ప్రపంచ అత్యంత ధనికుడిగా టెస్లా కంపెనీ సీఈవో ఎలన్‌ మస్క్‌.. 8వ స్థానంలో ముఖేశ్ అంబానీ

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ మరోసారి స్థానం దక్కించుకున్నారు.

ప్రపంచ అత్యంత ధనికుడిగా టెస్లా కంపెనీ సీఈవో ఎలన్‌ మస్క్‌.. 8వ స్థానంలో ముఖేశ్ అంబానీ
Follow us

|

Updated on: Mar 02, 2021 | 4:02 PM

Richest In The World : ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ మరోసారి స్థానం దక్కించుకున్నారు. ‘హరున్‌ గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్ 2021‌’ జాబితాలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ ఎనిమిదో స్థానంలో నిలిచారు. గత సంవత్సర కాలంలో ఆయన సంపద 24 శాతం ఎగబాకి 83 బిలియన్‌ డాలర్లు అంటే సుమారు రూ.6.09 లక్షల కోట్లకు చేరింది. ఇక ఈ జాబితాలో రూ.2.34 లక్షల కోట్ల సంపదతో గౌతమ్‌ అదానీ అండ్‌ ఫ్యామిలీ 48వ స్థానం దక్కించుకున్నారు. ఆ తర్వాత రూ.1.94 లక్షల కోట్లతో శివ్‌ నాడార్‌ అండ్‌ ఫ్యామిలీ 58వ ర్యాంకు, రూ.1.40 లక్షల కోట్లతో లక్ష్మీ నివాస్‌ మిత్తల్‌ 104వ ర్యాంకు, రూ. 1.35 లక్షల కోట్ల సంపదతో సీరం ఇన్‌స్టిట్యూట్‌ అధిపతి సైరస్‌ పూనావాలా 113వ ర్యాంకులో కొనసాగుతున్నారు.

‘హరున్‌ గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్’ ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా టెస్లా కంపెనీ సీఈవో ఎలన్‌ మస్క్‌ నిలిచారు. గత ఏడాది కాలంలో ఆయన సంపద 328 శాతం పెరిగి 197 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఒక్క సంవత్సర కాలంలో ఆయన సంపద ఏకంగా 151 బిలియన్‌ డాలర్లు ఎగబాకింది. ఇక, అమెజాన్‌ సీఈవో జెఫ్‌ బెజోస్‌ 189 బిలియన్‌ డా‌లర్లు, ఫ్రాన్స్‌కు చెందిన లగ్జరీ వస్తువుల తయారీ కంపెనీ ఎల్‌వీఎంహెచ్‌ ఛైర్మన్‌ బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ 114 బిలియన్‌ డాలర్లు, మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకులు బిల్‌గేట్స్‌ 110 బిలియన్‌ డాలర్లు, ఫేస్‌బుడ్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌ 101 బిలియన్‌ డాలర్లతో వరుసగా తొలి ఐదు స్థానాల్లో నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా ఏడాది వ్యవధిలో 50 బిలియన్‌ డాలర్లకు పైగా సంపద పోగేసిన వారు కేవలం ముగ్గురే ముగ్గురు కావడం విశేషం. వీరిలో ఒకరు ఎలన్‌ మస్క్‌(151 బిలియన్‌ డాలర్లు) కాగా.. జెఫ్‌ బెజోస్‌(50 బిలియన్‌ డాలర్లు), పిన్‌డ్యువోడ్యువో అధినేత కొలిన్‌ హువాంగ్(50 బిలియన్‌ డాలర్లు) ఉన్నారు. ఇక ఈ జాబితాలో చోటు దక్కిన వారిలో సంవత్సర కాలంలో 161 మంది ఐదు బిలియన్‌ డాలర్లకు పైగా సంపాదించారు. వీరిలో 84 మంది చైనీయులు, 38 మంది అమెరికన్లు, ఐదుగురు భారతీయులు ఉన్నారు.

ఇక, హరున్‌ గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్ ప్రకారం భారతదేశంలో అత్యంత ధనవంతులకు కొదవ లేదని స్పష్టమవుతుంది. భారత్‌లో మొత్తం 209 మంది బిలియనీర్లు ఉన్నట్లు హరున్‌ గ్లోబల్‌ సంస్థ వెల్లడించింది. వీరిలో 177 మంది భారత్‌లో నివసిస్తున్నారు. గత ఏడాది కాలంలో కొత్తగా పుట్టుకొచ్చిన బిలియనీర్ల విషయంలో అగ్రరాజ్యం అమెరికాతో భారత్‌ పోటీ పడింది. అమెరికాలో మొత్తం 69 మంది కొత్తగా బిలియనీర్ల జాబితాలో చేరగా.. భారత్‌ నుంచి ఆ సంఖ్య 40గా నమోదైంది. ఐటీ సేవల కంపెనీ స్కేలార్‌(Zscaler) సీఈవో జే చౌదరి సంపద 271 శాతం పెరిగి రూ.96,000 కోట్లకు చేరడం విశేషం. అలాగే, అదానీ గ్రూప్‌నకు చెందిన వినోద్‌ శాంతిలాల్‌ అదానీ సంపద 128 శాతం పెరిగి రూ.72,000 కోట్లకు ఎగబాకింది.

Read Also.. మారిటైమ్‌ ఇండియా సమ్మిట్‌ –2021 ప్రారంభించిన ప్రధాని మోదీ.. నౌకాశ్రయాల పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామన్న సీఎం జగన్‌

తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి