Horoscope Today: ఈ రాశివారు ఈరోజు వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తగా ఉండాలి… ఆదివారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope Today: అన్ని రోజులు మనవి కావు అని పెద్దలు చెబుతుంటారు. అంతా అనుకూలంగా కనిపిస్తున్నా కొన్ని సందర్భాల్లో కాలం కలిసి రాదు. కాబట్టి.. పలు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళితే...
Horoscope Today: అన్ని రోజులు మనవి కావు అని పెద్దలు చెబుతుంటారు. అంతా అనుకూలంగా కనిపిస్తున్నా కొన్ని సందర్భాల్లో కాలం కలిసి రాదు. కాబట్టి.. పలు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళితే విజయం మన సొంతమవుతుంది. ఈ క్రమంలో రాశి ఫలం ఆధారంగా మనం చేపట్టబోయే పనుల్లో ఏవైనా సమస్యలు ఉన్నాయా? ముందుగానే తెలుసుకుని దానికి తగ్గ పరిహారాలు పాటిస్తూ, పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఆదివారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో.. ఓసారి చూసేయండి.
మేష రాశి:
ఈ రాశివారు ఈరోజు వ్యాపార వ్యవహారిక విషయాల్లో భిన్నంగా ఆలోచించకుండా, ఇబ్బందులు పడుకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి. మహాలక్ష్మి ఆరాధణ ఈ రాశివారికి సూచించదగ్గ అంశం.
వృషభ రాశి:
వృషభ రాశి వారు ఈరోజు వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారు నందీశ్వరుడిని పూజ చేస్తే మంచి జరుగుతుంది.
మిథున రాశి:
ఈ రాశివారు పెద్ద వారు చెప్పే సలహాలను పాటించడం మంచిది. అలాగే మిథున రాశి వారు సామూహిక సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. విష్ణు సహస్త్ర స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.
కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి ఈరోజు సౌకర్యాలు కొంత ఇబ్బంది పెడుతుంటాయి. జాగ్రత్తతో ఉండడం మంచిది. అలాగే ఈ రాశి వారికి కుటుంబపరమైన బాధ్యతలు పెరుగుతుంటాయి. పరమేశ్వరుడి ఆరాధణ ఈ రాశి వారి వారికి మేలు చేస్తుంది.
సింహ రాశి:
సింహ రాశి వారికి ఈరోజు ధార్మిక చింతన ఏర్పడుతుంటుంది. ఖర్చులు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సినిమా, టీవీ రంగాల్లో పనిచేసే కళాకారులకు అవకాశాలు కలిసివస్తాయి. శుక్ర గ్రహ స్తోత్ర పారాయణం ఈ రాశివారికి సూచించదగ్గ అంశం.
కన్య రాశి:
ఈ రాశి వారు ఈరోజు ఆలోచనల విధానంలో కొన్ని మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అస్తిరమైన భావాలు ఇబ్బందులకు గురి చేసే అవకాశాలున్నాయి. మహాలక్ష్మి ఆరాధణ చేసుకోవడం వల్ల ఈ రాశి వారికి మంచి జరుగుతుంది.
తుల రాశి:
తుల రాశి వారు ఈరోజు అనుకూలం కానీ పనులను చేపట్టి వాటిని ప్రయోజకరంగా మార్చుకుంటారు. వీరికి మిశ్రమ ఫలితాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యక్తిగత అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దుర్గా సప్త శ్లోక పరాయణం మేలు చేస్తుంది.
వృశ్చిక రాశి:
ఈ రాశి వారికి ఈరోజు ధార్మిక చింతన ఏర్పడుతుంది. రాజకీయపరమైన కార్యక్రమాల్లో అనవసరంగా జోక్యం చేసుకోవడం మంచిది కాదు. పరమేశ్వరుని ఆరాధణ ఈరాశి వారికి మేలు చేస్తుంది.
ధనుస్సు రాశి:
ధనుస్సు రాశి వారు ఈరోజు ధనం విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. అనవసరమైన హామీలు ఇచ్చి ఇబ్బందులు పడకూడదు. నారాయణ అష్టాక్షరి జపం ఈ రాశి వారికి మేలు చేస్తుంది.
మకర రాశి:
ఈ రాశి వారు ఇతరులతో మాట్లాడే సందర్భంగా గౌరవ, మర్యాదాలకు లోటు రాకుండా వ్యవహరిస్తుండాలి. అలాగే ఆర్థిక విషయాల్లో ప్రయోజనాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహాలక్ష్మి అర్చన ఈ రాశివారికి మేలు చేస్తుంది.
కుంభ రాశి:
కుంభ రాశి వారు ఈరోజు వేరు వేరు రూపాల్లో అభివృద్ధి పనులు ప్రారంభించుకుంటారు. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ధన్వంత్రి స్తోత్ర పారాయణం ఈ రాశి వారికి సూచించదగ్గ అంశం.
మీన రాశి:
ఈ రాశి వారు ఈరోజు కుటుంబపరమైన కార్యక్రమాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే ప్రయత్నం చేస్తుంటారు. వాయిదా పద్ధతుల్లో పనులు పూర్తి చేస్తుంటారు. ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గణపతి అర్చన, దర్శనం వీరికి మేలు చేస్తుంది.