Vikarabad lady murder : వికారాబాద్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన మర్డర్, ప్రియురాల్ని గొంతుకోసి చంపిన ప్రియుడు
Vikarabad lady murder : వికారాబాద్ జిల్లాలో ఓ మర్డర్ ఆలస్యంగా వెలుగుచూసింది. కనిపించకుండా పోయిన ఓ మహిళను.. ఆమె ప్రియుడు దారుణంగా హతమార్చాడు. తాండూరు మండలం పగిడాల గ్రామానికి చెందిన..
Vikarabad lady murder : వికారాబాద్ జిల్లాలో ఓ మర్డర్ ఆలస్యంగా వెలుగుచూసింది. కనిపించకుండా పోయిన ఓ మహిళను.. ఆమె ప్రియుడు దారుణంగా హతమార్చాడు. తాండూరు మండలం పగిడాల గ్రామానికి చెందిన బేకరి లక్ష్మి.. కుటుంబ తగాదాలతో భర్తకు దూరంగా తల్లిదగ్గరే ఉంటోంది. ఈ నేపథ్యంలో నరసింహతో ఏర్పడ్డ పరిచయం సహజీవనానికి దారితీసింది. ఈ క్రమంలో అతను లక్ష్మి నుంచి 40వేలను అప్పుగా తీసుకున్నాడు. ఆ సొమ్ము విషయంలో నరసింహపై కొన్నిరోజులుగా లక్ష్మి ఒత్తిడి తెస్తూ వస్తోంది. దీంతో ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలనుకున్న నరసింహ.. ఇటీవల లక్ష్మికి మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి హతమార్చాడు.
పథకం ప్రకారం.. లక్ష్మితో మద్యం తాగాక ఆ మత్తులో బ్లేడుతో గొంతుకోసి చంపాడు నరసింహ. అయితే రోజులు గడుస్తున్నా.. కూతురు కనిపించకపోయేసరికి లక్ష్మి తల్లి పోలీసులకు ఫిర్యాదుచేసింది. రెండుమూడు సార్లు బ్యాంకు దగ్గర నరసింహతో తమ కూతురు ఉండడాన్ని గ్రామస్తులు చూసినట్టుగా చెప్పడంతో అదే విషయాన్ని పోలీసులకు తెలిపింది. దాంతో అతన్ని అదుపులోకి తీసుకోగా.. మర్డర్ విషయం ఆలస్యంగా బయటపడింది. అయితే అప్పటికే రోజులు గడిచిపోవడంతో లక్ష్మి డెడ్‌బాడీ స్కెల్టన్‌గా మారింది.
Read also : Sri Krishnadevaraya death date: కృష్ణదేవరాయల మరణతేదీపై వీడిన సందిగ్ధత