AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BJP MP: మధ్యప్రదేశ్ ఖండ్వా ఎంపీ కన్నుమూత.. సంతాపం తెలిపిన ప్రధాని మోదీ

Nand Kumar Singh Chauhan passes away: భారతీయ జనతా పార్టీ నాయకుడు, పార్లమెంట్ సభ్యుడు నందకుమార్‌ సింగ్‌ చౌహాన్‌ కన్నుమూశారు. హర్యానా గురుగ్రామ్‌ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో..

BJP MP: మధ్యప్రదేశ్ ఖండ్వా ఎంపీ కన్నుమూత.. సంతాపం తెలిపిన ప్రధాని మోదీ
Shaik Madar Saheb
|

Updated on: Mar 02, 2021 | 11:50 AM

Share

Nand Kumar Singh Chauhan passes away: భారతీయ జనతా పార్టీ నాయకుడు, పార్లమెంట్ సభ్యుడు నందకుమార్‌ సింగ్‌ చౌహాన్‌ కన్నుమూశారు. హర్యానా గురుగ్రామ్‌ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నందకుమార్ సింగ్ చౌహాన్ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. నంద్‌కుమార్‌ మధ్యప్రదేశ్‌ ఖండ్వా లోక్‌సభ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇటీవల ఆయన ఆరోగ్యం క్షీణించడంతో భోపాల్‌ నుంచి గురుగ్రామ్‌లోని మేదాంత హాస్పిటల్‌కు తరలించారు. గత జనవరి 11న ఆయనకు కరోనావైరస్ పరీక్ష చేయగా.. పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఆయన ఆరోగ్యం సహకరించకపోవడంతో.. వైద్యులు చౌహాన్‌‌ను గత కొద్దిరోజులుగా వెంటిలెటర్‌పైనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మంగళవారం ఉదయం కన్నుమూసినట్లు వైద్యులు వెల్లడించారు.

నందకుమార్‌ సింగ్‌ చౌహాన్‌ గతంలో పలుమార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన స్వస్థలం ఎంపీ బుర్హాన్‌పూర్‌ జిల్లాలోని షాపూర్‌. 8 సెప్టెంబర్‌, 1952లో జన్మించారు. 1996లో షాపూర్‌ మున్సిపల్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడిగా రాజకీయ జీవితం ప్రారంభించారు. చౌహాన్ 1996 నుంచి ఖండ్వా ఎంపీ సీటుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమిపాలయ్యారు. తిరిగి 2019లో ఎన్నికయ్యారు. నంద్‌కుమార్ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, పలువురు ఎంపీలు, బీజేపీ నేతలు సంతాపం తెలిపారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని, అంకితభావం గల నాయకుడిని బీజేపీ కోల్పోయిందంటూ ఈ మేరకు వారు ట్వీట్ చేశారు.

Also Read:

Breaking News :పాకిస్తాన్ లో అత్యవసరంగా దిగిన భారత విమానం, ఎందుకంటే ?

West Bengal: ఆ మంత్రులను పోటీ చేయకుండా నిషేధం విధించండి.. ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ