తిరుపతి క్షేత్రం వెయ్యేళ్ళ చరిత్రకు సాక్షి.. చిన్న లోపంతో పూజకు నోచుకోని గోవిందరాజస్వామి విగ్రహ కథ తెలుసా..!

కలియుగ వైకుంఠము తిరుపతి పట్టణంలో చుట్టు పక్కలా ఎన్నో పౌరాణిక, చారిత్రిక ప్రసిద్ది చెందిన ఆలయాలు, నిర్మాణాలు, తీర్థాలు ఉన్నాయి. సప్తగిరుల పైన శ్రీవారు కొలువుతీరి ఉండగా, పర్వత...

తిరుపతి క్షేత్రం వెయ్యేళ్ళ చరిత్రకు సాక్షి.. చిన్న లోపంతో  పూజకు నోచుకోని గోవిందరాజస్వామి విగ్రహ కథ తెలుసా..!
Follow us
Surya Kala

|

Updated on: Mar 04, 2021 | 11:03 AM

Govindaraja Idol : కలియుగ వైకుంఠము తిరుపతి పట్టణంలో చుట్టు పక్కలా ఎన్నో పౌరాణిక, చారిత్రిక ప్రసిద్ది చెందిన ఆలయాలు, నిర్మాణాలు, తీర్థాలు ఉన్నాయి. సప్తగిరుల పైన శ్రీవారు కొలువుతీరి ఉండగా, పర్వత పాదాల వద్ద ఆయన సోదరుడు శ్రీ గోవింద రాజ స్వామి వెలసి ఉంటారు. తిరుమల శ్రీనివాసునికి అన్నగారైన గోవింద రాజస్వామి తిరుపతి వైభవాన్ని మరింత పెంచాడు. ఒకప్పుడు చిదంబరంలో ఉండే గోవింద రాజస్వామి రామానుజాచార్యుల చొరవతో తిరుపతికి తరలివచ్చారు. అయితే ఇప్పుడు గోవింద రాజస్వామి ఆలయంలో మనం చూస్తున్న విగ్రహం సుద్దతో చేసిన విగ్రహం. సాధారణంగా ఎక్కడైనా రాతి విగ్రహాలు ఉంటాయి, ఇక్కడ కూడా తొలుత రాతి విగ్రహాన్నే ఏర్పాటు చేయాలని చేయించారు. కానీ సుద్ద విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆ రాతి విగ్రహం ఏమైంది… సుద్ద విగ్రహాన్ని ఎందుకు ప్రతిష్టించాల్సి వచ్చిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

చిదంబరంలో నటరాజ స్వామితో సమానంగా పూజలు అందుకుంటున్న గోవిందరాజ స్వామిని కుళోత్తుంగ చోళుడు స్థాన భ్రష్ఠం చేసి సముద్రం పాలు చేశాడు. అదే సమయంలో కొందరు భక్తులు గోవింద రాజస్వామి ఉత్సవ మూర్తిని తీసుకుని తిరుపతి వచ్చారు. అప్పుడు రామానుజాచార్యుల వారు కూడా తిరుపతిలోనే ఉండేవారు. స్వామి వారి పరిస్థితిని తెలుసుకున్న రామానుజులు… ఆ సుందర ఉత్సవ విగ్రహాన్ని చూడగానే ఆయనకు స్వామి వారికొక ఆలయాన్ని ఇక్కడ నిర్మించాలన్న తలంపు కలిగింది. స్థానిక పాలకుడైన యాదవ రాజు గురు దేవుల అభిమతం తెలుసుకొని నేటి శ్రీ గోవింద రాజ స్వామి ఆలయాన్ని 1130 వ సంవత్సరంలో నిర్మించారు. తదనంతర కాలంలో ఎన్నో రాజ వంశాలు స్వామిని సేవించుకొన్నారు. విజయనగర రాజులు అందరికన్నా అధికంగా ఆలయాభివ్రుద్దికి తమ వంతు సేవలను అందించారు. అద్భుతమైన నగరంగా గోవింద రాజస్వామి ఆలయం రూపు దిద్దుకుంది.

విగ్రహం కథ :

యాదవ రాజు మూల విరాట్టును మలచే పనిని కొందరు నిష్ణాతులైన శిల్పులకు అప్పగించారు. కాని ఎలా జరిగిందో తెలియదు కాని విగ్రహంలో చిన్న లోపం ఉండటం వలన ప్రతిష్టాపన అర్హతను పొందలేక పోయింది. అందులో కొన్ని లోపాను గుర్తించిన రామానుజుల వారు మరో విగ్రహాన్ని చెక్కాలని సూచించారు.

కొన్ని అనివార్య కారణాల వల్ల రామానుజుల వారు దేశ పర్యటనకు వెళ్ళాల్సి సమయం ఆసన్నమవడంతో మరో విగ్రహాన్ని చెక్కించే అవకాశం లేక సుద్దతో మూర్తిని చేసి ప్రతిష్టించారు. నాటి నుంచి నేటి వరకూ సుద్ద విగ్రహమే గోవింద రాజస్వామి ఆలయంలో పూజలు అందుకుంటుంది. అందుకే ఇక్కడ స్వామికి అభిషేకాలు ఉండవు. నూనెను మాత్రమే పూస్తారు.

రాతి విగ్రహం ఏమైంది..?

నల్లరాతి మీద సుందరంగా శయన భంగిమలో మలచిన మూర్తి లోని లోపమేమిటో సామాన్యులమైన మనకు అర్దం కాదు. చూడగానే మనస్సులలో భక్తి భావం కలుగుతుంది. మొదట చెక్కిన మూర్తిని ఒక పెద్ద వట వృక్షం క్రింద, తిరుపతిలో మంచినీటి కుంటగా పిలిచే నృసింహ తీర్థం వద్ద గోవింద రాజస్వామి రాతి విగ్రహాన్ని ఉంచారు. నాటి నుంచి నేటి వరకూ ఆలనా పాలనా లేక ఆ విగ్రహం అక్కడే ఉంది. ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. చాలా మంది స్థానికులకు కూడా తెలియని స్థితిలో దర్శనమిస్తుంది వెయ్యి సంవత్సరాల చరిత్రకు మౌన సాక్షి అయిన ఈ మూర్తి.

దర్శనం చేసుకునే విధానం :

మీరు కూడా చూడాలనుకుంటే.. తిరుపతి రామచంద్ర పుష్కరిణి ఎదురుగా ఉండే మంచి నీటి కుంట వద్ద చూడవచ్చు. తీర్థం లోనికి వెళ్ళడానికి అవకాశం లేదు. చుట్టూ కట్టిన ప్రహరీ గోడకు ఉన్న రంద్రాల నుండే వీక్షించే అవకాశం లభిస్తుంది. తొలినాటి తిరుపతి చరిత్రను తెలిపే ఈ అపురూప విగ్రహాన్ని ప్రజల సందర్శనార్ధం ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. గత చరిత్రకు దర్పణంగా నిలిచే ఇలాంటి వాటి విషయంలో ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కుంట వెనక పురాతన మండపాలు కనపడతాయి.

ఎలా వెళ్లాలంటే.. :

తిరుపతి రైల్వే స్టేషన్ నుండి సుమారు నాలుగు కిలో మీటర్ల దూరంలో ఉన్న మంచి నీళ్ళ కుంటకు సులభంగా ఆటోలో చేరుకోవచ్చును. అలా పూజలు అందుకోవలసిన గోవింద రాజ స్వామి… చిన్న లోపాల కారణంగా ఆరు బయటే కొలువ తీరాల్సి వచ్చింది. సుద్దతో చేసిన స్వామి ఆలయంలో వైభవోపేతంగా వెలిగిపోతున్నారు.

Also Read:

 దీపకు ఘోర అవమానం.. అమ్మ , నాన్నా ఎవరు కావాలో మీరే తేల్చుకోండి అంటూ చాయిస్ పిల్లలకే ఇచ్చేసింది

తమిళ చిన్నమ్మ హఠాత్ నిర్ణయం, షాక్ తిన్న తంబీలు, డైలమాలో బీజేపీ, ఏఐ డీఎంకె మౌనం