AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణలో భారీ విధ్వంసానికి మావోయిస్టుల ప్లాన్.. బీర్‌సీసాలు, వెదురు బొంగులతో ల్యాండ్‌మైన్‌లు!

తెలంగాణలో భారీ విధ్వంసానికి మావోయిస్టులు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. దీంతో అలర్ట్‌ అయిన పోలీసులు గాలింపును తీవ్రం చేశారు. ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో కూంబింగ్ ఆపరేషన్ స్పీడప్ చేశారు.

తెలంగాణలో భారీ విధ్వంసానికి మావోయిస్టుల ప్లాన్.. బీర్‌సీసాలు, వెదురు బొంగులతో ల్యాండ్‌మైన్‌లు!
Ram Naramaneni
|

Updated on: Mar 03, 2021 | 8:16 AM

Share

తెలంగాణలో భారీ విధ్వంసానికి మావోయిస్టులు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. దీంతో అలర్ట్‌ అయిన పోలీసులు గాలింపును తీవ్రం చేశారు. ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో కూంబింగ్ ఆపరేషన్ స్పీడప్ చేశారు. డ్రోన్ల సాయంతో అణువణువూ గాలిస్తున్నారు. ఇటీవలే ములుగు జిల్లాలో ఏడుగురు మావోయిస్టులను అరెస్టు చేశారు. వారి నుంచి భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. బీర్‌సీసాలు, వెదురు బొంగులతో ల్యాండ్‌మైన్‌లు చేసి సీరియల్ బ్లాస్ట్‌లకు ప్లాన్ చేశారు. గ్రామాల్లోకి పోలీసులను వెళ్లనీయకుండా ఉండేలా రోడ్డుపై పెట్టే చువ్వలు… ఉచ్చులను కూడా పోలీసులు గుర్తించారు. వీళ్ల అరెస్టుతో భారీ కుట్రలను పోలీసులు అడ్డుకోగలిగారు. ఛత్తీస్‌గఢ్ నుంచి రోజూ వందల మంది కూలీలు తెలంగాణ జిల్లాల్లో పని కోసం వస్తుంటారు.

వాళ్ల వేషాల్లో మావోయిస్టు కీలక నేతలు రాష్ట్రంలోకి చొరబడినట్టు పోలీసులకు ఉప్పు అందింది. కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌లో భారీ స్థాయిలో దొరికిన ల్యాండ్‌మైన్స్‌ కూడా పోలీసులను కలవరపెడుతున్నాయి. దీనికి తోడు ఛత్తీస్‌గఢ్‌ సుక్మా జిల్లాలో సరికొత్త టెక్నాలజీతో బాణం బాంబ్‌ను ఓ లారీపై ప్రయోగించారు మావోయిస్టులు. ఈ నేపథ్యంలో సెర్చ్‌ ఆపరేషన్ తీవ్రం చేశారు. డ్రోన్‌లతో నిత్యం పర్యవేక్షిస్తూనే… సరిహద్దులపై ప్రత్యేక నిఘా పెట్టారు. తెలంగాణలోకి వస్తున్న కూలీలను ప్రశ్నిస్తున్నారు. ఆధార్‌కార్డులు పరిశీలిస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బాంబ్‌ స్క్వాడ్‌తో విస్తృతంగా గాలిస్తున్నారు. ములుగు జిల్లాలోని వెంకటాపురం, వాజేడు, ఏటూరునాగారం, మంగపేట, చర్ల మండలాల్లో స్పెషల్‌ ఫోకస్ చేశారు పోలీసులు. మావోయిస్టులు కొత్త పద్దతిలో అమర్చిన మందు పాతర్లు వెలికి తీయడం కోసం దువ్వెన ఆపరేషన్ చేపటారు. ప్రధాన రహదారికి ఇరువైపుల దున్ని లాండ్‌మైన్స్ వెలికి తీస్తున్నారు. కూంబింగ్ పార్టీస్‌ను, సీఆర్‌పీఎఫ్ బలగాలను టార్గెట్ చేసి సినీ ఫక్కీలో కొత్త తరహా బ్లాస్టింగ్స్‌కు మావోయిస్టులు స్కెచ్ వేశారని పోలీసులు చెబుతున్నారు. మావోయిస్టులు ఇంత సడన్‌గా యాక్టివ్ పనిచేడానికి గల కారణాలను ఇంటిలిజెన్స్ టీమ్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది.

Also Read:

ఒకటి కాదు.. రెండు కాదు కుప్పలు తెప్పలుగా పాములు… కన్నంలో నుంచి బుసలు కొడుతూ వచ్చాయి.. చివరకు

Doctors big Mistake: యువకుడు చనిపోయాడని చెప్పిన ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు.. పోస్ట్‌మార్టం రూమ్‌కి తీసుకెళ్లగా..