AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అంగన్‌వాడీ యూనియన్ నేతలతో మంత్రి సత్యవతి రాథోడ్ భేటీ.. అంగన్‌వాడీల వినతిపత్రంలో ఏమేమి ఉన్నాయంటే..

దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో రెండుసార్లు అంగన్‌వాడీల వేతనాలు పెంచామని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్..

అంగన్‌వాడీ యూనియన్ నేతలతో మంత్రి సత్యవతి రాథోడ్ భేటీ.. అంగన్‌వాడీల వినతిపత్రంలో ఏమేమి ఉన్నాయంటే..
K Sammaiah
|

Updated on: Mar 02, 2021 | 6:17 PM

Share

దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో రెండుసార్లు అంగన్‌వాడీల వేతనాలు పెంచామని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ అన్నారు. అంగన్ వాడీ యూనియన్ నేతలతో సమావేశమైన మంత్రి పలు సమస్యలపై చర్చించారు. అంగన్ వాడీలంటే ముఖ్యమంత్రి కేసిఆర్ గారికి అమితమైన ఇష్టమని, అందుకే రాష్ట్రంలో అంగన్ వాడీలకు రెండుసార్లు వేతనాలు పెంచారని మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు.

అంగన్ వాడీల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ అంగన్ వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ సభ్యులు బిక్షపమ్మ నేతృత్వంలో నేడు మంత్రి సత్యవతి రాథోడ్‌ను మంత్రుల నివాస ప్రాంగణంలో కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ నేపథ్యంలో అంగన్‌వాడీలనుద్దేశించి మంత్రి మాట్లాడారు. అంగన్ వాడీల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉంటుందని, ముఖ్యమంత్రి కేసిఆర్ దృష్టికి తీసుకెళ్లి వీటన్నింటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని మంత్రి తెలిపారు.

అంగన్‌వాడీల వినతి పత్రంలో ఏమేమి ఉన్నాయంటే..

అంగన్ వాడీ టీచర్స్, హెల్పర్స్, మిని టీచర్లకు హెల్త్ కార్డులు అందించాలని, జీవిత బీమా కల్పించాలని, రిటైర్మెంట్ బెనెఫిట్స్ వర్తింపజేయాలని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లకు అవకాశం కల్పించాలని, జియో ట్యాగింగ్ విధానం విరమించాలని, అంగన్ వాడీ టీచర్లకు 20వేల రూపాయలు, ఆయాలకు 15వేల రూపాయలు, మినీ అంగన్ వాడీ టీచర్లకు 18వేల రూపాయల వరకు వేతనాలు పెంచాలని అంగన్‌ వాడీ యూనియన్‌ సభ్యులు కోరారు.

అదేవిధంగా కేజీ నుంచి పీజీ వరకు గల విద్య వ్యవస్థలో అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్ల, మినీ అంగన్ వాడీలను సేవలను ఉపయోగించుకుని వారిని రెగ్యులర్ చేయాలని, ప్రభుత్వ టీచర్లకు వర్తించే సెలవులు ఇవ్వాలన్నారు. విధి నిర్వహణలో మరణించిన వారి కుటుంబంలోని వ్యక్తికి ఉద్యోగ అవకాశం కల్పించాలని, రేషన్ దుకాణం నుంచి బియ్యం తీసుకెళ్లడానికి రవాణా ఖర్చులు ఇప్పించాలని వినతి పత్రంలో కోరారు.

అంగన్‌వాడీల వినతిపత్రంపై సానుకూలంగా స్పందించిన మంత్రి సత్యవతి రాథోడ్ వీటిని ముఖ్యమంత్రి కేసిఆర్ దృష్టికి తీసుకెళ్లి ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు పరిష్కరించే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షురాలు బిక్షపమ్మతో పాటు నిర్మల, సౌజన్య, ఉమాదేవి, రాజమణి, రాజేశ్వరి, కవిత, జమున, ప్రమీణ, పద్మ, కవిత, సునీత, సంగీత, అనంతలక్ష్మీ, వనజాక్షి, సబిత తదితరులు ఉన్నారు.

Read more:

మొన్న మహారాష్ట్ర.. నిన్న బీహార్‌.. నేడు తమిళనాడు.. పాతబస్తీ దాటి పాగా వేసేందుకు పతంగి పార్టీ పావులు