రంగారెడ్డి జిల్లాలో దారుణం.. యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి.. తీవ్రగాయాలు

young man attacks woman: రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించిన యువతి కొద్ది కాలంగా పట్టించుకోవడం లేదన్న కారణంతో ప్రేమోన్మాది యువతిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. దీంతో తీవ్రంగా గాయపడిన...

రంగారెడ్డి జిల్లాలో దారుణం.. యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి.. తీవ్రగాయాలు
young man attacks woman
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 03, 2021 | 7:27 AM

young man attacks woman: రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించిన యువతి కొద్ది కాలంగా పట్టించుకోవడం లేదన్న కారణంతో ప్రేమోన్మాది యువతిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. దీంతో తీవ్రంగా గాయపడిన యువతిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్‌షాకోట్‌లో మంగళవారం జరిగింది. నార్సింగి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదర్‌షాకోట్‌కు చెందిన యువతి (29) ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో పనిచేస్తోంది. ఇక్కడ ఓ అంతర్జాతీయ క్షౌరశాలలో పనిచేసే హర్యానా రాష్ట్రానికి చెందిన షారూఖ్‌ సల్మాన్‌ (29) తో ఆమెకు కొంత కాలంగా పరిచయం ఉంది. ఇద్దరూ తరచూ కలుసుకునే వారు. సల్మాన్‌ అప్పుడప్పుడు ఇంటికి సైతం వస్తూ ప్రేమ పేరుతో వెంటపడుతున్నాడు. యువతి నిరాకరించడంతో ఆగ్రహం చెందిన సల్మాన్‌ మంగళవారం రాత్రి 7.30 గంటల సమయంలో యువతి ఫ్లాట్‌కు వచ్చి కత్తితో దాడికి పాల్పడ్డాడు. అడ్డుకునేందుకు యత్నించిన ఆ యువతి కుటుంబసభ్యులపై కూడా సల్మాన్ దాడికి పాల్పడ్డాడు.

కుటుంబసభ్యులు ఏడుస్తూ కేకలు వేయడంతో.. అప్రమత్తమైన స్థానికులు పారిపోతున్న సల్మాన్‌ను పట్టుకుని నార్సింగి పోలీసులకు అప్పగించారు. గాయపడిన యువతిని లంగర్‌హౌస్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. యువతికి వీపు భాగంలో రెండు తీవ్ర గాయాలు, రెండు చిన్నగాయాలయ్యాయి. ఆమెకు ప్రస్తుతం చికిత్స అందిస్తున్నామని.. పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read:

మావోయిస్టు కార్యకలాపాలపై పోలీసుల ఉక్కుపాదం.. ఎఎస్పీ ఎదుట లొంగిపోయిన నిషేధిత సీపీఐ మావోయిస్టు మిలీషియా సభ్యులు

వికారాబాద్ జిల్లాలో దారుణం.. అదృశ్యమైన వ్యక్తి దారుణహత్య.. తల, మొండెం వేరు చేసిన దుండగులు..!

10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం
వెంకటేశ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?
వెంకటేశ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?