Doctors big Mistake: యువకుడు చనిపోయాడని చెప్పిన ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు.. పోస్ట్‌మార్టం రూమ్‌కి తీసుకెళ్లగా..

ఒక యువకుడిని బ్రతికుండగానే భావించి పోస్ట్‌మార్టం నిమిత్తం పంపారు కర్ణాటకలోని మహాలింగ్‌పూర్ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు. పోస్ట్‌మార్టం కోసం అన్నీ సిద్దం చేశాక.. ఆ యువకుడిలో కదలికలు గమనించిన సిబ్బంది.. తిరిగి ఆస్పత్రికి తరలించారు. 

Doctors big Mistake: యువకుడు చనిపోయాడని చెప్పిన ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు.. పోస్ట్‌మార్టం రూమ్‌కి తీసుకెళ్లగా..
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 02, 2021 | 3:18 PM

Doctors big Mistake: ఒక యువకుడిని బ్రతికుండగానే భావించి పోస్ట్‌మార్టం నిమిత్తం పంపారు కర్ణాటకలోని మహాలింగ్‌పూర్ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు. పోస్ట్‌మార్టం కోసం అన్నీ సిద్దం చేశాక.. ఆ యువకుడిలో కదలికలు గమనించిన సిబ్బంది.. తిరిగి ఆస్పత్రికి తరలించారు.

వివరాల్లోకి వెళ్తే.. బాగల్‌కోట్ జిల్లాలోని మహాలింగ్‌పూర్‌లోని రబాకావీ రోడ్‌లో ఫిబ్రవరి 27న జరిగిన రోడ్డు ప్రమాదంలో 27 సంవత్సరాల శంకర్ గోంబీ అనే వ్యక్తి గాయపడ్డాడు. దీంతో చికిత్స కోసం అతడిని  బెల్గాంలోని ఓ ప్రవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషయంగా ఉండటంతో అక్కడి నుంచి  అంబులెన్స్‌లో మహాలింగ్‌పూర్‌లోని ప్రభుత్వం ఆస్పత్రికి తరలించాలని భావించారు. మార్గమధ్యంలో అతడు అచేతనంగా ఉండటంతో చనిపోయాడనుకున్నారు. మహాలింగ్‌పూర్ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు కూడా అతడు చనిపోయాడని ధృవీకరించారు. ఆపై పోస్టుమార్డం కోసం తరలించారు. పోస్టుమార్టం రూమ్‌లో చనిపోయాడనుకున్న యువకుడి భుజాలు, కాళ్లు కదలడంతో తిరిగి ఆస్పత్రిలోకి తీసుకొచ్చారు.

ఈ క్రమంలో అతడి ఫ్రెండ్స్‌తో పాటు ప్రేయసి కూడా అతడు చనిపోయాడనుకున్ని రెస్ట్ ఇన్ పీస్ అంటూ వార్తలు సర్కులేట్ చేశారు. విచారకరమైన పాటలతో అతడి ఫోటోలు జతచేసి.. ఓ వీడియో కూడా రూపొందించారు. ప్రస్తుతం మరో ఆస్పత్రిలో శంకర్‌కు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. కాగా అతడి బ్రతికే ఉన్నాడన్న వార్త తెలియడంతో స్నేహితులతో పాటు శంకర్ ప్రియురాలు సోషల్ మీడియా నుంచి పోస్టులను రిమూవ్ చేశారు.

ఇప్పుడు ఈ ఘటన సోసల్ మీడియా వ్యాప్తంగా వైరల్‌గా మారింది. ఒక నిండు ప్రాణం పట్ల కనీసం విలువ లేకుండా వ్యవహరించడం పట్ల నెటిజన్లు తీవ్ర విమర్శలు కురిపిస్తున్నారు. మరి కొందరు నెటిజన్లు అయితే ఇలాంటి డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరి వైద్యశాఖ ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకుంటారో, లేదో చూడాలి.  చర్యలు తీసుకోని పక్షంలో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉంది.

Also Read:

సినిమా షూటింగ్‌‌లో పేలిన పెట్రోల్ బాంబులు.. ప్రముఖ హీరోకు గాయాలు

దుమ్ములేపిన సెహ్వాగ్ మేనల్లుడు.. బౌండరీల వర్షం.. కానీ జట్టును గెలిపించలేకపోయాడు