కరోనా టీకా వేయించుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావు.. టీకా వల్ల ఎలాంటి అపాయం లేదన్న మంత్రి

దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ విస్తరిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా కరోనా టీకా పంపిణీని ప్రభుత్వం ఉధృతం చేసింది. రోగ నిరోధక శక్తి..

కరోనా టీకా వేయించుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావు.. టీకా వల్ల ఎలాంటి అపాయం లేదన్న మంత్రి
Follow us
K Sammaiah

|

Updated on: Mar 02, 2021 | 12:25 PM

దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ విస్తరిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా కరోనా టీకా పంపిణీని ప్రభుత్వం ఉధృతం చేసింది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే 60 ఏళ్ల వయసు పైబడిన వారికి మొదటి ప్రాధాన్యతగా టీకా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు టీకా తీసుకున్నారు. టీకా తీసుకోవడం వల్ల ఎలాంటి అపాయం లేదని సాధారణ ప్రజలకు భరోసా కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ నేపథ్యంలో రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖల‌ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నారు. రెండో దశ వ్యాక్సినేషన్‌లో భాగంగా వ‌రంగ‌ల్‌లోని ఎంజిఎం దవాఖానలో కొవిషీల్డ్‌ టీకా తొలి డోసు వేయించుకున్నారు. అలాగే తమ సతీమణి ఎర్రబెల్లి ట్రస్ట్ చైర్ పర్సన్ ఉషా దయాకర్ రావు, వారి కుటుంబ సభ్యులు టీకాలు వేయించుకున్నారు. అలాగే మేయర్ గుండా ప్రకాష్ రావు కూడా టీకా తీసుకున్నారు.

అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మేయర్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, dmho, ఎంజీఎం సూపరింటెండెంట్ తదితరులతో కలిసి మంత్రి మీడియా తో మాట్లాడారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా రెండో దశ వ్యాప్తి పెద్దగా లేదని చెప్పారు. ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. మొద‌టి క‌రోనా వైర‌స్ నే ఎదుర్కొన్న మ‌న‌కు రెండో వైర‌స్ పెద్ద‌గా లెక్క కాద‌న్నారు. అయిన‌ప్ప‌టికీ, ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, సామాజిక భౌతిక‌ దూరం పాటిస్తూ, మాస్కులు ధ‌రించాల‌న్నారు. కొద్దిపాటి జాగ్ర‌త్త‌లు పాటిస్తూ నిత్య జీవ‌న వ్య‌వ‌హారాలు చూసుకోవాల‌ని సూచించారు. ఈ సందర్భంగా కరోనాపై జరుగుతున్న పోరులో శాస్త్రవేత్తలు, డాక్టర్లు, న‌ర్సులు, ఇత‌ర మెడిక‌ల్, పారా మెడిక‌ల్ సిబ్బంది ఫ్రంట్ వారియ‌ర్లు చేస్తున్న కృషిని మంత్రి కొనియాడారు.

ఇక ప్రజలు ప్రభుత్వ దవాఖానా లలోనే టీకా లు తీసుకోవాలి. ప్రజలు భరోసాగా ఉండండి. నిన్న ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కూడా హుజూరాబాద్ ప్రభుత్వ హాస్పిటల్ లోనే టీకా తీసుకున్నారు. నేను, నా కుటుంబ సభ్యులు అంతా కలిసి ప్రభుత్వ ఎంజీఎం హాస్పిటల్స్ లోనే టీకా లు వేయించుకున్నమని అన్నారు. ప్రజలు కూడా ప్రభుత్వ దవాఖానలో నే టీకా లు తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే కరోనా సమయంలో ఎంజీఎం వంటి ప్రభుత్వ దవాఖాన లలోనే మంచి వైద్యం అందించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ప్రభుత్వ దవాఖాన లలో కావాల్సిన అన్ని టీకాలు అందుబాటులోనే ఉన్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.

కాగా, 60 ఏండ్లు పైబడిన వారితోపాటు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు టీకా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. కరోనా వ్యాక్సిన్‌పై అపోహలు వద్దని సూచించారు. అర్హులైన వారంతా టీకా కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు. అందుబాటులో ఉన్న దవాఖానల్లో టీకా వేయించుకోవాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడుత కొవిడ్ వ్యాక్సినేషన్‌ ప్రారంభమయ్యింద‌ని, ఇందులో భాగంగా 60 ఏండ్లు పైబడిన వారితోపాటు 45-59 ఇండ్లల్లో ఉండి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు టీకాలు వేయనున్నారని మంత్రి చెప్పారు. రెండు కేటగిరీల్లో 50 లక్షల మంది ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.

తొలిరోజు 90 కేంద్రాల్లో ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నవారికి టీకా పంపిణీ చేస్తారు. cowin.gov.inలో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నవారికి టీకా వేయనున్నారని మంత్రి వివ‌రించారు. ఇదిలా ఉండగా… రాష్ట్రంలో 1200 కేంద్రాలు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో 136 కేంద్రాలు, వరంగల్ అర్బన్ జిల్లాలో 49 కేంద్రాల్లో వాక్సిన్ వేస్తున్నట్లు చెప్పారు.

Read more:

మీ రాష్ట్రాల్లో ఒక్క ఉద్యోగం ఎక్కువిచ్చినా.. ఒక్క రూపాయి జీతం అధికంగా ఇచ్చినా రాజీనామాకు సిద్ధం -మంత్రి వేముల

ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!