Night Curfew: దేశంలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. మరో 15 రోజుల పాటు నగరాల్లో రాత్రి కర్ఫ్యూ పొడిగింపు

Night Curfew: కరోనా మహమ్మారి ఏడాదిగా తీవ్ర స్థాయిలో విజృంచి దేశంలో తాజాగా తగ్గుముఖం పడుతుండటం ఊరట కలిగించే అంశమని భావించినా.. కొన్ని రాష్ట్రాల్లో తగ్గినట్లే...

Night Curfew: దేశంలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. మరో 15 రోజుల పాటు నగరాల్లో రాత్రి కర్ఫ్యూ పొడిగింపు
Follow us
Subhash Goud

|

Updated on: Feb 27, 2021 | 6:26 PM

Night Curfew: కరోనా మహమ్మారి ఏడాదిగా తీవ్ర స్థాయిలో విజృంచి దేశంలో తాజాగా తగ్గుముఖం పడుతుండటం ఊరట కలిగించే అంశమని భావించినా.. కొన్ని రాష్ట్రాల్లో తగ్గినట్లే తగ్గి మళ్లీ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. కరోనా కట్టడికి తీవ్ర స్థాయిలో కృషి చేసిన అధికారులకు మళ్లీ తలనోప్పులు మొదలయ్యాయి. దేశంలో మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, తదితర రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఇక గుజరాత్ రాష్ట్రంలో కూడా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గుజరాత్ రాష్ట్రంలోని నాలుగు ప్రధాన నగరాల్లో కరోనా కట్టడికి విధించిన రాత్రి సమయంలో కర్ఫ్యూను 15 రోజుల పాటు పొడిగించారు. కరోనా కట్టడికి అహ్మదబాద్, సూరత్, వడోదర, రాజ్ కోట్ నగరాల్లో శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. నాలుగు మున్సిపల్ నగరాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నందున రాత్రి సమయంలో కర్ఫ్యూను పొడిగిస్తున్నట్లు గుజరాత్ ప్రభుత్వం వెల్లడించింది.

కర్ఫ్యూ ఉదయం 6 గంటల వరకు విధించారు. కరోనా నిరోధానికి వ్యాక్సిన్ కార్యక్రమం కొనసాగిస్తూనే రాత్రి సమయంలో కర్ఫ్యూను విధించారు. గుజరాత్ రాష్ట్రంలో ఫ్రంట్ లైన్ కార్మికుల్లో 77 శాతం మందికి వ్యాక్సిన్ అందించారు. . అయితే దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పాజిటివ్‌ కేసులు మళ్లీ పెరుగుతుండటంతో అధికారులు మరిన్ని ఆంక్షలు విధిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ ఆంక్షలు అమలు చేస్తున్నారు. మాస్కులు ధరించని వారిపై కొరఢా ఝులిపిస్తున్నారు. జరిమానాలు విధిస్తున్నారు.

కాగా, దేశ వ్యాప్తంగా పాజిటివ్‌ పెరుగున్నా..డిశ్చార్జ్‌ల సంఖ్య తగ్గుతూ వస్తోంది. శుక్రవారం కరోనా నుంచి 12,771 మంది బాధితులు మాత్రమే కోలుకున్నట్లు వైద్యశాఖ వెల్లడించింది. వీరితో కలిపి ఇప్పటివరకు 1,07,63,451 మంది బాధితులు కోవిడ్ నుంచి కోలుకున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 1,59,590 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. అయితే దేశంలో మళ్లీ యాక్టివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఆందోళన మొదలైంది.

ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 97.14 శాతం ఉండగా.. మరణాల రేటు 1.42 శాతంగా ఉంది. నిన్న దేశవ్యాప్తంగా 7,73,918 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. వీటితో కలిపి ఫిబ్రవరి 26వ తేదీ వరకు మొత్తం 21,54,35,383 కరోనా పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్స్ పేర్కొంది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ పక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది. శనివారం ఉదయం వరకు దేశవ్యాప్తంగా 1,42,42,547 మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకూ.. ఆరోగ్య కార్యకర్తలకు, ఫ్రంట్ లైన్ సిబ్బందికి వ్యాక్సిన్ ఇస్తున్నారు.

Also Read: Coronavirus: ప్రమాదకరంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. 28 జిల్లాల్లో సెకండ్ వేవ్ ఉధృతి.. తస్మాత్ జాగ్రత్త