Horoscope Today: ఆ రాశుల వార్లకు చిక్కులు, చికాకులు.. ఎలా చేస్తే మంచిదో తెలుసా..? మంగళవారం రాశి ఫలాలు..
Horoscope 2nd March: మంగళవారం ముఖ్యంగా పలు రాశుల వారికి ఈ రోజులు పరిస్థితులు అనుకూలంగా లేవు. ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు కలగనున్నాయో.. ఓ సారి చూసేయండి..
Horoscope 2nd March: మనకు అవసరం లేని విషయాల్లో కూడా కొన్ని మనం తల దూర్చడానికి చాలాసార్లు ప్రయత్నిస్తుంటాం. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంటుంది. ముందు వెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాల వల్ల జీవితాలు చిన్నాభిన్నం అవుతుంటాయి. కావున తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ, చేపట్టే ప్రతీ కార్యక్రమంలోనూ ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసర ఉంది. మంగళవారం ముఖ్యంగా పలు రాశుల వారికి ఈ రోజులు పరిస్థితులు అనుకూలంగా లేవు. ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు కలగనున్నాయో.. ఓ సారి చూసేయండి..
మేషం: ఈ రాశి వారు ఈ రోజు చేపట్టే పనుల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగ ప్రయత్నాల విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. గణపతి సంకటనా షష్టోత్తరా పారాయణం చేయాలి. ఉండ్రాలు నివేదన చేసుకోవటం మంచింది.
వృషభరాశి: ఈ రాశి వారికి ఆర్థిక లావాదేవీలు.. అనుకూలంగా, ప్రతికూలంగా ఉండే అవకాశముంది. మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశముంది కావున ఇబ్బందులను అధిగమించేందుకు ప్రయత్నించాలి. సుబ్రహ్మణ్వేశ్వర ఆరాధన చేయాలి.
మిథున రాశి: ఈ రాశి వారు ఈ రోజు ప్రయాణ పరంగా, ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. దగ్గరి వ్యక్తులను సహాయసహకరాలు కోరుకునే అవకాశముంది. గౌరీశంకరుల ఆరాధన మేలు చేస్తుంది.
కర్కాటక రాశి: ఈ రాశి వారు ఈ రోజు సామాజిక సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు.. కావున జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆంజనేయస్వామి ఆరాధన మేలు చేస్తుంది.
సింహ రాశి: ఈ రాశివారికి ఈ రోజు కుటుంబపరంగా కొన్ని చిన్నచిన్న చిక్కులు ఉండే అవకాశముంది. జాగ్రత్తగా వాటిని తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి. గణపతి నామస్మరణ మేలు చేస్తుంది.
కన్యా రాశి : ఈ రాశివారికి ఈ రోజు వేరు వేరు రూపాల్లో లాభాలు కలిగే అవకాశముంది. జాగ్రత్తగా ఆలోచించి వాటిని సద్వినీయోగం చేసుకోవడం మంచింది. అష్టలక్ష్మీస్తోత్ర పారయణం మేలు చేస్తుంది.
తుల రాశి: ఈ రాశి వారు వేరు వేరు రూపాల్లో చేపట్టిన పనులను పూర్తి చేసేందుకు పట్టుదలతో వ్వవహరిస్తూ ఉండాలి. దీనికోసం ఈ రాశి వారు లలితా సహస్రనామస్తోత్ర పారాయణం చేసుకోవడం మంచిది.
వృశ్చిక రాశి: ఈ రాశి వారికి రావలసినటువంటి బాకీలు కొంత ఆలస్యమవుతూ ఉంటాయి. తెలివిగా వ్యవహరిస్తూ.. జాగ్రత్తగా వాటిని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయాలి. లక్ష్మీనారసింహా స్వామివారికి పొంగలిని నివేదించాలి.
ధనస్సు రాశి: ఈ రాశి వారు కుటుంబపరమైన కార్యక్రమాలను పూర్తి చేయాల్సిన అవసరాలు ఉంటాయి. మానసికమైన చిక్కులు చికాకులు ఉంటూ ఉంటాయి. చంద్రగ్రహణ ఆరాధన, శివాభిషేకం మేలు చేస్తుంది.
మకర రాశి: ఈ రాశి వారు ఈ రోజు ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఉంటాయి. వ్యక్తిగత అప్పుల భారాలు పెరుగుతూ ఉంటాయి. జాగ్రత్తగా వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. అష్టలక్ష్మీస్తోత్ర పారయణం చేయడం మంచింది.
కుంభ రాశి: ఈ రాశి వారికి ఈ రోజు కుటుంబంలో చిక్కులు, చికాకులు ఉంటాయి. జాగ్రత్తగా వాటిని అధిగమించే ప్రయత్నం చేయడం మంచింది. విష్ణు సహస్రనామస్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.
మీన రాశి: ఈ రాశి వారు చేపట్టిన పనులు అనుకూలించక ఈ రోజు ఇబ్బందులు పడుతూ ఉంటారు. తొందర్లోనే ఆందోళన తగ్గిపోతుంది. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవవాల్సిన అవసరం ఉంది. ఆధిత్యహృదయ పారాయణం మేలు చేస్తుంది.
Also Read: