యింది. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేస్తోంది. కాగా, దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 1,10,63,491 కి చేరింది. 1,56,825 మంది మృత్యు వాత పడ్డారు.
Also read: