Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Electric Bike: పెట్రోల్‌కు బదులుగా.. బ్యాటరీ ఇంజన్.. మారిస్తే ఎంతవుతుందంటే..? వివరాలు..

Battery Engine Bike: దేశంలో ఇటీవల కాలంలో నిరంతరం పెట్రో ధరలు మండుతున్నాయి. ప్రతిరోజూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలతో సామాన్యులు తల్లడిల్లుతున్నారు. చమురు సంస్థలు తీసుకుంటున్న...

Electric Bike: పెట్రోల్‌కు బదులుగా.. బ్యాటరీ ఇంజన్.. మారిస్తే ఎంతవుతుందంటే..? వివరాలు..
battery engine bike
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 02, 2021 | 1:20 PM

Battery Engine Bike: దేశంలో ఇటీవల కాలంలో నిరంతరం పెట్రో ధరలు మండుతున్నాయి. ప్రతిరోజూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలతో సామాన్యులు తల్లడిల్లుతున్నారు. చమురు సంస్థలు తీసుకుంటున్న నిర్ణయం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు తమ వాహనాలను అమ్ముకుంటుంటే.. మరికొందరు పెట్రో భారం నుంచి తప్పించుకునేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. పెట్రో భారాన్ని తప్పించుకునేందుకు ద్విచక్రవాహనదారులు ఒక ఆవిష్కరణను కనుగొన్నారు. బైక్ పెట్రోల్ ఇంజిన్‌లను బ్యాటరీ ఇంజిన్‌లుగా మారుస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి సంఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్లు, ద్విచక్రవాహనాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే చాలామంది ఉన్న వాహనాలకు బ్యాటరీలను బిగిస్తూ పెట్రో భారం నుంచి తప్పించుకుంటున్నారని పలువురు పేర్కొంటున్నారు.

దీని ధర ఎంత ఉంటుందంటే..?

ఇలాంటి వాహనాల ఫొటోలను చాలామంది సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రచారం చేసుకుంటున్నారు. వారు పెట్రోల్ ఇంజిన్‌ను ఎలక్ట్రిక్ ఇంజిన్‌గా మారుస్తున్నామంటూ పేర్కొంటున్నారు. దీనికోసం సుమారు 10 వేల రూపాయలు ఖర్చవుతుందని చెబుతున్నారు. బ్యాటరీ ప్రకారం.. ఛార్జీల ధర మారుతుందని చెబుతున్నారు. అయితే వేగం మాత్రం గంటకు 65-70 కి.మీ. ప్రయాణించవచ్చంటూ వెల్లడిస్తున్నారు.

ఎలా మారుస్తారంటే..?

పెట్రోల్ ఇంజిన్‌ను ఎలక్ట్రిక్‌గా మార్చేటప్పుడు.. గేర్ బాక్స్ తొలగించి, యాక్సిలరేటర్ నుంచి అనుసంధానం చేస్తారని చెబుతున్నారు. యాక్సిలేటర్ ద్వారా వాహనాన్ని నియంత్రించవచ్చని తెలుపుతున్నారు. ముఖ్యంగా స్కూటీ లాగా పని చేస్తుందని పేర్కొంటున్నారు.

ప్రయోజనం

ఇలా మీ బండిని మార్చి.. 2 గంటలపాటు బ్యాటరీని ఛార్జ్ చేసుకుంటే.. 40 కిలోమీటర్లు నడపవచ్చు. దీంతోపాటు బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అయితే బైక్ 300 కి.మీ వరకు ప్రయాణించవచ్చంటున్నారు. అది బ్యాటరీపై ఆధారపడి ఉంటుందని పేర్కొంటున్నారు.

చట్టవిరుద్ధం..

ఇలా చేస్తే.. చట్టవిరుద్ధమని.. కేసులు నమోదవుతాయని పోలీసులు వెల్లడిస్తున్నారు. మోటారు వాహన చట్టం 1988 లోని సెక్షన్ 52 ప్రకారం.. ఏదైనా మోటారు వాహనంలో పరికరాలను మార్చడం చట్టపరమైన నేరం. దీని ప్రకారం వాహనాన్ని మార్చలేరు. అలా చేస్తే మీపై చట్టపరమైన నేరం కేసుతోపాటు, జరిమానా విధిస్తారు. దీంతోపాటు మీ భీమాను కూడా క్యాన్సెల్ చేస్తారు.

Also Read:

Horoscope Today: ఆ రాశుల వార్లకు చిక్కులు, చికాకులు.. ఎలా చేస్తే మంచిదో తెలుసా..? మంగళవారం రాశి ఫలాలు..

ముఖం మీద గుంటలతో ఇబ్బంది పడుతున్నారా ? అయితే ఈ టిప్స్ ఫాలో అయితే గుంటలు మాయం…