1/5

ఐదేళ్ల తర్వాత దేశంలో నిర్వహిస్తున్న టెలికం స్పెక్ర్టమ్ వేలంలో మొదటి రోజు సోమవారం నాడు రూ.77,146 కోట్ల విలువైన బిడ్లు దాఖలయ్యాయి. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా బిడ్లు దాఖలు అయ్యాయి.
2/5

అయితే మంగళవారం కూడా వేలం కొనసాగనుందని కేంద్ర టెలి కమ్యూనికేషన్‌ల శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. మొత్తం ఏడు బ్యాండ్ల పరిధిలో 2,250 మెగా హెర్జ్ స్పెక్ర్టమ్ విక్రయానికి ఈ వేలం నిర్వహిస్తున్నారు.
3/5

వీటి విలువ సుమారు 4 లక్షల కోట్ల రూపాయలుగా ఉంటుందని తెలుస్తోంది. ఇందులో భాగంగా మొదటి రోజు రూ. 77,146 కోట్లకు బిడ్లు దాఖలు అయ్యాయి. 800 మెగా హెడ్జ్, 900 మెగా హెడ్జ్, 1800 మెగా హెడ్జ్, 2100 మెగా హెడ్జ్, 2300 మెగా హెడ్జ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్‌కు మాత్రమే టెలికం సంస్థలు బిడ్లు సమర్పించాయి.
4/5

700 హెగా హెడ్జ్, 2,500 మెగా హెడ్జ్ బ్యాండ్ల స్పెక్ర్టమ్ తీసుకోవడానికి ఎవరు ముందుకు రాలేదు. ఈ వేలంలో ఒక్క 700 మెగాహెర్జ్ బ్యాండ్ పరిధిలోనే మూడో వంతు స్పెక్ట్రాన్ని ప్రభుత్వం విక్రయిస్తుండడం విశేషం.
5/5

2016లో కూడా ఈ బ్యాండ్‌ను ఎవరూ కొనుగోలు చేయలేదు. సరికొత్త టెక్నాలజీ, మౌలిక వసతులు, పరికరాలు అవసరం కావడంతో కొత్త బ్యాండ్ కొనుగోలుకు టెలికాం కంపెనీలు ముందుకు రావడం లేదని టెలికాం నిపుణులు అభిప్రాయపడుతున్నారు.