AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Modi with Peacocks: నెమళ్లకు ఆహారం పెడుతున్న ప్రధాని.. గత ఏడాది ఆహ్లాదకరమైన వీడియో మరోసారి మీ కోసం

ప్రధాని నరేంద్ర మోదీకి ప్రకృతి అందాలన్నా జీవరాశులన్నా..ముఖ్యంగా పురి విప్పిన నెమళ్ళు అంటే ఎంతో ఇష్టం. గత ఏడాది ఆగష్టులో తన నివాసంలో మార్నింగ్ వాక్ చేస్తున్న సందర్భంగా..

Modi with Peacocks: నెమళ్లకు ఆహారం పెడుతున్న ప్రధాని.. గత ఏడాది ఆహ్లాదకరమైన వీడియో మరోసారి మీ కోసం
Ram Naramaneni
|

Updated on: Feb 27, 2021 | 5:55 PM

Share

ప్రధాని నరేంద్ర మోదీకి ప్రకృతి అందాలన్నా జీవరాశులన్నా..ముఖ్యంగా పురి విప్పిన నెమళ్ళు అంటే ఎంతో ఇష్టం. గత ఏడాది ఆగష్టులో తన నివాసంలో మార్నింగ్ వాక్ చేస్తున్న సందర్భంగా ఆయన తనకు ఎంతో ప్రీతి పాత్రమైన నెమళ్లకు ఆహారాన్ని అందజేశారు. తన ఇన్ స్టాగ్రామ్ పేజ్ లో దీని తాలూకు వీడియోను విడుదల చేశారు. ‘అద్భుతమైన క్షణాలు’ అన్న కేప్షన్  తో దీన్ని విడుదల చేశారు. లోక్ కళ్యాణ్ మార్గ్ రెసిడెన్స్ లో తన ఇంటి నుంచి తన కార్యాలయం వరకు డైలీ వాక్ చేస్తున్న దృశ్యాలను కూడా ఈ వీడియోలో జత చేశారు. ఈ అరుదైన, అపురూపమైన వీడియోను చూసినవాళ్లు మరోకసారి, చూడనివాళ్లు మొదటిసారి చూడాల్సిందే.

కాగా  ప్ర‌ధాని నివాస ప్రాంగ‌ణం, ఎల్‌కేఎం కాంప్లెక్స్‌లో నెమ‌ళ్లు స్వేచ్ఛ‌గా తిరుగుతూ ఉంటాయి. వాటిని చూస్తే, ఆనందంగా, ఆహ్లాదంగా ఉంటుంది. డైలీ వ్యాయామ చర్యల్లో భాగంగా, పలు సందర్భాల్లో ప్రధాని వాటికి ఆహారాన్ని స్వ‌యంగా అందిస్తూ కనిపించారు. వాటిని చూసి ముచ్చటపడతారు. పలు సందర్భాల్లో నెమ‌ళ్లు పురివిప్పిన సుంద‌ర దృశ్యాలు ఇష్టం ఉండని వాళ్లు ఎవరుంటారు చెప్పండి.  అయితే..  నివాస ప్రాంగ‌ణంలో ప్ర‌ధాని మోదీ ప‌లు ప‌క్షుల‌కు గూళ్లను కూడా ఏర్పాట్లు చేశారు. కొన్ని నెమళ్లకు ఇంట్లోనూ, మరికొన్నిటికి హాలులోనూ, ఇంకొన్నిటికి మెట్ల దగ్గర కూర్చుని  భారత ప్రధాని వాటికి ఆహారం అందిస్తున్నారు. అలాగే, ఈ ఫొటోల్లో ప్రధాని మోదీ వవిధ రకాల డ్రెస్సుల్లో కనిపించారు. కొన్నిసార్లు వాకింగ్ ట్రాక్, ఇంట్లో సాధారణంగా వేసుకునే క్లోత్స్, బయట కనిపించినట్టే కుర్తా పైజామాతో పాటు చివర్లో లుంగీ, బనియన్ వేసుకుని దక్షిణాదిలో పురుషులు ఇళ్లలో  ఉన్నప్పుడు ఎలా ఉంటారో అచ్చం అలాగే కనిపించారు.

అయితే ప్రధాని మోదీ నెమళ్లకు ఆహారం అందించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో ఎప్పుడూ సర్కులేట్ అవుతూనే ఉంటుంది. తాజాగా ఈ వీకెండ్‌లో మరోసారి సెంటర్ ఆఫ్ ట్రెండింగ్‌గా మారింది. మాములుగా నెమళ్లు మనుషులకు కాస్త దూరంగా మెసులుతుంటాయి. కానీ, ప్రధానమంత్రి నివాసంలో ఉండే నెమళ్లు మాత్రం చక్కగా వచ్చి ఆయన అందిస్తున్న ఆహారాన్ని ఎంచక్కా తింటూ కనిపించాయి.

Also Read:

Crime News: ఎన్నారైలే టార్గెట్‌… నెల్లూరు నుంచే ఆపరేషన్… ప్రొఫైల్‌లో అందమైన ఫొటోలు… గొంతు మార్చి..

Coronavirus: ప్రమాదకరంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. 28 జిల్లాల్లో సెకండ్ వేవ్ ఉధృతి.. తస్మాత్ జాగ్రత్త