ప్రధాని మోదీ ఎవరికి ప్రయోజనకారి ? ప్రజలకు కాదన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, మరి ఎవరికి.
ప్రధాని మోదీ ప్రయోజనకారా కారా అన్న విషయంముఖ్యం కాదని, ఆయన ఎవరికి ప్రయోజనకారి అన్నది ముఖ్యమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఆయన ఇద్దరికి మాత్రం చాలా..
ప్రధాని మోదీ ప్రయోజనకారా కారా అన్న విషయంముఖ్యం కాదని, ఆయన ఎవరికి ప్రయోజనకారి అన్నది ముఖ్యమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఆయన ఇద్దరికి మాత్రం చాలా ‘పనికి వస్తారని’ అంటూ ఈ సందర్భంగా రాహుల్ మళ్ళీ ‘హమ్ దోనో, హమారే దో’ అనే తన ‘స్లోగన్’ ని ప్రస్తావించారు. తమ ఆస్తులు, సంపదను వినియోగించుకోవడానికి ఇద్దరు ఆయనను ఉపయోగించుకుంటున్నారని రాహుల్ పేర్కొన్నారు. తమిళనాడులోని తూత్తుకుడిలో శనివారం జరిగిన ఓ సభలో మాట్లాడిన ఆయన.. క్రోనీ కేపిటలిస్టులకు మోదీ, హోమ్ మంత్రి అమిత్ షా సాయపడుతున్నారని ఆరోపించారు. దేశంలో వ్యవసాయ రంగాన్ని ఈ ఇద్దరూ నడిపిస్తున్నారని, మరో ఇద్దరు బడా పారిశ్రామికవేత్తలకు సహాయపడుతున్నారని ఆయన ఇదివరలో కూడా ఆరోపించారు. చైనా అంటే మోదీ భయపడుతున్నారని, లడఖ్ లో ఆక్రమణకు ఆ దేశానికి దోహదపడ్డారని రాహుల్ అన్నారు. 2017 లో అరుణాచల్ ప్రదేశ్ లోని డోక్లామ్ వద్ద ఏం చేశారో, అదే ఇక్కడ కూడా టెస్ట్ చేయాలని ఆ దేశాన్ని కోరారని రాహుల్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
చైనా వారు మన దేశంలోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకున్న విషయం నిజమేనని, మొదట వారు డోక్లామ్ లో పరీక్షించారని, ఆ తరువాత లడాఖ్ పై పడ్డారని ఆయన అన్నారు. అసలు ఇండియాకు ఎవరూ రాలేదని, చొరబాట్లు జరగలేదని మోదీ మొట్టమొదటే వ్యాఖ్యానించి ఆ దేశాన్ని వెనకేసుకొచ్చారని, చైనా అంటే ఆయన భయపడుతారని రాహుల్ పేర్కొన్నారు. తామంటే భారత ప్రధాని భయపడుతున్నారని చైనాకు తెలుసునన్నారు. లడాఖ్ లోని డెప్సాంగ్ ప్రాంతం కీలకమైనదని, ఈ ప్రభుత్వ హయాంలో అది మనకు చైనీయుల అధీనం నుంచి తిరిగి రాదని ఆయన అన్నారు. దీనిపై మొదటినుంచీ చైనా కన్ను వేసిందని, ఇది చాలా డేంజరస్ ట్రెండ్ అని పేర్కొన్నారు.ఈ ప్రాంతాన్ని ఇండియా కోల్పోవడం ఖాయమన్నారు. ఈ ప్రధాని బలహీనతను చైనా ‘గుర్తించిందని’ రాహుల్ సెటైర్ వేశారు. తమిళనాడులో జరగనున్న ఎన్నికలను పురస్కరించుకుని రాహుల్ తన మూడు రోజుల పర్యటనను తూత్తుకుడిలో ప్రారంభించారు. ఇక్కడి ఓ కాలేజీలో లాయర్లను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
Read More:
Modi with Peacocks: నెమళ్లకు ఆహారం పెడుతున్న ప్రధాని.. గత ఏడాది ఆహ్లాదకరమైన వీడియో మరోసారి మీ కోసం