Reliance: మరో భారీ డీల్ కుదుర్చుకున్న రిలయన్స్.. ప్రపంచాన్ని మార్చే టెక్నాలజీపై పెట్టుబడులు పెట్టే క్రమంలో..
Reliance Buys Majority Stake In SkyTran: భారతీయ వ్యాపార దిగ్గజం రిలయన్స్ మరో భారీ డీల్‌ను కుదుర్చుకుంది. గ్యాస్, రిటైల్, టెలికం... ఇలా దాదాపు అన్ని రంగాల్లో దూసుకెళుతోన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా..
Reliance Buys Majority Stake In SkyTran: భారతీయ వ్యాపార దిగ్గజం రిలయన్స్ మరో భారీ డీల్‌ను కుదుర్చుకుంది. గ్యాస్, రిటైల్, టెలికం… ఇలా దాదాపు అన్ని రంగాల్లో దూసుకెళుతోన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా ప్రపంచాన్ని మార్చబోయే టెక్నాలజీ వైపు అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ప్రముఖ టెక్నాలజీ రంగ సంస్థ స్కైట్రాన్‌లో రిలయన్స్ మెజారిటీ వాటాలు దక్కించుకుంది. ఇందుకోసం రిలయన్స్ ఏకంగా 26.76 మిలియన్ డాలర్లు వెచ్చించడం విశేషం. మన కరెన్సీలో చెప్పాలంటే దీని విలువ సుమారు రూ.190 కోట్లకుపైమాటే. ఈ భారీ డీల్‌తో స్కైట్రాన్ కంపెనీ వాటా 54.46 శాతానికి పెరిగింది. రిలయన్స్ అనుబంధ సంస్థ రిలయన్స్ స్ట్రాటెజిక్ బిజినెస్ వెంచర్స్ ద్వారా ఈ ఒప్పందం జరిగినట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఇదిలా ఉంటా స్కైట్రాన్ టెక్నాలజీ కంపెనీ ట్రాఫిక్ రద్దీని తగ్గించే రవాణా సాధనాలకు అవసరమైన టెక్నాలజీలను అభివృద్ధి చేసింది. ఈ భారీ డీల్ గురించి రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ మాట్లాడుతూ.. ప్రపంచాన్ని మార్చేసే భవిష్యత్ టెక్నాలజీలపై పెట్టుబడులు పెట్టేందుకు మేము కట్టుబడి ఉన్నామని చెప్పేందుకు ఈ భారీ ఒప్పందం నిదర్శనమని తెలిపారు. తక్కువ ధరలో హై స్పీడ్ ఇంట్రా, ఇంటర్-సినీ కనెక్టివిటీని అందించేందుకు తోడ్పడే టెక్నాలజీలను రూపొందించడంలో స్కైట్రాన్‌కు అపార సామర్థ్యం ఉందని ముకేష్ అభిప్రాయపడ్డారు. ఇక స్కైట్రాన్ కంపెనీ అభివృద్ధి చేస్తోన్న టెక్నాలజీకి అంతర్జాతీయ క్యాపిటల్ ఇన్‌వెస్ట్‌మెంట్ సంస్థలు కూడా దీనికి దన్నుగా ఉన్నాయి. 2018లో ఈ కంపెనీలో 12.7 శాతం వాటాలు కొనుగోలు చేసిన ఆర్ఎస్‌బీవీఎల్ ఆ తర్వాత దశల వారీగా దాన్ని 36.31 శాతానికి, ప్రస్తుతం మెజారిటీ స్థాయికి పెంచుకుంది. మరి టెక్నాలజీ రంగంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టిన రిలయన్స్ ఎలాంటి సంచనలనాలకు తెర తీస్తుందో చూడాలి.
Also Read: Gold Price Today: భారీగా తగ్గిన పసిడి ధరలు.. ఈరోజు తులం గోల్డ్ ఎక్కడ, ఎంత ఉందంటే..