Fake Currency: అంతా జిరాక్స్ డబ్బే.. ఆంధ్రా – ఒడిషా సరిహద్దుల్లో 7.9 కోట్ల నకిలీ కరెన్సీ పట్టివేత
Crime News: కారులో ముగ్గురు వ్యక్తులు దర్జాగా వెళుతున్నారు. పెద్ద పెద్ద నాలుగు ట్రాలీ బ్యాగులున్నాయి. అనుమానం రాకుండా వారు టూర్‌కు వెళ్తున్నట్లు కనిపించారు. కట్ చేస్తే సీన్ రివర్స్ అయింది. పోలీసుల తనిఖీల్లో..
Crime News: కారులో ముగ్గురు వ్యక్తులు దర్జాగా వెళుతున్నారు. పెద్ద పెద్ద నాలుగు ట్రాలీ బ్యాగులున్నాయి. అనుమానం రాకుండా వారు టూర్‌కు వెళ్తున్నట్లు కనిపించారు. కట్ చేస్తే సీన్ రివర్స్ అయింది. పోలీసుల తనిఖీల్లో తళతళలాడే కొత్తనోట్లు కనిపించాయి. అదంతా నిజం డబ్బు అనుకునేరు.. అస్సులు కానే కాదు. ప్రింటింగ్ వేసిన కోట్లది రూపాయల నకిలీ నోట్లు. ఈ సంఘటన ఒడిషా- ఆంధ్రా సరిహద్దుల్లో చోటుచేసుకుంది. సోమవారం ఒడిశాలోని కొరాపుట్ జిల్లా పొట్టంగి పోలీసులు సోమవారం రాత్రి తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఒడిశా-ఆంధ్ర సరిహద్దు గ్రామమైన సుంకిలో ఓ కారును తనిఖీ చేయగా.. పెద్ద ఎత్తున నకిలీ కరెన్సీ వ్యవహారం బయటపడింది. దీంతో ముగ్గురిని అదుపులోకి తీసుకొన్నారు.
పోలీస్ స్టేషన్‌కు వచ్చిన అనంతరం పోలీసులు డబ్బును లెక్కించారు. మొత్తం 1580 కట్టల రూ.500 నకిలీ నోట్లు రూ.7.90 కోట్లు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. రాయపూర్‌లో కలర్ జిరాక్స్ తీసి విశాఖపట్నం తరలిస్తున్నట్లు నిందితులు అంగీకరించారని సునాబెడ పోలీసులు వెల్లడించారు. నిందితుల నుంచి రూ.35 వేల నగదు, క్రెడిట్, డెబిట్ కార్డులు, 5 ఫోన్లు స్వాధీనం చేసుకొని, మంగళవారం కోర్టులో హాజరుపర్చారు. ఈ దొంగ నోట్ల వ్యవహారం వెనుక ఒక ముఠా ఉందని, దానిపై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
దీనిపై రాయ్‌పూర్‌లో కూడా తనిఖీలు నిర్వహించనున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ డబ్బు ఎవరిది..? ఎవరికీ చేర్చుతున్నారు..? దీని వెనుక ఎవరున్నారు అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. అయితే ఇంతపెద్ద మొత్త ఫేక్ కరెన్సీ విశాఖపట్నానికి చేరుస్తున్నారని తేలడంతో విశాఖ పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు.
Odisha: Three persons arrested in Koraput for possessing Rs 7.9 crores of fake currency.
“We found 4 trolley bags carrying fake currency in a car. During interrogation, accused told that these notes were printed in Raipur. We’ve seized 5 mobiles. Probe on,” said police (02.03) pic.twitter.com/Eh4aPhLfKm
— ANI (@ANI) March 2, 2021
Also Read: