మావోయిస్టు కార్యకలాపాలపై పోలీసుల ఉక్కుపాదం.. ఎఎస్పీ ఎదుట లొంగిపోయిన నిషేధిత సీపీఐ మావోయిస్టు మిలీషియా సభ్యులు
భద్రాచలం సబ్ డివిజన్ లో కొంత కాలంగా మావోయిస్టుల కార్యకలాపాలు పెరుగతున్న నేపథ్యంలో పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో నిషేధిత సీపీఐ మావోయిస్ట్..
భద్రాచలం సబ్ డివిజన్ లో కొంత కాలంగా మావోయిస్టుల కార్యకలాపాలు పెరుగతున్న నేపథ్యంలో పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో నిషేధిత సీపీఐ మావోయిస్ట్ పార్టీ మిలీషియ సభ్యులు మరియు గ్రామ కమిటీ సభ్యులు మంగళవారం పోలీసులకు లొంగిపోయారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం లోని చెన్నాపురం గ్రామానికి చెందిన 1) కల్ము అడమ s/o లేట్ దేవ, వయస్సు:25 సం, నిషేధిత సీపీఐ మావోయిస్ట్ పార్టీ గ్రామ కమిటీ సభ్యుడు, 2) మడివి అడమ s/o లేట్ కామ, వయస్సు: 41 సం, నిషేధిత CPI మావోయిస్ట్ పార్టీ గ్రామ కమిటీ సభ్యుడు, 3) మడకం సోముడు s/o అడమ, వయస్సు: 33 సం, నిషేధిత సీపీఐ మావోయిస్ట్ పార్టీ గ్రామ కమిటీ సభ్యుడు, 4) మడకం దేవ s/o భుద్ర, వయస్సు:22 సంవత్సరాలు, నిషేధిత CPI మావోయిస్ట్ పార్టీ గ్రామ కమిటీ సభ్యుడు, 5) మడకం సోన s/o మూక, వయస్సు: 25 సం, నిషేధిత CPI మావోయిస్ట్ పార్టీ మిలిషియా సభ్యుడు మొత్తం ఐదుగురు భద్రాచలం ఏఎస్పీ జీ వినీత్ ఎదుట లొంగిపోయారు.
వీరు గత మూడు సంవత్సరాలుగా నిషేధిత సీపీఐ మావోయిస్ట్ పార్టీ కి చెన్నాపురం గ్రామ కమిటీ సభ్యులుగా మరియు మిలీషియా సభ్యులుగా పని చేస్తున్నారు. వీరు గతం లొ రెండు బ్లాస్టింగ్ కేసుల్లో, మరియు చెన్నపురం వద్ద పోలీస్ వారిని గాయపరచాలనే ఉద్దేశ్యం తో మొనదేలిన ఇనుప చువ్వలు గల చెక్కలను అమర్చిన కేసులో ఉన్నారు. నిషేధిత సీపీఐ మావోయిస్ట్ పార్టీ వారు ప్రస్తుతం అమాయక గిరిజనుల పట్ల, ప్రజల పట్ల అవలంబిస్తున్న విధానాల వల్ల విసుగు చెంది లొంగిపోతున్నామని మిలీషియా సభ్యులు చెప్పారు.
అయితే మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు కొంతకాలంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దులో ఉన్న ఛత్తీస్గఢ్ లోనే ఎక్కువగా నడుస్తున్నాయి. భద్రాచలం నియోజకవర్గానికి ఆనుకుని ఉన్న బీజాపూర్, దంతెవాడ, సుక్మా జిల్లాలో మావోయిస్టు పార్టీ కమిటీ బలంగా ఉన్నాయి. ఈ క్రమంలో గత రెండేళ్లుగా ఈ ప్రాంతాల్లో మావోయిస్టులకు పోలీసులకు మధ్య నిత్యం పోరు నడుస్తోంది. దండకారణ్యం భద్రాద్రి, ములుగు జిల్లా సరిహద్దుగా ఉండడంతో ఇక్కడి గిరిజన గూడేల్లో ఎప్పుడూ అలజడి వాతావరణమే నెలకొంటోంది.
మావోయిస్టులు తమ కార్యకలాపాలను ఛత్తీస్ గఢ్ నుంచి ఇతర రాష్ట్రాలకు విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మొదట తెలంగాణ రాష్ట్రంలో గత ప్రాభవం సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే గోదావరి పరీవాహక జిల్లాల్లోని అన్ని సబ్ డివిజన్ లో ఐపీఎస్ అధికారులను నియమిస్తూ మావోల కట్టడికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది.
Read more:
అంగన్‌వాడీ యూనియన్ నేతలతో మంత్రి సత్యవతి రాథోడ్ భేటీ.. అంగన్‌వాడీల వినతిపత్రంలో ఏమేమి ఉన్నాయంటే..