బెంగాల్ ఎన్నికల్లో 92 సీట్లకు పోటీ చేస్తాం, కాంగ్రెస్ ప్రకటన, లెఫ్ట్ పార్టీలతో పొత్తు, అధిర్ రంజన్ చౌదరి

బెంగాల్ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ 92 సీట్లకు పోటీ చేస్తుందని రాష్ట్ర కాంగ్రెస్  పార్టీ అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌదరి ప్రకటించారు. సీట్ల పంపిణీని  తమ పార్టీ,

  • Umakanth Rao
  • Publish Date - 12:39 pm, Tue, 2 March 21
బెంగాల్ ఎన్నికల్లో 92 సీట్లకు పోటీ చేస్తాం, కాంగ్రెస్ ప్రకటన, లెఫ్ట్ పార్టీలతో పొత్తు, అధిర్ రంజన్ చౌదరి

బెంగాల్ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ 92 సీట్లకు పోటీ చేస్తుందని రాష్ట్ర కాంగ్రెస్  పార్టీ అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌదరి ప్రకటించారు. సీట్ల పంపిణీని  తమ పార్టీ, లెఫ్ట్ పార్టీలు ఖరారు చేశాయని, తమ అభ్యర్థుల పేర్లను మరో రెండు రోజుల్లో ప్రకటిస్తామని ఆయన చెప్పారు. మొదట తాము 130 సీట్లు కోరామని, కానీ మరికొన్ని ఇతర పార్టీలకు కూడా అవకాశం ఇవ్వాలని భావించి 92 సీట్లలో పోటీచేయాలని నిర్ణయించామని ఆయన చెప్పారు. ఆర్జేడీ, ఎన్సీపీతో సీట్ల సర్దుబాటుకు ఛాన్స్ లేదని, కానీ ఇతర పార్టీలతో పొత్తుకు సిద్డంగా ఉన్నామని చౌదరి చెప్పారు. కాగా కాంగ్రెస్ పార్టీతో పొత్తు విషయంలో తాము ఎలాంటి సమస్య ఎదుర్కోవడంలేదని లెఫ్ట్ ఫ్రంట్ చైర్మన్ బిమన్ బోస్ తెలిపారు. రానున్న రోజుల్లో తాము కూడా తమ అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తామన్నారు.

 

ఇక ప్రధాన  పార్టీలైన తృణమూల్, బీజేపీ తాము ఎన్ని సీట్లకు పోటీ చేస్తామన్న విషయాన్నీ ప్రకటించాల్సి ఉంది. బెంగాల్ లో మార్చి 27 నుంచి 8 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పార్టీలు కూడా రేపో మాపో  తాము పోటీ చేసే సీట్ల  సంఖ్యను ప్రకటించవచ్చునని భావిస్తున్నారు. 2016 లో లెఫ్ట్ ఫ్రంట్ 77 సీట్లను గెలుచుకోగా  బీజేపీకి కేవలం మూడు స్థానాలు మాత్రమే దక్కాయి. 211 సీట్లు గెలుచుకుని తృణమూల్ కాంగ్రెస్ అతి పెద్ద పార్టీగా అవతరించింది. కానీ 2019 లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో 42 సీట్లకు గాను బీజేపీ 18 స్థానాలు గెలుచుకుని  మంచి పునాదులు వేసుకుంది. ఆ ధైర్యంతోనే ప్రస్తుతం ఇక్కడ  ఈ పార్టీ నేతలు సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రచార హోరును రేకెత్తిస్తున్నారు . ఇప్పటికే ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా సహా పలువురు అగ్ర నేతలు ఈ రాష్ట్రాన్ని సందర్శించారు. అటు సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కూడా బీజేపీని ఎదుర్కొనేందుకు తీవ్ర స్థాయిన పావులు కదుపుతున్నారు.

మరిన్ని చదవండి ఇక్కడ :

కరోనా టీకా వేయించుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావు.. టీకా వల్ల ఎలాంటి అపాయం లేదన్న మంత్రి

రేషన్‌ వాహనాల రంగుల మార్పుపై వెనక్కి తగ్గిన ఎస్ఈసీ, తాజా నిర్ణయంతో ప్రభుత్వ పిటిషన్‌ను క్లోజ్‌ చేసిన ఏపీ హైకోర్టు