AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకటి కాదు.. రెండు కాదు కుప్పలు తెప్పలుగా పాములు… కన్నంలో నుంచి బుసలు కొడుతూ వచ్చాయి.. చివరకు

ఒకటి కాదు రెండు కాదు కుప్పలు తెప్పలుగా పాములు. గుడ్లు నుంచి ఒక్కొక్కటిగా వస్తూ జనాన్ని బెంబేలెత్తించాయి. జోగులాంబ గద్వాల్ జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

ఒకటి కాదు.. రెండు కాదు కుప్పలు తెప్పలుగా పాములు... కన్నంలో నుంచి బుసలు కొడుతూ వచ్చాయి.. చివరకు
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 03, 2021 | 9:59 AM

ఒకటి కాదు రెండు కాదు కుప్పలు తెప్పలుగా పాములు. గుడ్లు నుంచి ఒక్కొక్కటిగా వస్తూ జనాన్ని బెంబేలెత్తించాయి. జోగులాంబ గద్వాల్ జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

ఒక్క పాము చూస్తేనే చెమటలు పట్టేస్తాయి. అలాంటిది పదుల సంఖ్యలో చూస్తే… అమ్మో గుండెజారి గల్లంతవ్వాల్సిందే. అలాంటి సంఘటనే జోగులాంబ గద్వాల్ జిల్లా అయిజ మండలం వెంకటాపురం గ్రామంలో వెలుగు చూసింది. వెంకటాపురం బస్టాండ్‌ మెయిన్‌రోడ్డులో మంగలి లక్ష్మన్న బంక్‌ వద్ద ఈ దృశ్యాన్ని చూసిన వాళ్లంతా ఒక్కసారిగా బెదిరిపోయారు. బంకు ముందర భూమిలో మిషన్‌ భగీరథ నీళ్ల పైప్‌ లైన్‌ ఉంది. అందులో ఉన్న చిన్న హోల్‌ నుంచి ఓ పాము వచ్చింది. దీన్ని స్థానికులు చంపేశారు. ఇంతలో ఆ కలుగు నుంచి మరో స్నేక్‌ వచ్చింది. దాన్ని కూడా కొట్టి చంపేశారు. ఆ రంధ్రం నుంచి ఇక పాములు వరుస కట్టి వస్తూనే ఉన్నాయి.

దీంతో బెదిరిపోయి స్థానికులకు ఏం చేయాలో కాసేపు అర్థం కాలేదు. పాము గుడ్లు నుంచి ఒక్కొక్కటిగా పిల్లులు బయటపడటం చూసి ఆశ్చర్యపోయారు. కాసేపు అలా వాటిని చూస్తూ ఉండిపోయారు. సుమారు ఇరవై నుంచి పాతిక పాములు బయటకు వచ్చాయి. వాటన్నింటినీ చంపేసి పక్కనే ఉన్న పొదల్లోకి తీసుకెళ్లి కాల్చేశారు. అక్కడే ఉన్న కొందరు యువకులు ఈ సీన్స్‌ను సెల్‌ఫోన్‌లో షూట్‌ చేశారు. సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అంతే ఇప్పుడా వీడియో తెగ వైరల్ అవుతోంది.

అయితే పాములను చంపడంపై జంతు ప్రేమికుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అలా పాములు కనిపిస్తే.. స్నేక్ క్యాచర్స్ లేదా పారెస్ట్ డిపార్ట్‌మెంట్  వారికి సమాచారం ఇవ్వాలి కానీ..  చంపడం సరికాదు అంటున్నారు. వాటిని చంపడమే కాకుండా వీడియోలో తీసి సోషల్ మీడియాలో సర్కులేట్ చేయడం దారుణమన్నారు. అయితే స్థానికుల వెర్షన్ మాత్రం వేరే ఉంది. అది నిత్యం రద్దీగా ఉండే ప్రాంతమని.. అలాంటి చోట ప్రజల ప్రాణాలకు రక్షణగా ఉండేందుకే వాటిని చంపేశామని చెబుతున్నారు.

Also Read:

Vijay Hazare: దుమ్ములేపిన సెహ్వాగ్ మేనల్లుడు.. బౌండరీల వర్షం.. కానీ జట్టును గెలిపించలేకపోయాడు

Doctors big Mistake: యువకుడు చనిపోయాడని చెప్పిన ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు.. పోస్ట్‌మార్టం రూమ్‌కి తీసుకెళ్లగా..

తరచూ ఉల‌వ‌ల‌ను తింటే ఇన్ని లాభాలా..? ఆరోగ్యం రేసుగుర్రమేనట..!
తరచూ ఉల‌వ‌ల‌ను తింటే ఇన్ని లాభాలా..? ఆరోగ్యం రేసుగుర్రమేనట..!
10thలో 557 మార్కులు.. కానీ ఫలితాలకు 5 రోజుల ముందే మృత్యుఒడికి..
10thలో 557 మార్కులు.. కానీ ఫలితాలకు 5 రోజుల ముందే మృత్యుఒడికి..
IPL: పెర్ఫ్యూమ్ షాపులో పని.. రోజుకు 35 డాలర్ల జీతం.. కట్‌చేస్తే
IPL: పెర్ఫ్యూమ్ షాపులో పని.. రోజుకు 35 డాలర్ల జీతం.. కట్‌చేస్తే
మార్కెట్‌ను రూల్ చేస్తున్న టాలీవుడ్‌.. వారు ఎక్కడ వెనుకబడ్డారు.?
మార్కెట్‌ను రూల్ చేస్తున్న టాలీవుడ్‌.. వారు ఎక్కడ వెనుకబడ్డారు.?
ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరుతో 12కోట్ల మోసం.. లబోదిబోమంటున్న బాధితుల
ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరుతో 12కోట్ల మోసం.. లబోదిబోమంటున్న బాధితుల
తండ్రికి బైక్ గిఫ్ట్‌ ఇద్దామని బయల్దేరింది.. కానీ ఇచ్చేలోపే..
తండ్రికి బైక్ గిఫ్ట్‌ ఇద్దామని బయల్దేరింది.. కానీ ఇచ్చేలోపే..
ఎండురొయ్యలను ఇష్టంగా తింటున్నారా..?ఏమౌతుందో తెలిస్తే షాక్ అవుతారు
ఎండురొయ్యలను ఇష్టంగా తింటున్నారా..?ఏమౌతుందో తెలిస్తే షాక్ అవుతారు
ఇండస్ట్రీకి మరో హీరోయిన్ దొరికేసింది మావ..!
ఇండస్ట్రీకి మరో హీరోయిన్ దొరికేసింది మావ..!
నాడు భగవద్గీత.. నేడు భారత్‌గీత..! శిక్ష తప్పదు..
నాడు భగవద్గీత.. నేడు భారత్‌గీత..! శిక్ష తప్పదు..
2025 మిస్.. 2026లో పక్క.. అంటున్న స్టార్ హీరోలు..
2025 మిస్.. 2026లో పక్క.. అంటున్న స్టార్ హీరోలు..