AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vava Suresh Real Hero : కింగ్ కోబ్రాలను సైతం కాపాడి ముద్దాడే ఈ హీరోకు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఫ్యాన్‌ఫాలోయింగ్

ఎవరికైనా పాము అంటే భయం.. అది ఏజాతిదైనా.. ఆ పాము వల్ల హాని జరిగినా జరక్కపోయినా పాము కనిపిస్తే చాలు.. భయంతో అల్లంత దూరం పరిగెడతారు. దైర్యం కలవారైతే.. ఆ పాముని చంపడానికి కర్రతీసుకుని వస్తారు. అయితే కేరళలో మాత్రం పాము కనిపిస్తే..

Vava Suresh Real Hero :  కింగ్ కోబ్రాలను సైతం కాపాడి ముద్దాడే ఈ హీరోకు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఫ్యాన్‌ఫాలోయింగ్
Surya Kala
|

Updated on: Mar 02, 2021 | 12:37 PM

Share

Vava Suresh snake catcher : ఎవరికైనా పాము అంటే భయం.. అది ఏజాతిదైనా.. ఆ పాము వల్ల హాని జరిగినా జరక్కపోయినా పాము కనిపిస్తే చాలు.. భయంతో అల్లంత దూరం పరిగెడతారు. దైర్యం కలవారైతే.. ఆ పాముని చంపడానికి కర్రతీసుకుని వస్తారు. అయితే కేరళలో మాత్రం పాము కనిపిస్తే ఎవరైనా కొట్టడానికి కర్ర ఎత్తితే వెంటనే వాటిని రక్షించడానికి దేవుడిలా వావా సురేష ప్రత్యక్షమవుతాడు. జనం నుంచి ఇప్పటి వరకూ కొన్ని వందల విషపు సర్పాలను రక్షించిన వావా సురేష్ కు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఫాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. అతనిని 15 లక్షల మంది అనుసరిస్తున్నాడంటే పాముల రక్షించడం లో అతను ఎంత గుర్తింపు తెచ్చుకున్నాడో అర్ధం చేసుకోవచ్చు.

పాముని చూస్తేనే వెన్నులో వణుకు పుట్టేటంత పెద్ద పెద్ద కింగ్ కోబ్రాలను సైతం అలవోకగా పట్టుకోవడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. వాటిని పట్టుకుని ముద్దు పెడతాడు.. వాటితో మనం కుక్కపిల్లతో సెల్ఫీ గిడినంత ఈజీగా సెల్ఫీ దిగుతాడు. అడవులను దాటి ఇంకెప్పుడు జనం మధ్యకు రావద్దని సుద్దులు చెప్పిమరీ వాటిని అడవుల్లో వదిలేస్తాడు సురేష్.

కేరళలోని తేయాకు తోటల్లో దట్టమైన అటవీ ప్రాంతాల్లో సమీప గ్రామాల్లో కింగ్ కోబ్రాలు ఎక్కుగా సంచరిస్తాయికి. అలా ఎప్పుడైనా కింగ్ కోబ్రా కనిపిస్తే వెంటనే వావా సురేష్ కు సమాచారం అందుతుంది. వాటిని ఎటువంటి కర్ర సాయం లేకుండా వట్టి చేతులతో ఎంతో లాఘవంగా పట్టుకుంటాడు. పడగ విప్పు బుసలు కొడుతున్న ఆ నాగుపాములతో ఫోటోకి పోజులు కూడా ఇస్తాడు. ఇలా ఇప్పటివరకూ కేరళలోని 170 కింగ్‌కోబ్రాలు, 50వేల పాములను సురేష్ సంరక్షించాడు.

అయితే సురేష్ చేస్తున్న ఈ పని అత్యంత అపాయకరం. దినదిన గండం నూరేళ్ళ ఆయుస్సు అని చెప్పవచ్చు. కింగ్ కోబ్రా ఏమీ సురేష్ స్నేహితురాలు కాదు.. కాటెయ్యకుండా ఉండడానికి.. మరి అటువంటి విష సర్పం కాటేస్తే ఇంకేమైనా ఉందా.. మరి సురేష్ ఇలా పాములను పట్టుకునే సమయంలో ఏ పాము కరవాలేదా అంటే.. పాములు కరిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని అంటాడు సురేష్.

కొని సార్లు సురేష్ పాము కాటుతో ముత్యువు చివరి అంచుల వరకూ వెళ్ళాడు. అతను 3887 సార్లు ‌ పాముకాటుకు గురయ్యాడు. వీటిల్లో 387 అత్యంత ప్రమాదకరమైన విష సర్పాలు కూడా కాటేశాయి. 10 సార్లు కు పైగా ప్రాణాలు పోతాయనే స్టేజ్ కు చేరుకున్నాడు.. రెండు సార్లు వెంటిలేటర్ల పై సురేష్ ఉంది చికిత్సానందుకున్నాడు.. అయినా సరే పాములను కాపాడతాను అని అంటాడు ఒకేసారి కింగ్ కోబ్రా కాటు వేయడంతో చేతి వేలిని ఆపరేషన్ చేసి తొలగించారు కూడా..

అయితే సురేష్ ఈ విషయం పై స్పందిస్తూ.. పాములు ప్రమాదకరమైనవి కావు అని చెప్పడానికి పాము విషం తాగుతానంటాడు. ఈ విషయం మెడిసిన్ లో వాడతారని.. దాదాపు 34 ప్రోటీన్స్ ఉంటాయని చెబుతాడు సురేష్. అయితే పాము విషం రక్తంలో కలిస్తే ప్రమాదం తప్ప మరెప్పుడూ కాదని తాను పాములను కాపాడడంలో ఎప్పుడూ రాజీ పడనని అంటారు సురేష్..

Also Read:

కృష్ణుడిని హిజ్రాలు పెళ్లి చూసుకొనే ఆలయం ఎక్కడుందో తెలుసా..! ఆ ఉత్సవం ఎప్పుడొస్తుందంటే

 పార్వతీదేవి ఒడిలో శయనిస్తున్న శివుని అరుదైన క్షేత్ర మహిమ ఏమిటో .. ఎలా చేరుకోవాలో తెలుసా..!