Mukesh Ambani: రిలయన్స్ అంబానీ ఇంటి దగ్గర రెండు వాహనాల్లో పేలుడు పదార్థాల కలకలం.. అనుమానస్పద లేఖ స్వాధీనం
Caught on camera: రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్‌అంబానీ నివాసం ఆంటిలియా దగ్గర పేలుడు పదార్థాలతో కూడిన ఓ వాహనాన్ని నిలిపి ఉంచడం...
Mukesh Ambani: రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్‌అంబానీ నివాసం ఆంటిలియా దగ్గర పేలుడు పదార్థాలతో కూడిన ఓ వాహనాన్ని నిలిపి ఉంచడం తీవ్ర సంచలనం సృష్టించింది. దక్షిణ ముంబైలోని ముఖేష్ నివాసం యాంటీలియా సమీపంలోనే గురువారం సాయంత్రం స్కార్పియో వాహనం అనుమానస్పదంగా కనిపించింది. యాంటీలియా సెక్యూరిటీ సిబ్బంది నుంచి సమాచారం అందుకున్న బాంబు డిటెక్షన్, డిస్పోజల్ స్వ్కాడ్, యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. పోలీసుల సమాచారం ప్రకారం.. వాహనం లోపల ఒక బ్యాగును, ఒక లేఖను గుర్తంచారు సిబ్బంది. అందులో ఉన్న విషయాలను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ముఖేష్ భయ్య నీతా భాబీ ఇదొక ట్రైలర్ మాత్రమే అని లేఖలో రాసినట్లు తెలుస్తోంది. అయితే సీసీటీవీ పుటేజీ పరిశీలన తర్వాత గురువారం రాత్రి 1 గంటలకు ఆంటిలియా సమీపంలో అనుమానస్పదంగా రెండు వాహనాలను ఆపి ఉంచినట్లు పోలీసులు గుర్తించారు. స్కార్పియో డ్రైవర్ అంబానీ ఇంటి సమీపంలో వాహనాన్ని ఆపి మరో కారులో అక్కడి నుంచి ఉండాయించినట్లు గుర్తించారు.
పేలుడు పదార్థాల గుర్తింపు:
కాగా, అంబానీ ఇంటి దగ్గర అనుమానస్పదంగా కనిపించిన ఈ వాహనంలో జిలెటిక్స్, ఇతర పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో 20 జిలెటిన్ స్టిక్స్ ఉన్నట్లు తేలిందని మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ ట్విట్ చేశారు. పేలుడు పదార్థాలు ఉన్న స్కార్పియో వాహనంను పోలీసులు సురక్షిత ప్రాంతానికి తరలించారు. దాని యజమాని ఎవరు..? అందులో పేలుడు పదార్థాలు పెట్టింది ఎవరు..?ఎందు కోసం తీసుకెళ్తున్నారు.. ఇందులో ఎవరెవరి ప్రమేయం ఉంది తదితర విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అంబానీ ఇంటి వెలుపల భద్రత కట్టుదిట్టం చేశారు. సీసీటీవీ పుటేజీని పరిశీలిస్తున్నారు. ఇలా భారీగా పేలుడు పదార్థాలతో కూడిన వాహనం గుర్తించడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. త్వరలో దీనిపై పూర్తి వివరాలు రాబడుతామని వారు చెబుతున్నారు.
అయితే వాహనంలో బయటపడిన లేఖ అంబానీ కుటుంబాన్ని ఉద్దేశించి రాసినట్లు తెలుస్తోంది. అయితే నీతా అంబానీ, ముకేష్ భయ్యాకు ఇదొక ఝలక్ అని, ఏర్పాట్లు జరుగుతున్నాయని, తర్వాత ఈ పేలుడు పదార్థాలు మిమ్మల్ని చేరుకుంటాయని అందులో ఉన్నట్లు సమాచారం. అయితే పేలుడు పదార్థాలతో కూడిన కారును యాంటీలియా పక్కనే పార్క్ చేయాలని దుండగులు భావించినట్లు, అక్కడ పటిష్టమైన భద్రత ఉండటంతో కొంత దూరంలో నిలిపి ఉంచినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే ముకేష్ అంబానీ సెక్యూరిటీ వాహనం నెంబర్ ప్లైట్ పై ఉన్న రిజిస్ట్రేషన్ నెంబరే ఈ స్కార్పియో నెంబర్ ప్లైటు ఉండటం గమనార్హం.
Also Read: