Mother saves her four children: అపార్ట్‌మెంట్‌లో మంటలు.. తల్లడిల్లిన తల్లి గుండె.. బిడ్డల్ని కిటికీలోనుంచి

ఓ భారీ బహుళ అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. దట్టమైన పొగలతో చూస్తుండగానే మంటలు బిల్డింగ్‌ చుట్టుముట్టాయి. లోపల ఉన్నవారంతా భయంతో అరుపులు, కేకలతో ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది.

Mother saves her four children: అపార్ట్‌మెంట్‌లో మంటలు.. తల్లడిల్లిన తల్లి గుండె.. బిడ్డల్ని కిటికీలోనుంచి
Follow us

|

Updated on: Mar 02, 2021 | 9:43 AM

Mother saves her four children:  ఓ భారీ బహుళ అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. దట్టమైన పొగలతో చూస్తుండగానే మంటలు బిల్డింగ్‌ చుట్టుముట్టాయి. లోపల ఉన్నవారంతా భయంతో అరుపులు, కేకలతో ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది. బిల్డింగ్‌ మూడో అంతస్తులోని ఓ ఫ్లాట్‌లో తల్లి, నలుగురు చిన్నారులు చిక్కుకున్నారు. ఇంట్లోంచి బయటకు వచ్చేందుకు వీలు లేకుండా మెయిన్‌ డోర్‌ ముందు అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. తప్పించుకునే మార్గమే లేదు.

చుట్టూ దట్టమైన మంటలు, కళ్లముందే కన్న బిడ్డలు ఎక్కడ మంటల్లో చిక్కుకుంటారోనని ఆ తల్లి ఆందోళన పడింది. దిక్కుతోచని పిల్లల్ని ఎలాగైనా కాపాడాలని కాళ్లు, చేతులు విరిగినా.. పర్వాలేదు గానీ, తన పిల్లలు అగ్నికి ఆహుతి కాకూడదనుకుందేమో.. వారిని కిటికీలో నుంచి కిందకు విసిరేసింది.

ట‌ర్కీ రాజ‌ధాని ఇస్తాంబుల్‌లో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో చిక్కుకున్న మహిళ‌ త‌న న‌లుగురు పిల్లలను కిటికీ నుంచి కిందకు విసిరేసిన దృశ్యాలను అక్కడే ఉన్న కొంత మంది తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. అయితే.. ఆ భవనం కింద‌ ఉన్న కొంత మంది వాలంటీర్లు బ్లాంకెట్లతో ఆ పిల్లల్ని పట్టుకున్నారు. పిల్లలు క్షేమంగా బయటపడ్డారు. చివరకు అగ్నిమాపక సిబ్బంది సహాయంతో బిల్డింగ్‌ ఉన్నవారంతా ప్రాణాలలో బయటపడ్డారు.

కాగా మంటలు సంబంవించిన సమయంలో ఆ తల్లి పడ్డ యాతన అంతా, ఇంతా కాదు. ఒకవైపు మంటలు తరముకొస్తున్నాయి. గది అంతా పొగతో నిండిపోతుంది. బిడ్డలు భయంతో ఏడుస్తున్నారు. ఆ సమయంలో ఆ తల్లి పడ్డ మానసిక సంఘర్షణను వర్ణించడం సాధ్యం కాదు. ఈ క్రమంలో వారికి గాయాలైనా పర్వాలేదు కానీ.. ప్రాణాలతో భయటపడితే చాలు అనుకుంది. కింద వాలంటీర్లు సహకారం అందించడంతో ఒక్కోక్కర్నీ కిటికీ నుంచి కిందకు విసిరేసింది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు అవ్వకపోవడం ఊరటనిచ్చే విషయం. ఏది ఏమైనా ప్రస్తుతం సదరు వీడియోతో పాటు న్యూస్ కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా తెగ సర్కులేట్ అవుతుంది.

Also Read:

కీచక టీచర్.. విద్యార్థినులకు అశ్లీల చిత్రాలు చూపిస్తూ.. వికృత ఆనందం..

‘వైల్డ్ డాగ్’ థియేటర్లలోనే.. పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో నాగ్‌.. హైదరాబాద్‌ బాంబ్‌ బ్లాస్ట్‌ నేపథ్యంలో