AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Drug Mafia: సుద్దబిళ్లలతో నకిలీ మందులు తయారుచేసి మార్కెట్‌లోకి వదిలారు.. ఏపీలో డ్రగ్ దందా !

మందుబిళ్లకు, సుద్దముక్కకు తేడా లేకుండా చేస్తోంది డ్రగ్ మాఫియా. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. ఏపీలో వెలుగుచూసిన నకిలీ మందుల విక్రయాలు..

AP Drug Mafia: సుద్దబిళ్లలతో నకిలీ మందులు తయారుచేసి మార్కెట్‌లోకి వదిలారు.. ఏపీలో డ్రగ్ దందా !
ఏపీలో నకిలీ డ్రగ్ మాఫియా
Ram Naramaneni
|

Updated on: Mar 03, 2021 | 3:43 PM

Share

AP Drug Mafia:  మందుబిళ్లకు, సుద్దముక్కకు తేడా లేకుండా చేస్తోంది డ్రగ్ మాఫియా. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. ఏపీలో వెలుగుచూసిన నకిలీ మందుల విక్రయాలు.. సగటు జీవిని వణుకుపుట్టించేలా చేస్తోంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న దానికి అర్ధమే లేకుండా పోయింది.

కరోనా సమయంలో క్యాష్‌ చేసుకునే యత్నంకు దిగింది ఈ మాఫియా. అందుకోసం సుద్దబిళ్లలతో.. నకిలీ మందులను తయారు చేసి అంటగట్టింది. అందులో సెల్‌జి, సెఫిక్సిమ్‌, అజిత్రోమైసిన్‌ పేరుతో పెద్ద ఎత్తున ట్యాబ్లెట్లను విక్రయించింది. సుద్దముక్కలతో ఈ మందుబిళ్లలను తయారు చేసినట్టు ప్రాథమికంగా గుర్తించారు. పట్టుబడ్డ మందుల్లో 10 శాతం కూడా డ్రగ్‌ లేదని బయటపడింది. పెయిన్‌కిల్లర్‌ మాటున డ్రగ్‌ మాఫియా సాగిస్తున్న దందా ఎంత దారుణంగా ఉందో అద్దం పడుతోంది.

విజయవాడ, పాలకొల్లు కేంద్రంగా ఈ నకిలీ మందుల సరఫరా సాగినట్టు మొదట గుర్తించారు అధికారులు. విజయవాడలోని హరిప్రియ ఫార్మా ఏజెన్సీ, పాలకొల్లులోని లోకేశ్వరి మెడికల్‌ ఏజెన్సీ నుంచి ఏపీలో మందుల దందా సాగినట్టుగా నిర్ధారించారు. వాళ్లకు ఎక్కడి నుంచి వచ్చిందని ఆరా తీయగా.. చండీఘర్‌లోని డివైన్‌డివ్‌ బయోటెక్‌ డిస్ట్రిబ్యూటర్‌ నుంచి వచ్చినట్టుగా తేల్చారు. ఆ డిస్ట్రిబ్యూటర్‌కు ఎవరు సరఫరా చేశారని చూస్తే.. దాని మూలాలు ఉత్తరాఖండ్‌లో HPHIN కంపెనీలో బయటపడింది.

దీంతో అప్రమత్తం అయిన ఏపీ సర్కార్‌.. ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసింది. ఉత్తరాఖండ్‌, చండీఘర్‌, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాలకు స్పెషల్‌ టీంలను పంపింది. డ్రగ్స్‌ ఐజీ రవిశంకర్‌ నారాయణకు నేతృత్వంలో ప్రత్యేక బృందాలు ఇప్పటికే రంగంలోకి దిగాయి. నకిలీ మందుల విక్రయాలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దీని వెనుక ఎవరున్నా వదిలేదని లేదని గట్టిగానే చెబుతోంది.

ఈ నకిలీ మందుల వ్యవహారం రాష్ట్రంలో ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కేటుగాళ్లపై కఠిన చర్యలకు రెడీ అయిపోయారు ఉన్నతాధికారులు. దీని వెనక ఎంత పెద్ద తలలున్నా.. వదలమని చెప్తున్నారు. విద్య, వైద్యం విషయంలో స్పెషల్ ఫోకస్ పెట్టిన జగన్ సర్కార్.. ఈ కేటుగాళ్ల తాట ఎలా తీస్తుందో తెలియాలి.

Also Read:

ఒకటి కాదు.. రెండు కాదు కుప్పలు తెప్పలుగా పాములు… కన్నంలో నుంచి బుసలు కొడుతూ వచ్చాయి.. చివరకు

పాలసీలు చేయిస్తారు.. ప్రాణాలు తీసేస్తారు.. కరడుగట్టిన హంతకులు.. సంచలన నిజాలు