తిరుపతిలో ఆరేళ్ల బాలుడి కిడ్నాప్‌ కలకలం.. రంగంలోకి ప్రత్యేక బృందాలు.. పక్కా ప్లాన్‌ ప్రకారమే!

తిరుపతిలో ఆరేళ్ల బాలుడి కిడ్నాప్‌ కలకలం రేపుతోంది. ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన శివమ్‌కుమార్‌ సాహు కుటుంబం గత నెల 27న తిరుపతికి వచ్చారు.

తిరుపతిలో ఆరేళ్ల బాలుడి కిడ్నాప్‌ కలకలం.. రంగంలోకి ప్రత్యేక బృందాలు.. పక్కా ప్లాన్‌ ప్రకారమే!
తిరుపతిలో బాలుడి కిడ్నాప్
Follow us

|

Updated on: Mar 03, 2021 | 3:56 PM

తిరుపతిలో ఆరేళ్ల బాలుడి కిడ్నాప్‌ కలకలం రేపుతోంది. ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన శివమ్‌కుమార్‌ సాహు కుటుంబం గత నెల 27న తిరుపతికి వచ్చారు. అలిపిరి బస్టాండ్‌ దగ్గర ఉన్న సమయంలో ఓ వ్యక్తి మాయమాటలు చెప్పి ఆ బాలుడిని తీసుకెళ్లాడు. శ్రీవారి దర్శనం కోసం సాహు కుటుంబం తిరుపతికి వచ్చింది.

బాలుడి కిడ్నాప్‌ విజువల్స్‌ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. బస్టాండ్‌లో సాహు కుటుంబం ఉన్న పక్కనే అతను కూడా పడుకుని ఉన్నాడు. పేపర్‌ చదువుతూ కనిపించాడు. అతనే ఆ బాలుడిని తీసుకెళ్లినట్టుగా గుర్తించారు. కిడ్నాపర్‌ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

గత నెల 27వ తేదీన మధ్యాహ్నం 12 గంటల 16నిమిషాల టైంలో తల్లిదండ్రులతోనే ఉన్నాడు ఆ బాలుడు. బాలాజీ లింక్‌ బస్టాండ్‌ దగ్గర ఉన్న సమయంలో వారి పక్కనే కిడ్నాప్‌ కూడా ఉన్నట్టు గుర్తించారు. సాహు కుటుంబం మాటల్లో ఉన్న సమయంలో పడుకుని పేపర్‌ చదువుతూ ఉన్న ఆ కిడ్నాప్‌ వారి మాటలను వింటూ అన్ని గమనిస్తూ వచ్చాడు. ఆ తర్వాత పక్కా ప్లాన్‌ ప్రకారం కిడ్నాప్‌కు స్కెచ్‌ వేసినట్టు తెలుస్తోంది.

ఆ తర్వాత రాత్రి 9 గంటల తర్వాత బాలుడిని తీసుకుని వెళ్లాడు కిడ్నాప్‌. సీసీటీవీ కెమెరాలో రికార్డయిన దాన్ని బట్టి చూస్తే రాత్రి 9 గంటల 8 నిమిషాల ప్రాంతంలో ఓ చోట నుంచి బాలుడిని తీసుకెళ్తూ కనిపించాడు. అంటే ఉదయం నుంచి ఆ కిడ్నాప్‌ వారిని గమనిస్తూ వచ్చినట్టు అర్దమవుతోంది. వారి వెంటే ఉంటూ.. టైం చూసుకుని బాలుడిని తీసుకెళ్లాడు.

అయితే బాలుడు అతనితో కలిసి వెళ్లడంపై అనేక అనుమానాలకు తావిస్తోంది. గుర్తు తెలియని వ్యక్తి తీసుకెళ్తుంటే ఎలాంటి అల్లరి చేయలేదు. చేతిని పట్టుకుని తీసుకెళ్తుంటే.. అలాగే నడుచుకుంటూ వెళ్లిపోయాడు. తల్లిదండ్రులు కాదని తెలిసినా ఆ బాలుడు అతనితో ఎలా వెళ్లగలిగాడు. అతనికి ఏ మాటలు చెప్పి ఉంటాడు. లేదంటే వారి కుటుంబానికి ఏమైనా తెలిసిన వ్యక్తే ఈ పనిచేశాడా అన్న అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. బాలుడి కిడ్నాప్‌ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు.

Also Read:

AP Drug Mafia: సుద్దబిళ్లలతో నకిలీ మందులు తయారుచేసి మార్కెట్‌లోకి వదిలారు.. ఏపీలో డ్రగ్ దందా !

ఒకటి కాదు.. రెండు కాదు కుప్పలు తెప్పలుగా పాములు… కన్నంలో నుంచి బుసలు కొడుతూ వచ్చాయి.. చివరకు

యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎