Gold & Silver Price Today: బంగారం ప్రియులకు గుడ్న్యూస్.. భారీగా తగ్గిన పసిడి, వెండి ధరలు… ఎంత తగ్గాయంటే..
Gold & Silver Price Today: బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. గత రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు మంగళవారం
Gold & Silver Price Today: బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. గత రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు మంగళవారం సాయంత్రం భారీగా తగ్గాయి. దీంతో బంగారం కొనాలనుకునేవారికి ఇది శుభపరిమాణం అని చెప్పుకోవచ్చు. ఇవాళ సాయంత్రం దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.520 తగ్గి.. రూ.44,420కు చేరింది. అటు 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.45,420కు చేరింది. ఇదిలా ఉండగా.. మంగళవారం ఉదయం బంగారం రూ.360 పెరిగిన సంగతి తెలిసిందే.
ఇక దేశంలోని ప్రధాన నగరాల్లోని మార్కెట్లలో కూడా బంగారం ధరలలో మార్పులు జరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.42,100 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.45,930కు చేరింది. ఇక విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.42,100కు చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.45,930గా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.44,250 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.48,280కు చేరింది. ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.44,420 చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.45,420కు చేరింది. ఇక చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.42,660 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.46,540 ఉంది.
ఇదిలా ఉండగా.. పసిడి బాటలోనే వెండి కూడా భారీగానే పతనమైంది. కిలో వెండి ధరకు రూ.910 తగ్గి.. దేశీయ మార్కెట్లో కేజీ సిల్వర్ రూ.66,600కు చేరింది. ఇక హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 72,000 ఉండగా.. విజయవాడలో రూ.72,000కు చేరింది. ఇక ఢిల్లీలో కిలో వెండి ధర రూ.66,600 ఉండగా.. ముంబైలో రూ.66,600కు చేరింది. ఇక బంగారం కోనాలనుకునేవారికి ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. కరోనా ప్రభావంతో లాక్ డౌన్ సమయంలో బంగారం ధర ఆల్ టైం రికార్డ్ స్థాయిని నమోదు చేసిన సంగతి తెలిసిందే. గత కొద్దిరోజులుగా బంగారం ధరలు పతనమవడం మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు.
Also Read:
వేలం పాటను ప్రకటించిన ఎస్బీఐ.. తక్కువ ధరకే ఇళ్ళను, వాహనాలను ఇలా పొందవచ్చు.. తేదీ ఎప్పుడంటే..