శంషాబాద్ లో పెద్దపులి సంచారం.. భయాందోళనలో స్థానికులు.. పగ్ ఆనవాళ్లు కోసం ప్రయత్నిస్తున్న అధికారులు
ఇటీవల పెద్ద పులులు వనాలను విడిచిపెట్టి జన జీవనంలోకి వచ్చి ప్రజలను భయందోళనకు గురి చేస్తున్నాయి. మనుషులపై దాడి చేసి ప్రాణాలను హరిస్తున్నాయి. అటవీ అధికారుల తప్పిదాల వల్ల అమాయకుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి.
ఇటీవల పెద్ద పులులు వనాలను విడిచిపెట్టి జన జీవనంలోకి వచ్చి ప్రజలను భయందోళనకు గురి చేస్తున్నాయి. మనుషులపై దాడి చేసి ప్రాణాలను హరిస్తున్నాయి. అటవీ అధికారుల తప్పిదాల వల్ల అమాయకుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. తాజాగా శంషాబాద్ ఏరియాలో పెద్దపులి సంచారం స్థానికంగా కలకలం రేపుతోంది.
మున్సిపాలిటీ ఇందిరమ్మ కాలనీ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో పెద్దపులి కనిపించిందంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదయమే అటువైపుగా వెళ్లిన కొంతమంది స్థానికులు పెద్ద పులిని చూసినట్లు చెబుతున్నారు. అంతేకాకుండా పులిని చూసి వెంటనే ఇళ్లలోకి పరిగెత్తామని చెప్పుకొచ్చారు. పులిని చూసిన కొంతమంది 3 ఫీట్ల ఎత్తులో గంభీరంగా ఉందని వెల్లడించారు. అటవీ అధికారులకు వెంటనే ఫిర్యాదు చేశారు. సిబ్బంది శంషాబాద్ ఏరియాకు చేరుకొని పగ్ మార్క్ ఆనవాళ్ల కోసం ప్రయత్నిస్తున్నారు. అది నిజంగా పెద్దపులేనా లేదా ఇంకేదైనా జంతువా? అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే స్థానికంగా ఈ విషయం అందరికీ తెలియడంతో ఇళ్లలో నుంచి ఎవరూ బయటికి రావడం లేదు. ఒకవైపు నివర్ తుఫాన్ వల్ల రాష్ట్రంలో పెరిగిన చలికి తోడు ఇప్పుడు ఈ పులి బాధేంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కాగా ఇటీవల ఆదిలాబాద్‌లో జనజీవనంలో సంచిరిస్తున్న పెద్ద పులి ఓ యువకుడిపై దాడి చేసి చంపేసింది. వరంగల్ రూరల్ ఏరియాలో ఓ పులి పశువులపై దాడి మూగజీవాలను బలి తీసుకుంటోంది. నెల రోజుల క్రితం హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో కూడా పులి సంచరించింది. ఇలా వన్యప్రాణులు జనాల మధ్యకు వచ్చి ప్రజలను ఆగమాగం చేస్తున్నాయి.