ఆ వయసువాళ్లే ఇంటర్నెట్‌ను ‌బాగా వాడుతున్నారట..! బానిసలవుతున్నారట..! కారణాలు తెలియజేసిన పరిశోధకులు..

Online Addiction  : కరోనా పుణ్యమా అని గత సంవత్సరం మొత్తం జనాలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో ఇంటర్నెట్‌ వాడకం ఎక్కువైపోయింది. దీంతో చిన్నాపెద్ధాతేడా లేకుండా అందరూ మొబైల్స్,

  • uppula Raju
  • Publish Date - 7:59 pm, Tue, 2 March 21
ఆ వయసువాళ్లే ఇంటర్నెట్‌ను ‌బాగా వాడుతున్నారట..! బానిసలవుతున్నారట..!  కారణాలు తెలియజేసిన పరిశోధకులు..

Online Addiction  : కరోనా పుణ్యమా అని గత సంవత్సరం మొత్తం జనాలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో ఇంటర్నెట్‌ వాడకం ఎక్కువైపోయింది. దీంతో చిన్నాపెద్ధాతేడా లేకుండా అందరూ మొబైల్స్, ల్యాప్‌టాప్స్ పట్టుకొని బిజీగా మారారు. ఇంటర్నెట్‌ అతి వినియోగం చాలా ప్రమాదకరమని, ఆరోగ్య సమస్యలతోపాటు అనేక ఇబ్బందులు తెచ్చిపెడుతుందని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయితే, ఒంటరితనాన్ని అనుభవించే కౌమరదశ పిల్లలకు ఇంటర్నెట్‌ వినియోగం ఒక వ్యసనంగా మారుతోందని ఓ యూనివర్సిటీ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. కౌమరదశ పిల్లలు.. ముఖ్యంగా పదహారేళ్ల వయసున్నవారు ఇంటర్నెట్‌కు బానిసలుగా మారుతున్నారని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కౌమర దశ పిల్లలో ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. బయట తిరగాలి.. స్నేహితులతో ఆడుకోవాలి.. ముచ్చటించాలి వంటి అనేక కోరికలు ఉంటాయి. కానీ, ఇటీవల కరోనా కాలంలో కాలేజీలు లేకపోవడం.. ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉండాల్సి రావడంతో వారిలో ఒంటరితనం విపరీతంగా పెరిగిందట. దాన్ని దూరం చేసుకోవడం కోసం ఇంటర్నెట్‌ను అతిగా వాడటం మొదలుపెట్టారని యూనివర్సిటీ ఆఫ్‌ హెల్సింకీ పరిశోధకులు వెల్లడించారు. పరిశోధనలో భాగంగా 16, 17, 18 ఏళ్ల వయసు ఉన్న అమ్మాయిలు, అబ్బాయిల ఇంటర్నెట్‌ వినియోగంపై అధ్యయనం చేశారు. వారిలో పదహారేళ్ల వయసు పిల్లలు ఎక్కువగా ఆన్‌లైన్‌లో గేమ్స్‌ ఆడుతూ.. సోషల్‌మీడియా చూస్తూ సమయం గడుపుతున్నట్లు పరిశోధకులు చెప్పారు. వారిలోని ఒంటరితనమే ఇంటర్నెట్‌పై మొగ్గుచూపేలా చేస్తోందని పేర్కొన్నారు. ఇంటర్నెట్‌ అతివినియోగానికి డిప్రెషన్‌కు మధ్య సంబంధం ఉందని పరిశోధకులు వెల్లడించారు. డిప్రెషన్‌తో ఇంటర్నెట్‌ను ఎంతగా ఉపయోగిస్తున్నారో అంచనా వేయొచ్చని ఈ సందర్భంగా ప్రకటించారు.

ఇవి కూడా చదవండి :  AUTO-RICKSHAW : ఆటో రిక్షాపై అందమైన ఇల్లు.. ఫిదా అయిన ఆనంద్ మహీంద్రా.. బొలెరోపై నిర్మించగలడా అంటూ ట్వీట్..
APSSDC:నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. హెటిరో డ్రగ్స్‌లో 80 జాబ్స్‌.. హైదరాబాద్‌, వైజాగ్‌లో ఖాళీలు..
Online Loan apps: ఆన్‌లైన్ యాప్‌లపై తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం.. ఆ యాప్‌లను నిషేధించాలంటూ..