Horoscope Today: ఈ రాశి వారు ఈరోజు అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకపోవమే మేలు.. శనివారం రాశి ఫలాలు..
Horoscope Today: కొన్ని సందర్భాల్లో మనకు అవసరం లేని విషయాల్లో కూడా తల దూర్చడానికి ప్రయత్నిస్తుంటాం. కానీ మంచి చేయబోతే చెడు ఎదురవుతుంటుంది. ఈరోజు ఈ రాశి వారికి ఇలాంటి సూచనలే కనిపిస్తున్నాయి. కాబట్టి...
Horoscope Today: కొన్ని సందర్భాల్లో మనకు అవసరం లేని విషయాల్లో కూడా తల దూర్చడానికి ప్రయత్నిస్తుంటాం. కానీ మంచి చేయబోతే చెడు ఎదురవుతుంటుంది. ఈరోజు ఈ రాశి వారికి ఇలాంటి సూచనలే కనిపిస్తున్నాయి. కాబట్టి వీలైనంత వరకు అనవసరమైన విషయాలకు దూరంగా ఉండడమే వీరికి సూచించదగిన అంశం. శనివారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు కలగనున్నాయో.. ఓ సారి చూసేయండి.
మేష రాశి:
మేశ రాశి వారు ఈరోజు చేపట్టే పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైన తొందరపాటు తనం ఇబ్బందులకు గురి చేసే అవకాశాలున్నాయి. వీరికి శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఆరాధన మేలు చేస్తుంది.
వృషభ రాశి:
ఈ రాశి వారికి ఈరోజు అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేసుకోవడంలో ఒత్తిడి కనిపిస్తోంది. తొందరపడకుండా వ్యవహరిస్తుండాలి. శివారాధణ ఈ రాశివారికి సూచించదగినది.
మిథున రాశి:
మిథున రాశి వారు ఈరోజు కుటుంబసభ్యుల ఆరోగ్య విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. పరిహారాల విషయంలో ఏమాత్రం కూడా ఆలస్యం చేయకూడదు. దక్షిణా మూర్తి స్వామి వారి ఆరాధణ మేలు చేస్తుంది.
కర్కాటక రాశి:
ఈ రాశి వారు ఈరోజు చేపట్టే పనుల్లో తొందరపాటు పనికిరాదు. ఆధ్యాత్మిక, దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. గోవింద నామ పారాయణం ఈ రాశి వారికి మేలు చేస్తుంది.
సింహ రాశి:
సింహ రాశి వారు వ్యక్తిగత ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సామాజిక సేవ కార్యక్రమాల్లో ఒత్తిడి పెరుగుతుంది. లక్ష్మీ నరసింహ స్వామి వారి ఉపాసన ఈ రాశి వారికి సూచించదగిన అంశం.
కన్య రాశి:
ఈ రాశి వారు ఈరోజు ఆలోచన విధానాల్లో కొన్ని మార్పులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అస్థిరమైన భావాలు ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. ఈ రాశి వారు మహా లక్ష్మీ ఆరాధణ చేస్తే మంచి ఫలితాలు పొందగలుగుతారు.
తుల రాశి:
తుల రాశి వారు ఈరోజు కుటుంబ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. గౌరీ శంకరుల ఆరాధణ మేలు చేస్తుంది.
వృశ్చిక రాశి:
ఈ రాశి వారు ఈరోజు స్నేహితుల సహకారంతో చేపట్టిన పనులను పూర్తి చేసుకోగలుగుతారు. శుభ వార్తలు వింటుంటారు. వీరికి దుర్గ అమ్మవారి ఆరాధణ మేలు చేస్తుంది.
ధనుస్సు రాశి:
ధనసుస్స రాశి వారు ఈరోజు తొందరపడకుండా పెద్దవారి సలహాలు తీసుకోవడం మంచిది. షేర్లు, పెట్టుబడుల విషయంలో అనుకూలత కనిపించే అవకాశం కలిపిస్తోంది. పంచామృతంతో పరమేశ్వరుడిని అభిషేకిస్తే ఈ రాశి వారికి మంచి జరుగుతుంది.
మకర రాశి:
ఈ రాశి వారు ఎప్పటి నుంచో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ధార్మికపరమైన చింతలు కూడా ఏర్పడుతాయి. గణపతి ఆరాధన వీరి మేలు చేస్తుంది.
కుంభ రాశి:
కుంభ రాశి వారు ఈరోజు కుటుంబ పరమైన కొన్ని కార్యక్రమాల్లో బాధ్యతలు చేపడుతారు. ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అలక్షణంగా ఏ మాత్రం కూడా వ్యవహరించకూడదు. శ్రీ రాజ మాతంగి నమః అనే నామం మేలు చేస్తుంది.
మీన రాశి:
ఈ రాశి వారు ఈరోజు ఎక్కువగా ఖర్చులు చేసే ప్రయత్నం చేస్తుంటారు. గొప్పలకు పోతుంటారు దీంతో ఇబ్బందులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహాలక్ష్మి ఆరాధాణ ఈ రాశి వారికి సూచించదగిన అంశం.