Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Petrol bomb explodes: సినిమా షూటింగ్‌‌లో పేలిన పెట్రోల్ బాంబులు.. ప్రముఖ హీరోకు గాయాలు

కన్నడ సినిమా షూటింగ్‌‌లో భాగంగా కొన్ని యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తుండగా అనుకోకుండా హీరో రిషబ్ శెట్టికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే..

Petrol bomb explodes: సినిమా షూటింగ్‌‌లో పేలిన పెట్రోల్ బాంబులు.. ప్రముఖ హీరోకు గాయాలు
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 02, 2021 | 10:11 AM

Petrol bomb explodes: కన్నడ సినిమా షూటింగ్‌‌లో భాగంగా కొన్ని యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తుండగా అనుకోకుండా హీరో రిషబ్ శెట్టికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తోన్న షూటింగ్‌లో పెట్రోల్ బాంబులు వేయాల్సిన సన్నివేశాలున్నాయి. స్క్రిప్ట్ ప్రకారం షూటింగ్‌లో ఫైట్ సీన్స్ షూట్ చేస్తున్నారు. అందులో భాగంగా హీరో రిషబ్‌తో పాటు మరో నటుడు లక్ష్మణ్ పెట్రో బాంబులు విసిరి పారిపోవాల్సిన సన్నివేశాలను షూట్ చేయాలి. కానీ ఈ సీన్‌లొ వారు పరిగెత్తే లోపే పెట్రో బాంబులు పేలాయి. దీంతో షూటింగ్‌లో హీరో రిషబ్‌తో పాటు మరో నటుడికి గాయాలయ్యాయి. ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో కర్ణాటక పోలీసులు సినిమా షూటింగ్ కోసం చిత్ర యూనిట్‌కు ఎవరు పర్మిషన్స్ ఇచ్చారనే విషయమై వివరాలు వాకబు చేస్తున్నారు. మొత్తంగా ఈ పెట్రో బాంబు ఘటన కన్నడ సినీ ఇండస్ట్రీలో  చర్చనియాంశమైంది.

హీరో రిషబ్ విషయానికొస్తే.. ఈయన కన్నడ ఇండస్ట్రీలో నుంచి హీరోగా మారాడు. అంతేకాదు పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన శాండిల్ వుడ్ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. 2013లో లూసియా సినిమాతో పరిచయమైన ఈయన చేతిలో ప్రస్తుతం అర డజను పైగా మూవీస్ ఉన్నాయి. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘హీరో’ చిత్ర షూటింగ్‌లో ఈ ప్రమాదం జరిగింది.  ఈ మూవీ మార్చి 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీలో గణవీ లక్ష్మణ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

ఈ మధ్యకాలంలో రిస్కీ స్టంట్‌లను డూప్స్‌కు బదులు హీరోలే చేస్తున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.  మన తెలుగు హీరోలు కూడా అప్పుడప్పుడు ఇలాంటి ప్రయత్నాలు చేసి ఇబ్బందులు ఎదుర్కున్నారు. శర్వానంద్, మంచు విష్ణు, సందీప్ కిషన్, వంటివారు ఈ మధ్యకాలంలో స్టంట్స్ చేస్తూ గాయపడ్డారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ సమయంలో గాయాలపాలయ్యారు. కాగా ఇటువంటి రిస్కీ సంట్స్ చేసే సమయంలో అనుభవం ఉన్న స్టంట్ మాస్టర్లను డూప్‌లుగా పెట్టుకుంటే బెటర్ అని నిపుణులు చెబుతున్నారు.

Also Read:

‘వైల్డ్ డాగ్’ థియేటర్లలోనే.. పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో నాగ్‌.. హైదరాబాద్‌ బాంబ్‌ బ్లాస్ట్‌ నేపథ్యంలో

అపార్ట్‌మెంట్‌లో మంటలు.. తల్లడిల్లిన తల్లి గుండె.. బిడ్డల్ని కిటికీలోనుంచి