Snake On Scooter : స్కూటర్ మీద ఐదు అడుగుల నాగుపాము చాకచక్యంగా పట్టుకున్న ఓ మహిళ
మనం ఇప్పుడు ఇంట్లో స్కూటర్ లేదా బైక్ ఇలా ఏవస్తువునైనా సరే ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే బయట పార్క్ చేసిన వాహనాల్లో ఏ విషపు జంతువో దూరే అవకాశం ఉంది. తాజాగా బయట పార్క్ చేసి ఉన్న ఓ స్కూటర్ పై..
Snake On Scooter : తగ్గుతున్న అడవులు.. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులతో జనావాసాల్లో అప్పుడప్పుడు కనిపించే పాములు ఇప్పుడు ఎప్పుడు బడితే అప్పుడు.. ఎక్కడ బడితే అక్కడ కనిపిస్తున్నాయి. ఒకొక్కసారి ఇంట్లో ఫ్రిడ్జ్ లో కూడా పాములు దర్శనమిస్తున్న వార్తలు చూస్తూనే ఉన్నాం. దీంతో మనం ఇప్పుడు ఇంట్లో స్కూటర్ లేదా బైక్ ఇలా ఏవస్తువునైనా సరే ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే బయట పార్క్ చేసిన వాహనాల్లో ఏ విషపు జంతువో దూరే అవకాశం ఉంది. తాజాగా బయట పార్క్ చేసి ఉన్న ఓ స్కూటర్ పై నాగుపాము దూరి హల చల్ చేసింది. ఈ ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
ఒడిశా రాజధాని భావనేశ్వర్ లోని ఓ ఇంట్లో వాహనం బయట పార్క్ చేసింది. ఆ స్కూటర్ లోనికి పాము దూరి పడగ విప్పింది. దీంతో ఆ కుటుంబ సభ్యులు భయంతో వెంటనే ఇంట్లోకి వెళ్లి.. తలుపు వేసుకున్నారు. స్నేక్ క్యాచర్ సుబెండు మల్లిక్ కు ఫోన్ చేశారు. సంచరం అందుకున్న సుబెందు తన వాలంటీర్ సిల్కా సెలోనేతో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. సెలోనే పడగ విప్పు బుసలు కొడుతున్న నాగుపాముని ఎంతో అవలీలగా పట్టుకుని బంధించారు.
అనంతరం జాగ్రత్తగా అడవుల్లో వదిలిపెట్టారు. ఈ సందర్భంగా సుబేందు మాట్లాడుతూ.. శీతాకాలంలో నిద్రాణస్థితిలో ఉన్న పాము ఆహారం కోసం బయటకు వచ్చింది. గత కొన్ని రోజులుగా ఆ పాము ఏమీ తినలేదు. అందుకే చాలా వీక్‌గా ఉందని చెప్పారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Also Read: